Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Neevalle Neevalle (2007)









చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హేరిష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరిచరణ్, స్వర్ణలత
నటీనటులు: వినయ్ రాయ్, సదా, తనీషా ముఖర్జీ
దర్శకత్వం: జీవా
నిర్మాత: ఎ.కె.రమణ, పి. విజయ్ కుమార్
సహ నిర్మాత: డి. రమేష్ బాబు
విడుదల తేది: 14.04.2007

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా
వళ్లంతా వగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

విరహ వ్యధతో కృషించు ఎదలో
నిప్పుల్ని పోసి ఆనందమనకే
నీవంటే ప్రాణం చెలీ ఓహ 
అందవ సాయం సఖి

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

సావాసం చేసి దూరంగా ఉన్నా
తప్పేదో గుండెల్లో నా రొద పెడితే
కన్నా నీ మాటా కదిరించే నన్నూ
కాలం నీ ఆయుధం

ఇదో ఎదలోన విరిసిన కలా ఎరుగవ నన్నే
ఆలా ఎదురేగి అడిగితే ఎలా నిలువగా లేనోయ్
హో కాలం గాలం వేసిందంటే
గంధం పుష్పం చేయ్యా స్నేహం

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

హోయ్ వళ్లంతా నగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

ఊరిస్తే ఎలా వెచ్చంగా హలా
పూవంటి నే నీ మీద పడిపోనామ్మా
అవునంటే గోలా అది నీకు మేళా
తేల్చి కవ్వించుకో

సెగే చెలరేగి వయసుల వ్యదై 
అలుగుతూ ఉంటే
మదే శృతి మించి తనువున సెగై 
తరుముతు ఉంటే
ఆహ్ మోహావేశం దాహావేశం 
తీర్థం పొస్తే తగేదేనా

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

హో వళ్లంతా వగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

ఓహ విరహవ్యధతో కృషించు ఎదలో
గుబులు రేపి ఆనందం అనకూ
నీవంటే ప్రాణం ప్రియా 
ఓహ్ అందీవ సాయం సఖా
నవంటే ప్రాణం ప్రియా
ఓహ్ అందీవ సాయం సఖా







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: క్రిష్, కార్తీక్, హరిణి

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చినదానా
ఒక చిన్న కల ఉంది
వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
హో ఒకపక్క చనువుంది
నీకోసం తపనుంది
అవమానం భరియించి యాచించా

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా (2)

ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లే
కనిపించే వయ్యారి నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకింపై నీ బాట పట్టానే..
కడతేర్చ వస్తావో వ్యధపాలు చేస్తావో

ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే
సెల్యమై సెల్యమై సంచారి నయినానే

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా (2)

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చినదానా

నీ వెంబడి వచ్చాక 
నా నన్నిక పోయాక
మదినేదో పరితాపం
కుదిపెనే తొలిమోహం

తప్పేదో తెలియదు లే
ఒప్పేదో తెలియదు లే
ఏ పక్కన ఉన్నానో 
అది కూడా తెలియదు లే

అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం
ఏ క్షణం పోవునో ఎదలోని ఈ మౌనం

నీవల్లే నీవల్లే ఉన్నానే చెలికాడా
నీముందే నీముందే మెల్లంగా నిలిచాగా

ఒక చిన్న కల ఉంది
వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
ఒక పక్క చనువుంది
ఉబికొచ్చే తపనుంది
అభిమానం పదమంటే యాచించా







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: క్రిష్, అరుణ్

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఏమిటో తలవద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండ్
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటా రారా - ప్రేమా (2)

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

అలరించే పరిమళమా
వినలేవా కలవరమా
కింద భూమి అంది
ఆటే ఆడమంది

నింగే నీకు హద్దు
సందేహాలు వద్దు
ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయ్
అను నిమిషం మనసుని మురిపించేయ్
ఏ పువ్వుల్లోనూ కన్నీళ్ళనీ చూడలేదే

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

సాగిపోమ్మా పసి మనసా
తూలిపోమ్మా పూల ఒడిలో
శిల్పి చిరతత్వం శిల చెక్కడమే
మగువల తీరు తప్పులెంచడమే
గొప్ప వాళ్లలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం
వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం
ఈ లోకంలోన ఉన్నోడెవడూ 
రాముడు కాడోయ్ ఓహ్

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఏమిటో తలవద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండ్
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటా రారా - ప్రేమా (2)







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: నరేష్ అయ్యర్ షాలిని సింగ్

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
నా గుండె పాడుతున్నది ఏదేదో నేర్చుకున్నదీ
అయ్యయ్యో వద్దన్నా వినదోయమ్మా
ఏదేదో అవుతున్నా ఎట్టాగమ్మా హో జావేజా

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం

నలు దశల అల్లుకున్న ప్రేమా
తనువంతా చుట్టుకుంటే మామ
ఏమి వింతో కొత్తగుందీ అనుభవం
మొదలైతే ముత్యమంత ప్రేమా
మనసుల్నే ముంచుతుందే భామా
పట్టుకుంటే వదలదులే అది నిజం
వాహువో హో వాహువో
ప్రేమ సంద్రం కీ దగ్గరాయే ప్రేమ చేరనివ్వలేదే

మొదలీనాడు సఖుడా చూడూ
మెల్లంగ నను మార్చడం తెలిసింది నీకీ క్షణం

హృదయంలో ప్రేమ చలి చూడూ
లేకుంటే నువవ్వుతావు బీడూ
దూరమైతే మోడవదోయ్ జీవితం హో ఓహ్ ఓహో
పెదవులతో ప్రేమ అను మాటా
ఎత్తితేనే వచ్చునంట తంటా
జీవితాంతం నిదరుండదు అది నిజం
ఆహ హాహా వాహువో
వ్యధలెన్నో ఉన్నా లవ్ లో అదియు సుఖమేగా

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
ఉప్పుని వజ్రం అనిపించే కనికట్టు ప్రేమే చేస్తుంది
అది ఇచ్చే సుఖాలు కొంచం కొంచం
వెంటాడు కష్టాలు భద్రం భద్రం ఓహో ఘోరీయే

ఓసన సోనా
ఓసన సోనా
ఓసన సోనా






No comments

Most Recent

Default