చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
నటీనటులు: యన్ టి. రామారావు, జయలలిత, రాజశ్రీ
దర్శకత్వం: జి. విశ్వనాథన్
నిర్మాత: యస్. భావన్నారాయణ
విడుదల తేది: 13.01.1967
చిత్రం: గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల , యస్.జానకి
ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే
ఒకసారి రాగానే ఏమౌనులే... ఏ...
పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా
చెమ్మోవి పై తేనె ఒలికించనా
చెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా
కేరింత లాడించి శోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా...ఆ... ఆ...
వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే
మరపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా
పదును తేరిన వలపు పండించరా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే
No comments
Post a Comment