Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Middle Class Melodies (2020)




చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాత: వెనిగళ్ళ ఆనందప్రసాద్
విడుదల తేది: 20.11.2020



Songs List:



ది గుంటూరు పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి

తెల్లారే ఊరంతా తయ్యారే
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే
తగ్గేదే లేదంటే ప్రతివాడే

మరుపే రాని ఊరేగుంటూరే
అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే

బేరం సారం సాగే దారుల్లోన
నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక
గాలం ఏసి పట్నం బజారు పిలిసే

యే పులిహోర దోశ - బ్రాడీపేట
బిర్యానికైతే - సుభాని మామ
వంకాయ బజ్జి - ఆరో లైను
గోంగూర చికెన్-బృందావనం
మసాల ముంత-సంగడిగుంట
మాలు పూరి - కొత్తపేట
చిట్టి ఇడ్లీ - లక్ష్మి పురం
అరె... చెక్క పకోడీ - మూడొంతెనలూ

గుటకే పడక కడుపే తిడితే
సజ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే
పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా
లేదన్నా మాటంటూ రాదంటా
సరదాపడితే పోదాం గుంటూరే




సంధ్యా పదపద పదమని పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: స్వీకర్ అగస్తి

సంధ్యా పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో
కాస్తయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం
ఏమైనా బాగుందా
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవిగుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా

సంధ్యా పదపద పదమని
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బందా

ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా

విసిరావో గురిచూసి 
వలపన్న బాణమే
పడిపోదా వలలోన
పిలగాడి ప్రాణమే

సంధ్యా  పదపద పదమని 
అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు
మొహమాటంతో ఇబ్బంద
నువు వణక్క, తొనక్క, బెరక్క
సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క
చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు
ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి
కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే



కీలుగుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకార్ అగస్తి , రమ్య బెహరా

కీలుగుర్రం




సాంబ శివ పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: పలనాడు జానపదం
గానం: రామ్ మిరియాల

సాంబ శివ 



మంచిదో చెడ్డదో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: విజయ్ ఏసుదాస్

మంచిదో చెడ్డదో రెంటికి మద్యేదో 
అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో
కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో
లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో

ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం
వేచి ఉంటె రాదారి చూపించదా
చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం
తప్పకుండ బదులైరాదా

మదిలోని చిరునవ్వు జన్మించగా
కలతే పోదా కనుమూయదా
నడిరేయి దరిచేరి మసి పూయగా
వెలుగేరాదా చెరిపేయదా
అరచేతి రేఖల్లో లేదంట రేపు
నిన్నల్ని వదిలేసి రావాలి చూపు
చూడొద్దు ఎదంటూ ఓదార్పు

వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ
ఉండిపోవు కడదాకా ఆనింగిలా
అంతమైతే కారాదు లోలోని దైర్యం
అంతులేని వ్యధలే ఉన్నా

సంద్రాన్ని పోలింది ఈ జీవితం
తెలిసి తీరాలి ఎదురీదడం
పొరపాటు కాదంటపడిపోవడం
ఉండాలో లేచే గుణం

ఎటువంటి ఆటంకమెదురైన గాని
మునుముందు కెల్లేటి అలవాటు మాని
కెరటాలు ఆగేటి రోజేదని
గంథాలన్నీ ఓనాడూ తీసేటి కాలం
వాస్తవాన్ని కళ్లారా చుపించదా
కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం
కిందపడ్డ తరువాతైనా

తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా
తానే నానా నానా తానే నానా నానేనా (2)




వెచ్చని మట్టిలో పాట సాహిత్యం

 
చిత్రం: మిడిల్ క్లాస్ మేలోడీస్ (2020)
సంగీతం: స్వీకర్ అగస్తి
సాహిత్యం: సాయికిరణ్
గానం: స్వీకర్ అగస్తి

వెచ్చని మట్టిలో నాటిన విత్తనం
ఊపిరందుకోదా చుక్క నీరు పట్టిన
రాతిరే కప్పిన దారులే తప్పిన
తెల్లవారనంద చీకటెంత కమ్మిన

తురుపింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

చిగురాకు పిలిచింది రారమ్మని
నీలాకాశాన మేఘలని
అటు నుండి బదులేది రాలేదని
అలిగిందా ఆ ఆమని

జరిగింది గమనించి ఆ చల్లగాలి
జోలాలి పాడింది తన చెంత చేరి
చినబోయిన ఆ చిన్న ప్రాణానికి

వేకువింట మొదలైన కిరణాల వేడి
లోకమంత అందాలు అందించదా
దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి
రంగులద్దుకుంటూ రాదా

No comments

Most Recent

Default