Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kadaladu Vadaladu (1969)


చిత్రం: కదలడు వదలడు (1969)
సంగీతం: టి.వి. రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, జయలలిత
దర్శకత్వం: బి. విఠలాచార్య
నిర్మాతలు: కె. సీతారామస్వామి, జి. సుబ్బారావు
విడుదల తేది: 09.07.1969







చిత్రం: కదలడు వదలడు (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
కట్టుకో కట్టుకో గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో పెళ్ళిబొట్టు
చుక్కలాంటి చిన్నదాన
జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి చిన్నదాన
జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో పట్టుపావడ
పట్టుకో పట్టుకో పూలదండ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం: 1
నీ కులుకులు చూస్తుంటే ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే లోకంతో పని లేదు
నీ కులుకులు చూస్తుంటే ఆకలి కానే కాదు
నీ కన్నుల నీడ ఉంటే లోకంతో పని లేదు

చేతులు చేతులు కలిపి పోదామా పోదామా
హై చెక్కిలి చెక్కిలి కలిపి ఉందామా ఉందామా
నా చిలిపి తుమ్మెద రాజా

చుట్టుకో చుట్టుకో పట్టుపావడ
పట్టుకో పట్టుకో పూలదండ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ

చరణం: 2
ముత్యాల పందింట్లో మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో ముద్దుగ చెల్లిస్తావా
ముత్యాల పందింట్లో మూడుముళ్ళు వేస్తావా
మురిపాల మబ్బుల్లో ముద్దుగ చెల్లిస్తావా

చుక్కల పల్లకి తెస్తా భలేగా భలేగా
చక్కిలి గింతలు చేస్తా ఇలాగా ఇలాగా
ఓ చక్కర నవ్వుల రాణీ

కట్టుకో కట్టుకో గళ్ళచీర
పెట్టుకో పెట్టుకో పెళ్ళిబొట్టు
చుక్కలాంటి చిన్నదాన
జున్ను ముక్కలాగ ఉన్నదాన
చుక్కలాంటి చిన్నదాన
జున్ను ముక్కలాగ ఉన్నదాన

చుట్టుకో చుట్టుకో పట్టుపావడ
పట్టుకో పట్టుకో పూలదండ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ
కోడే కారు చిన్నవాడ
నిన్ను వీడలేనోయ్ వన్నెకాడ







చిత్రం: కదలడు వదలడు (1969)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఓ...ఓ...ఓ...
ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ఇస్తావా... అందిస్తావా
అందిస్తావా...నీ నవ్వులు
అవి ఎన్నడు వాడని పువ్వులు

చరణం: 1
కళ్ళలోన నీ రూపే కళ కళలాడుతు ఉంటే
కళ్ళలోన నీ రూపే కళ కళలాడుతు ఉంటే
కలలోన నీ చూపే గిలిగింతలు పెడుతుంటే
కలలోన నీ చూపే గిలిగింతలు పెడుతుంటే
నా మనసే నీదైతే నా బ్రతుకే నీదైతే
ఇవ్వాలని అడగాలా ఇంకా నాతో సరసాలా
ఇంకా నాతో సరసాలా

ఓ...ఓ...ఓ...
వలపులోలికే అత్త కొడుకా చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక వస్తావా కవ్విస్తావా
నువ్వు వస్తావా నా బాటలో
వసి వాడని పరువపు తోటలో

చరణం: 2
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
తోటలోన నీవుంటే తోడుగ నేనుంటాను
తోటలోన నీవుంటే తోడుగ నేనుంటాను

నాలోనే నీవుంటే నీలోనే నేనుంటే
ఇంకేమి కావాలి ఇలపై స్వర్గం నిలవాలి
ఇలపై స్వర్గం నిలవాలి

ఓ...ఓ...ఓ...
ముద్దులోలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి

ఓ...ఓ...ఓ...
వలపులోలికే అత్తకొడుకా చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక







No comments

Most Recent

Default