Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Edureeta (1977)




చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ, జయసుధ
దర్శకత్వం: వి. మధుసూదనరావు
నిర్మాత: శాఖమూరి రామచంద్రరావు
విడుదల తేది: 22.07.1977



Songs List:



గోదావరి వరదలో పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
గోదావరి వరదలో
రాదారి పడవల్లే 
నీ దారి నీదే నన్నా
ఉయ్యాల లూగె యీ జగమంతా
ఊహల కందని వింత
ఈ లాహిరిలో నీ వెంత

చరణం: 1
తానొక చోట తాడొక చేత తోలు బొమ్మల ఆట
కోరిన రేపు చేరని నావ - పెదవి కందని పాట
అయ్యారే ! మన జీవితమంతా ఆశ నిరాశల సంత
ఈ లాహిరిలో నీ వెంత

చరణం: 2
నింగీ నేల బంతులాటలో సంజ వెలుగుల సయ్యాట
ఏటిగాలికి నీటి వాలుకీ ఎదురీతే బ్రతుకంట
ఓ బాటసారీ : రేవును చేరి
నావలు మరిచే వంట.... అవి దేవుని దేవెనలంట 



ఈ రాధ చివరికి ఏమైనా పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల 

పల్లవి: 
ఈ రాధ చివరికి ఏమైనా ఆ గాధ నీదేలే
కలలన్ని అలలైన యమునానదిలో కలతల కన్నీరే

చరణం: 1
బృందావనిలో బిగి కౌగిలిలో
అల్లిక లేమాయె .... కలయిక లేమాయె
వ్రేపల్లియలో  వేణువు యెదలో - గీతిక లేమాయె
మధురాపురిలో నడిరాతిరిలో - మాధవుడేమాయె

చరణం: 
మరుమల్లెలలో విరిజల్లులలో
మల్లిక లేమాయె .... మధురిమలేమాయె
ఆ కన్నులలో వెన్నెల గాచిన పున్నమలేమాయె
చేసిన బాసలు .... పూచిన ఆశలు
రాలిన పూలాయే




తొలిసారి ముద్దివ్వమందీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం:  పి.సుశీల, యస్.పి.బాలు 

పల్లవి:
తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

చరణం: 1
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం

నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయే
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా

చరణం: 2
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం 
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం 
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం

నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నవ్వులలోనే వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే

ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

చరణం: 3
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా

నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
నులివెచ్చన కాదా మనసిచ్చిన రేయి
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా




తాగితే ఉయ్యాల ....పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు 

పల్లవి: 
తాగితే ఉయ్యాల .... ఊగితే జంపాల
తాగమంటె తంటారా ....తాగకుంటె యెట్టారా
తాగి ఊగి ఊరేగి  తైతక్క లాడర నాయ్యాల

చరణం: 1
ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు.
నెత్తురు తాగి తాగే .... మత్తెక్కి వున్నావు
పంచాయతి బోర్డు ప్రెసిడెంటు వైనావు
కంచె నువ్వనుకుంటే చేనే మేసేపు
హ: నక్కి నక్కి చూస్తావేరా
నక్కా జిత్తుల నాయాలా

చరణం: 2
బ్లాకు మార్కెట్టుచేసి లోకుల్ని దోచావు
సర్కారు కన్నుగప్పి నేరాలు చేశావు
కొంపలెన్నో తీసి ..... గొప్పోడివై నావు
నమ్మినోళ్ళను నీవు ..... నట్టేట ముంచావు
మీసాలు తీసెయ్యరా మోసాల భూషయ్యా




బాలరాజు బంగారు సామి పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
హే... హత్తేరికీ
యేహే ఆహో ఓహో
యేహే అహ ఓహో

హే... హత్తేరికీ

బాలరాజు బంగారు సామి
కోరస్: థద్ధినక - హ్హ - థినక
బాలరాజు బంగారు సామి
ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
బాలరాజు బంగారు సామి
ఏ తల్లి కన్నదో రాజా నిన్ను

ఓహో ఓహో హో...
ఓహో ఓహో ఓ...

చరణం: 1
ఆత్మీయమైన మీ అభిమానమునకు
ఆనందమున మేను పరవశించినదీ
మీ అండయే నాకు కొండంత బలమూ
మరచిపోలేను ఓ ఓ మీ అనురాగము

హే... హత్తేరికీ
నీవు నడిచే బాట మల్లె పూతోట
ఆహ ఆహ ఆ...
నీ మాటయే మాకు ముత్యాల మూట
ఒహో ఒహో హో
నీవు నడిచే బాట మల్లె పూతోట
నీ మాటయే మాకు ముత్యాల మూట
ప్రజాసేవకే పుట్టావయ్యా
పదిమందికి బిక్ష పెట్టావయ్యా

బాలరాజు బంగారు సామి
కోరస్: థద్ధినక - హ్హ - థినక
ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
బాలరాజు బంగారు సామి

చరణం: 2
కరిగితే పసిడికీ కాంతీ వస్తుందీ
త్యాగమే మనిషికి విలువ తెస్తుందీ
నే కన్న కలలన్నీ నిజమాయే నేడు
ఫలితమ్ము రాకుండా ఎవడాపలేరు

హే... హత్తేరికీ
మంచికి నీవు మారుపేరయ్య
ఆహ ఆహ ఆ...
మనుషుల్లోన దేవుడవయ్యా
ఒహో ఒహో హో...

మంచికి నీవు మారుపేరయ్య
మనుషుల్లోన దేవుడవయ్యా
ఊరికొక్కడు నీబోటి వాడుంటే
దేశమెన్నడో సౌభాగ్యమయ్యేది

బాల రాజు బంగారు సామి
కోరస్: థద్ధినక - హ్హ - థినక
బాలరాజు బంగారు సామి
కోరస్: థద్ధినక - హ్హ - థినక
ఏ తల్లి కన్నదో రాజా నిన్ను
బాలరాజు బంగారు సామి




ఎదురీతకు అంతంలేదా పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురీత (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా
ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం
ఎనాడైనా వికసించి రాదా

ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం: 1
సాగరమే నా చేరువ నున్నా దాహం తీరదులే
తీరాలేవో చేరుతు వున్నా దూరం మారదులే
ఇది నడియేట తీరాల వేట 
ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం: 2
చేయని నేరం చెలిమిని కూడ మాయం చేసేనా
మాసిన మదిలో మమతలు కూడ గాయం చేసేనా
నాయనువారే పగవారైతే
ఇంకెన్నాళ్ళూ ఈ ఎదురీత

ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా
వాడిన ప్రేమ వసంతం
ఏనాడైనా వికసించి రాదా

ఎదురీతకు అంతంలేదా
నా మదిలో రేగే గాయం మానిపోదా

No comments

Most Recent

Default