Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manushulu Marali (1969)




చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, హరనాథ్, శారద, కాంచన
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సహాయ దర్శకులు: కె. రాఘవేంద్ర రావు, ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణ సంస్థ: జెమిని స్టూడియో
విడుదల తేది: 02.10.1969



Songs List:



అమ్మా అమ్మా కనుమూశావా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: 
గానం: ఘంటసాల 

అమ్మా అమ్మా కనుమూశావా




అరుణ పతాకం ఎగిరింది పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: 
గానం: 

అరుణ పతాకం ఎగిరింది 



భూమాత ఈనాడు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: 
గానం: పి. సుశీల, పి. లీల 

భూమాత ఈనాడు 





చీకటిలో కారు చీకటిలో పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల 

పల్లవి :
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో... ఏ దెసకో...
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో... ఏ దెసకో...

చరణం : 1
మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనిషే లేని మౌనంలోన
మనుగడ చీకటి మయమైపోయె
లేరెవరూ... నీకెవరూ...
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో... ఏ దెసకో...

చరణం : 2
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలే లేని లోకంలోన
దారే లేని మనిషివి నీవే
లేరెవరూ... నీకెవరూ...
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో... ఏ దెసకో...




హాలిడే జోలిడే పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, బి. వసంత , పి. సుశీల

హాలిడే జోలిడే 




మారాలి మారాలి మనుషులు మారాలి పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: 
గానం: టి.సుందరరాజన్

మారాలి మారాలి మనుషులు మారాలి 




పాపాయి నవ్వాలి పండగే రావాలి పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..
పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..

పాపాయి నవ్వినా, పండగే వచ్చినా
పేదల కన్నుల కన్నీరే..
పాపాయి నవ్వినా, పండగే వచ్చినా
పేదల కన్నుల కన్నీరే..
నిరు పేదల కన్నుల కన్నీరే..

పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..


కార్తీక మాసాన ఆకాశ మార్గాన

కనువిందు చేసేను జా..బిల్లీ
కార్తీక మాసాన ఆకాశ మార్గాన
కనువిందు చేసేను జా..బిల్లీ

ఆషాడ మాసాన మేఘాల చెరలోన
అల్లా..డి పోయెను జాబిల్లీ..
ఆషాడ మాసాన మేఘాల చెరలోన
అల్లా..డి పోయెను జాబిల్లీ..
అల్లాడి పోయెను జాబిల్లీ..

నిద్దురపో.. నిద్దురపో..
ముద్దుల పా..పా నిద్దురపో..
నిద్దురపో.. నిద్దురపో..
ముద్దుల పా..పా నిద్దురపో..
పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..


వైశాఖ మాసాన భూదేవి సిగలోన
మరుమల్లె చెండౌను జా..బిల్లీ..

శ్రావణ మాసాన జడివాన ఒడిలోన
కన్నీ..టి కడవౌను జాబిల్లీ..
కన్నీటి కడవౌను జాబిల్లీ..

నిద్దురపో.. నిద్దురపో..
ముద్దుల పా..పా నిద్దురపో..
నిద్దురపో.. నిద్దురపో..
ముద్దుల పా..పా నిద్దురపో..

పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..
పాపాయి నవ్వాలి పండగే రావాలి
మా ఇంట కురవాలి పన్నీరూ..





తూరుపు సింధూరపు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మారాలి (1969)
సంగీతం: కె.వి..మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

పల్లవి:
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం

మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం
మరల మరల ప్రతిఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం

చరణం: 1
వేలవేల వత్సరాల కేళిలో
మానవుడుదయించిన శుభవేళలో
వేలవేల వత్సరాల కేళిలో
మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు
పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే మలిచే కాంతి తోరణాలు

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం

చరణం: 2
వలపులోన పులకరించు కన్నులతో
చెలిని చేరి పలుకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో
ప్రియుని చూచి పరవశించె ప్రియురాలు
జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం
ప్రేమంటే ఒక భోగం
కాదు కాదు అది త్యాగం

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం


No comments

Most Recent

Default