Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samsaram (1975)

చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి, కొసరజు, సి. నారాయణరెడ్డి
నటీనటులు:  యన్.టి.రామారావు, జమున, రోజారమని, జయసుధ, జయమాలిని
కథ: తాతినేని అన్నపూర్ణ
మాటలు: బమిడిపాటి రాధాకృష్ణ
దర్శక నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
బ్యానర్: అనీల్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 28.05.1975Songs List:మా పాప పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, సుశీల 

మాపాప పుట్టినరోజు
మరపురాని పండుగరోజు
కలతలన్నీ కరిగిపోగా
కలసి మెలసీ మురిసేరోజు 

మాపాప పుట్టినరోజు

చిందులు వేసే మాపాప
కంటికి విందులు చేయాలి
పెరిగి పెద్దదై చదువులు చదివి
పెద్దల మన్నన పొందాలి

మాపాప పుట్టినరోజు


మల్లెలలోనీ చల్లదనాలు
మనసులలో విరబూయాలి
మమతల దివ్వెల నవ్వులతో
మన యిల్లంతా వెలగాలి

మాపాప పుట్టినరోజు

యెవ్వరికీ తలవంచకనే
యెన్నడు నిరాశ చెందకనే
ఆత్మ గౌరవం పెంచుకొని
అడుగు ముందుకే వేయాలి

మాపాప పుట్టినరోజు

లేరా బుజ్జి మావా పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

లేరా !  బుజ్జి మామా
లేలేరా! బుల్లి మామా |
ఏటవతల గట్టు ఆగట్టుమీద చెట్టు
ఆ చెట్టు కింద పుట్ట ఆ పుట్ట మీద నువ్వు
బుజ్జి మామా |

పుట్టలోన పాముందిలా మామా!
బుసలుగొట్టు నాగుందిరా లే లే

కోరలున్న కోడెత్రాచురా
పొంచి పొంచి చూస్తున్నదిరా
నీళ్ళపామని తలచవద్దురా
వానపామని వదలవదురా
కళ్ళుమూసుకోకు, నువ్ ఒళ్ళు మరచిపోకు
నామాటనమ్మకుంటే, అవుతుంది. పెళ్ళినీకు
పుట్టతవ్వి పట్టాలిరా మామా
నేల కేసి కొట్టాలిరా లే లే

పడగ విప్పుతువున్నదిరా
ఖస్సుమని లేస్తున్నదిరా
ఎప్పుడెపుడంటున్నదిరా
విషముకక్కుతువున్నదిరా
పక్క పక్క నుంది అది నక్కి నక్కి ఉందీ...
కక్ష బట్టి ఉంది  కాపేసి కూర్చుంది
ప్రాణాలు తీస్తుందిరా మామా ! లే లే
తీయ తీయని పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ 

తీయ తీయని జీవితమంతా చేదై పోయింది
ప్రేమలు పొంగే గుండెలలోన
వేదన మిగిలింది - వేదనే మిగిలింది

తీయ తీయని

పెను సుడిగాలికి యెన్నో పువ్వులు
జలజల రాలినవి - జలజలారాలినవి

తీయ తీయని

పరిమళమంతా సుడిగాలులలో
కరిగి పోయింది - కరిగిపోయింది
గాలి నేరమా ? పూలనేరమా?
నేరం ఎవ్వరిది?

తీయ తీయని

రివ్వున ఎగిరి నింగినిసాగే
గువ్వకు గూడేది?
దారే లేని బాటసారికి
చేరే చోటేది? వేరే చోటేది
కళకళలాడే నీ సంసారం
కలగా మిగిలినది

తీయ తీయని

చీకటి కొంత, వెలుతురుకొంత - జీవితమింతేలే
కన్నీరైనా పన్నీ రైనా - కాలం ఆగదులే
బాధలు పొందిన సంసారంలో
స్వర్గాలున్నవిలే - “స్వర్గాలున్నవిలే"చిరు చిరు నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరజు
గానం: యస్.పి.బాలు, సరస్వతి 

చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్న వాడే
చీరకొంగు పట్టుకొని లాగా డే - నన్ను లాగా డే

చిరు చిరు నవ్వుల

బుగ్గమీద చెయ్యివేసి నిమిరాడే
సిగ్గులేని వాడెంత చిలిపివాడే
అప్పుడే మైందే?
ఒళ్ళంతా వేడి, వేడి గుండెల్లో దడదడ
ఒళ్ళంతా వేడి గుండెలో దడ
కళ్ళల్లో ఏదో మైకం... మైకం .... మైకం

చిరు చిరు నవ్వుల

తాగరా మనిషి అగరా
తాగి తాగి నిను నీపు మరచిపోరా
తాగరా మనిషి అగరా
తాగి తాగి నిను నీపు మరచిపోరా

సురలే తాగినారు అప్సరసలేతాగినారు
నీకోసం - నీ సౌఖ్యం కోసం నీవూ తాగరా |
జోరు జోరుగా తనివి తీరగా బాగా తాగరా
తాగు-తాగు తాగు 

తాగరా మనిషి అగరా
శకుంతల పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: మాధవపెద్ది సత్యం 

పద్యం: 1
కనుల కన్నీరు క్రమ్మిన కారణాన
బిడ్డ అందాల మోము కన్పించదాయె
పెంచినందుకెయింత చింతించుచుంటి
కన్న వారల వేదన యెన్న తరమే?

పద్యం: 2 
పెద్దల మాటలన్ వినుము పిన్నలపై దయ
జూపు మెప్పుడున్
వద్దెపుడైనన్ నీ విభుని పైనను కోపము
భోగభాగ్యముల్ మిద్దెలు మేడలున్ ధనము మిక్కిలిగా కలవంచు గర్వమే వద్దు
ఇవి సాధ్వీ యెల్లప్పుడు భావమునన్
తలపోయగావలెన్ఒంటరిగా ఉన్నాము పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: సి. నారాయణరెడ్డి
గానం: మాధవపెద్ది రమేష్, ఎస్.జానకి 

ఒంటరిగా ఉన్నాము
మన మిద్దరమే ఉన్నాము
ఉలక వెందుకు! పలక వెందుకు
బిడియమెందుకు! వలపువిందుకు
కలసిపోదాము రా రా

 ఒంటరిగా ఉన్నాము

ఎవరికంట బడినా ఏమనుకొంటూరు
పడచువాళ్ళ సరదా పోనీయంటారు
ఏదో గుబులు 
ఎందుకు దిగులు ఎగిరిపోదాము రారా! వంటరిగా

గువ్వజంట యేదొ గుస గుస లాడింది
వలపు ఓనమాలు దిద్దుకోమన్నది
ఇపుడేవద్దు
ఒక టే ముద్దు
రేపు చూద్దాము రా  రా

ఒంటరిగా ఉన్నాము

ఇంతమంచి సమయం ఎవుడు దొరుకుతుంది
మూడుముళ్లు పడనీ ప్రతిరోజు దొరుకుతుంది
అప్పటివరకు అల్లరివయసు
ఆగనంటుంది రా రా

ఒంటరిగా ఉన్నాముయవ్వనం పువ్వులాంటిది పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి 

యవ్వనం పువ్వులాంటిది
జీవితం రవ్వలాంటిది
లోకమే నీదిరా
ఆటల పాటల తియ్యని నవ్వుల తేలరా ! హా

యవ్వనం పువ్వులాంటిది

చీకూ చింతా నీ కెందుకూ
జల్సా చేద్దాం రా  ముందుకు
నచ్చిన చిన్నది రమ్మన్నదీ
వెచ్చని వలవులు యిమ్మన్నదీ
చక్కని చుక్కలు పక్కన ఉంటే
దిక్కులు చూస్తూ కూచుంటావేం రా రా

యవ్వనం పువ్వులాంటిది,

నిండు మనసుతో ప్రేమించుకో
నీలో ఆశలు పండించుకో
దొరికిన అందం దాచేసుకో
ఆ అనుభవమంతా దాచేసుకో
చేతికి చిక్కిన చక్కదనాలు
ఎగరేసుక పో! ఎగరేసుకపో!

యవ్వనం పువ్వులాంటిది,
సింగపూర్ రౌడీ పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1975)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరజ
గానం: యస్.పి.బాలు

సింగపూరు రౌడిన్రోయ్ నేను
చిచ్చుల పిడుగునురోయ్ నేను
కొమ్ములు తిరిగిన మొనగాల్నైనా
గొయ్యిదీసి గొంతురవకు పాతేస్తాను

సింగపూరు

సరుకులు కలీచేసేవాళ ను
ఎక్కడున్న పురుగేరేస్తాను
అబద్దాలతో కొంపలార్పితే
నిలువున చర్మం చీరేస్తాను

సింగపూరు

మంచితనంతో మసిలేవాళ్ళను
నెత్తిన బెట్టుక పూజిస్తా
కుట్రలుపన్నే గుంటనక్కలను
పీకపట్టుకొని నొక్కేస్తాను

సింగపూరు

ధర్మంకోసం నిలబడతా 
యమధర్మరాజు నే ఎదిరిస్తా
రౌడీలకు నే రౌడిన్రోయ్ ! పచ్చి
నెత్తురే తాగేస్తాను
జాం, జాంగా తాగేసా

సింగపూరు

No comments

Most Recent

Default