Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kala (2004)





చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
నటీనటులు: రాజా, నయన హర్షిత 
దర్శకత్వం: చిమ్మని మనోహర్ 
నిర్మాత: వై.రామచంద్రా రెడ్డి 
విడుదల తేది: 04.06.2004



Songs List:



స్వప్నా వాస్తవదత్త పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: వేటూరి
గానం: టిప్పు

పల్లవి:
స్వప్నా వాస్తవదత్త - అప్నే జాస్ కి రిష్తా
సత్తా మీకే చూపిస్తా
స్వర్గం నేలకు తెస్తా - శబ్దం బొమ్మను గీస్తా
సర్వం సొంతం అనిపిస్తా
ఆకాశం నీ హద్దు - అవకాశం పదలొద్దు
నేటి నీ సరిహద్దు - రేపంటూ గడపొద్దు
సరదాలకు పరదా వెయ్యొద్దు....

చరణం: 1
రంగులన్ని కలబోస్తే రంభ అవుతుందిరా
రంభ రాకతో పగలే రాతిరవుతుందిరా
ముచ్చతో అచ్చుపడ్డ జాబిలే వెచ్చన
ముచ్చటే గిచ్చుకుంటే తెచ్చుకో నిచ్చెన
లబ్ డబ్ దరువుల గప్ చిప్ గొడవల
లైఫే నాట్యం రా......
చిక్ బుక్ నడకల చకచక పరుగుల
రైలే నేస్తం రా
కలలోన నవ్వె కనుపాప - అల ఊయలూగే చిరుచేప
పనికోసమంత పడిగాపా - పరిచెయ్యి బ్రతుకునే చాప
దరాగా మీర్జాగాలిబ్బా! ....

చరణం: 2
డుమువులు కల్పిస్తే తెలుగు పుట్టిందిరా
తెలుగు పాటతో ఎదలో తేనె కురిసిందిరా
కూచిపూడి ఒడిలోనే మెరుపు మెరిసిందిరా
మువ్వమువ్వలో నటనే మేసు విరిచిందిరా
పాగరస్ ఉడుకుల - విగరస్ వయసుల
నడకే ట్రై చెయ్ రా....
సిలబస్ చదువుల - చిక్ లెట్ పెదవుల
పలుకే విడిచెయరా ......
పదిలెయ్యి పాతపిడివాదం
కలలింక చెయ్యి అనువాదం
గురిచూసి పెట్టు కుడిపాదం
గెలిచెయ్యి బ్రతుకునే పందెం
కాశ్మీర్లో కార్గిల్ హీరోలా ......





పూల జల్లువై పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: ఓరుగంటి ధర్మ తేజ
గానం: సుజాత మోహన్ 

పల్లవి:
పూల జల్లువై తేనె వెల్లువై
వెండి వెన్నెలై నిండు జాబిలై నన్నల్లుకో
చల్లగాలివైపిల్ల వాగువై
సన్న జాజులా కన్నె మోజులె వెదజల్లుకో
పరుగెత్తి నా మనసు పురివిప్పే వేళ
పరువాలు పులకించి పదునెక్కే వేళ
కలలన్ని నిజమే చేయవా

చరణం: 1
నీలి నీలి ఆకాశం నేల వాలే చూడు
పాలపొంగు పయసంతా కోరుకుంది తోడు
చిన్ని చిన్ని చినుకమ్మా చేసి వందనాలు
వన్నెలన్ని తడిమింది పూసి చందనాలు
కోయిలమ్మ గొంతులోన కొత్తరాగాలు
కానుకిచ్చి పెంచుతోంది గుండె వేగాలు
కలలన్నీ తీరే హాయిలో.......

చరణం: 2
తుమ్మెదమ్మ కోరేది పూల పరిమళాలు
వాగు వంక చేరేది ప్రేమ సాగరాలు
నింగిలోని జలసాల జంట పావురాలు
పచ్చనైన పాదపైన చేరి చుంబనాలు
ప్రేమ పంచే తోడు నాకు పంచప్రాణాలు
ప్రాణమిచ్చే నీడ వంకే నేటి పయనాలు
కలకాలం కరిగే హాయిలో.....




తకిట తకిట దిమిరే పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: వేటూరి 
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత జూనియర్

తకిట తకిట దిమిరే 

పల్లవి:
తకిట తకిట ధిమిరే తలాంగు తళుకదిరే
ఝనకు ఝనకులదిరే జాబిల్లి జతకుదిరే
పున్నమంటి నీనవ్వులో పూల మబ్బు ముసిరే
కొంగు జారిన కొత్తలో కొండగాలి విసిరే
ఒకసారే ఒడి సుఖసారే వలపులడారే వయసులగోదారే

చరణం: 1
అల్లరి మొగ్గల అందంలో అడిగేది ఒక్కటే
బంతులు వచ్చిన బందాలు బతికేది ఒళ్ళోనే
వెచ్చని వెన్నెల కన్నుల్లో వెతికేది ఒక్కటే
మెత్తని మల్లెల మోహంతో మొదలయ్యే దాహాలే
కులాసాగ పాడుకున్న ఎదురొచ్చే వయసుల్లో
గులాజీలు గిల్లిపోకు ఎదనిచ్చే మనసుల్లో
తెరతీసి వెన్నెలు దోచి కన్నులు పూసే సన్న జాజుల్లో

చరణం: 2
విప్పని చెప్పని ఊసుల్లో వినిపించే కోరిక
నిప్పుల పువ్వుల తోటల్లో విరహించే రాధిక
కన్నుల నల్లని మేఘంలో మెరుపంటె చూపుగ
ఎర్రని కుర్రని ముద్దుల్లో అలకెంతో తీపిగ
వసంతాలు చల్లుకున్న వలపెంటి గొడవల్లో
గుణింతాలు దిద్దుకుండాం తొలిప్రేమ చదువుల్లో
ఎడచాటో ఏ పొదచాటో తుమ్మెద పాటో కమ్మని పొరపొటో



ప్రియరాగాలనే పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: యస్.పి.బాలు, చిత్ర 

పల్లవి:
ప్రియరాగాలనే పలికించావులే
నయగారాలనే ఒలికించావులే
మల్లెపూవల్లె విచ్చావులే
నువ్వు నాకెంత నచ్చావులే
ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే
నిండు మనసంత ఇచ్చావులే
అందుకే నిన్ను మెచ్చానులే .....

చరణం: 1
చినుకంత స్నేహం కోరిందని - గగనాల మేఘం ఇల చేరగా
ఇన్నాళ్ళ దాహం తీరిందని - చిగురాకు ప్రాణం పులకించదా
కలల్లోని ఆ స్వర్గం ఇలా చేతికందింది.
నిజంలోని ఆనందం మనస్సంత నిండింది
నీకుతోడుండి పొమ్మన్నది
నన్ను నీవెంట రమ్మన్నది...

చరణం: 2
బతుకంటే అర్ధం చెబుతానని - నడిపింది హృదయం నీదారిని
ఈ గాలి పయనం ఎన్నాళ్ళని - నీ ప్రేమ బంధం నన్నాపని
ఋణం ఏదో మిగిలింది. అదేవిన్ను కలిపింది
మరీ ఆశ కలిగింది. మరో జన్మ అడిగింది
నిన్ను ప్రేమించుకోమన్నది
ప్రేమునే పంచుకోమన్నది .....




కల అంటె నీవా ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: కార్తీక్ 

పల్లవి:
కల అంటె నీవా ప్రేమా
కలవంటె నమ్మానమ్మా
కలకాలముంటావంటే ఈ గుండెలో
కలగానే మిగిలావమ్మా నా కళ్ళల్లో...
ఓ ప్రేమా...... ఓ ప్రేమా......

చరణం: 1
మనసు మనసులో కలపని మనిషి - మనిషి కాడనీ
బ్రతుకు బ్రతుకుతో ముడిపడిపోతే-పండగేననీ
కలలన్నవే కొలువుండని కనులన్ని దండగనీ
వలపన్నదే రుచి చూడని ఈ జన్మ ఎందుకనీ
పన్నీరులే చిలికించుతూ కన్నీరు నింపావే.......

చరణం: 
కనుల ఎదురుగా నిలిచి నీవే - కంటి చుక్కవా
మరల తిరిగి ఇక రాలేనన్న - నింగి చుక్కవా
విషమించిన విధితోటలో విరజాజ విరిసేనా
మసకేసిన నిశిరాతిరై నెలవంక వెలిగేనా
ఎదకోసిన ఎడబాటుతో నేనింక నేనేనా .....




మరుమల్లె చెండు పాట సాహిత్యం

 
చిత్రం:కల (2004)
సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బి.చరణ్ , ఫెబి

పల్లవి:
మరుమల్లె చెండు నవ్వే - మావిళ్ళ పండు నవ్వే
మందార సందె పొద్దుల్లో - ప్రాణాలు ఆరు నువ్వే
ప్రాయాల జోరు నువ్వే - పసినిమ్మపండే పంటల్లో
అండాలమ్మ ఆకారం - జాబిలమ్మ జాగారం దూరంకాని సిందూరంలో
గీతంలోనే గోవిందం గిల్లీ కజ్జా సంబంధం - గుండే నిండే ఆనందంలో
రే హుర్రే పుట్టింది నాకు వెర్రే- సే సర్రే కుట్టింది ప్రేమజర్రే

చరణం: 1
పాలరాతి చెమ్మ- మురిపాల పూల రెమ్మ - జారింది తారమ్మ
చెక్కినాడు బ్రహ్మ - ఈ చక్కనైన బొమ్మ చాలంది నాజన్మ
తొలుత వలపు తెలిపే - పిదవ మనసు కలిపే
కలికి చిలక పిలుపే - చిలిపి కధలు నడిపే
దా పదా నను రమ్మందిలే - నా ఎదా ఝం ఝం మ్మందిలే
సబరసమయనా సఖీరా

చరణం : 2
స్వాతి వాన కురిసే - నీలేత సొగసు మెరిసె - ముంగిళ్ళ సిగ్గుల్లో
వీణముందు నిలిచే - నెరజాణ పొందు పిలిచే - ముత్యాల ముగ్గుల్లో
నెలలు పొడిచే పగలే-చలికి వయసు రగిలే
కలకు నిజము తగిలే - ఇలకు జతలు మిగిలే
సా పస మగ సంగీతమే- నే సదా ఇక నీ సొంతమే
చేతన్ చేన్ తోడన్ తోన్ చెలీరా ....

No comments

Most Recent

Default