Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Minor Babu (1973)



చిత్రం:  మైనరు బాబు (1973)
సంగీతం:  టి చలపతిరావు
సాహిత్యం:  సినారె
గానం:  పిఠాపురం
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, అంజలీ దేవి, చంద్రమోహన్
నిర్మాత, దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 1973

పల్లవి:
అంగట్లో అన్నీ ఉన్నాయ్... అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?

అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?       

చరణం: 1
బెజవాడ ప్రక్కనే కృష్ణ ఉందీ
నిండా నీరు వుందీ...  బాగా పారుతుందీ
పట్టణంలో నీళ్ళ పంపులెన్నో ఉన్నా
పట్టుకుందామంటే బండి సున్నా
నీల్లు నిండుసున్నా... నోళ్ళు ఎండునన్నా

అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?       

చరణం: 2
ఏడుకొండలవాడా వెంకట్రమణా... గోవిందా గోవింద
తిరుపతి వెంకన్న దయవుందీ... పైగా డబ్బు ఉందీ
అయితే మనకేముందీ

పూటకోక్క కాలేజి పుడుతుందీ
చదువులే చెప్పేస్తుందీ... డిగ్రీలిచేస్తుందీ
ఆ డిగ్రీలు మోసుకుని ఢిల్లీ దాకా వెళ్ళి..ఉద్యొగాలిమ్మంటే ఏమవుతుందీ

ఏమవుతుందీ... కాలు అరగుతుందీ... చొక్కా చిరుగుతుందీ
ఆకలి పెరుగుతుందీ... ఆయాసం మిగులుతుందీ
ఆకలి పెరుగుతుందీ... ఆయాసం మిగులుతుందీ
అప్పటికీ నువు అక్కడేవుంటే చిప్పచేతికే వస్తుందీ... చిప్పచేతికే వస్తుందీ

అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీ
వాట్ టుడూ?...  క్యాకరూం?...  ఏం చేద్దాం ?       

చరణం: 3
మైనరు బాబుకు లోటేముందీ
డబ్బుకు లోటేముందీ... తిండికి లోటేముందీ
అందుకే పంతాలు మానేసి... పట్టింపులొదిలేసి
దర్జాగ ఇంటికి చేరుకుంటే... చేరుకుంటే ?

దొరుకుతుంది ఇడ్లి అయినా... గడుస్తుంది ఒక పూటైనా
నీ కోసం కాకున్నా... మా కోసం పదరా నాయనా
నీ కోసం కాకున్నా... మా కోసం పదరా నాయనా
ఎంత చెప్పినా యిదిలిచుకొని..ఎక్కడికో పోతున్నాడే
ఇంటికి రానన్నాడే... వాట్ టుడూ


*****  ******  ******


చిత్రం:  మైనరు బాబు (1973)
సంగీతం:  టి చలపతిరావు
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  ఎస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు
మనదే మనదేలే ఈ రోజూ
మన కందరికీ పండగలే ఈ రోజు

ఆశలు పండీ ఆకలి తీరి
బ్రతుకులు మారే పండుగరోజు
 
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండుగలే ఈ రోజు

చరణం: 1
గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు
గొప్ప గొప్పవాళ్ళకెదురు నిల్చినరోజు
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజు

జబ్బ చరిచిన రోజు... రొమ్ము విరిచిన రోజు
మనం గెలిచిన రోజు

మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండగలే ఈ రోజు

చరణం: 2
కూలి.. యజమాని.. తేడాలె వుండవు
ఈ కులాల ఈ మతాల గొడవలుండవు
అందరిదొకటే మాట...  అందరిదొకటే బాట
అందరిదొకటే మాట.... అందరిదొకటే బాట
ఇకపై చూడు బరాటా...
ఆ..లలలా..ఆఆఆ.. లలలా..ఆఆఆ..లలలలా..ఆఆఆ

చరణం: 3
పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు
పనిచేస్తే అన్నానికి లోటు ఉండదు
సోమరిపోతులకు నిలువ నీడ ఉండదు
ఇది సామ్యవాదయుగం... ఇటే నడుస్తుంది జగం
ఇక ఆగదులే ఆగదులే.... జగన్నాధ రథం..

హోయ్...మనదే మనదేలే ఈ రోజూ
మన కందరికీ పండగలే ఈ రోజు

ఆశలు పండీ ఆకలి తీరి
బ్రతుకులు మారే పండుగరోజు   
 
మనదే మనదేలే ఈ రోజు
మన కందరికీ పండుగలే ఈ రోజు

హోయ్...హోయ్...హోయ్...హోయ్...హోయ్...


*****  ******  ******


చిత్రం:  మైనరు బాబు (1973)
సంగీతం:  టి చలపతిరావు
సాహిత్యం:  సినారె
గానం:  వి.రామకృష్ణ, పి. సుశీల

పల్లవి:
నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే
ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే

ఎంత హాయీ... ఎంత..హాయీ..
ఎంత హాయీ... ఎంత..హాయీ..

చరణం: 1
నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా
నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా

నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా
నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా

నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే
ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే

ఎంత హాయీ... ఎంత..హాయీ..
ఎంత హాయీ... ఎంత..హాయీ..

చరణం: 2
నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
నీ... ఎదపాన్పు పై  నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా

నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
నీ... ఎదపాన్పు పై నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా

నేను. నీవు... ఇలాగే... ఉండిపోతే
ప్రతిక్షణం... ఈ సుఖం... ఇలాగే పండిపోతే

ఎంత హాయీ... ఎంత..హాయీ..
ఎంత హాయీ... ఎంత..హాయీ..


*****  ******  ******


చిత్రం:  మైనరు బాబు (1973)
సంగీతం:  టి. చలపతిరావు
సాహిత్యం:  సినారె
గానం:  ఘంటసాల

పల్లవి:
మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా
మోతిమహల్లో చూశానా.... తాజ్ మహల్లో చూశానా
బేబి....  బేబి....
నీ పేరేంటో చెప్పు బేబీ.... ఇంటి పేరేంటో చెప్పు బేబీ

చరణం: 1
పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో
యా..యా..యా.... లా...లా... లా...లా
పడకగదిలో కలల ఒడిలో పరవశించే వేళలో
నువు పాలరాతి బొమ్మలాగా...
పాలరాతి బొమ్మలాగా... పాన్పు  చేరిన గుర్తుంది
మాయమైనట్లు గుర్తుంది

ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి....
ఇంటి పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...

హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..

నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి...
ఇంటి  పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...

చరణం: 2
నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో
నీటిలోపల నీటిదాపుల వేచి వుండే వేళలో

నువు అందమైన హంసలాగ
అందమైన హంసలాగ... కదలివచ్చిన గుర్తుంది
కన్నుగీటిన గుర్తుంది

ఇంతకు నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి....
ఇంటి పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...

హా..హయ్..హయ్..హయ్..
హయ్..హయ్..హా..ఆ..ఆ..అహా..

నీ పేరేంటో చెప్పు బేబీ
బేబి....  బేబి...
ఇంటి  పేరేంటో చెప్పు బేబీ
బేబి...  బేబి...  బేబీ


*****  ******  ******


చిత్రం:  మైనరు బాబు (1973)
సంగీతం:  టి చలపతిరావు
సాహిత్యం:  ఆత్రేయ
గానం:  పి.సుశీల

పల్లవి:
కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ
మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు..  హత్తెరి

కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ
మా చేతికి వచ్చాయి తాళాలు..  మా చేతికి వచ్చాయి తాళాలు

చరణం: 1
రొడ్డెంత బాగుంటే..  మీకంత హుషారు
దాన్నేసి నోళ్ళ మీదనే..  ఎక్కించి పోతారు
రొడ్డెంత బాగుంటే..  మీకంత హుషారు
దాన్నేసి నోళ్ళ మీదనే.. ఎక్కించి పోతారు

మేమెక్కి కూచుంటే..  మీరెమైపోతారూ
మేమెక్కి కూచుంటే..  మీరెమైపోతారు
మా పక్క నింత చోటిస్తే చాలంటారు.. హత్తెరి

కారున్న మైనరు..  కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరూ
మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి

చరణం: 2
పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ
పదునైన కన్నెపిల్ల ఎదురైతే.. పళ్ళికిలించి ప్రేమపాఠాలెన్నో చెప్తారూ

పెళ్ళాడమంటేనే.. గొప్పోళ్ళ మంటారూ
పెళ్ళాడమంటేనే..  గొప్పోళ్ళ మంటారూ
మా ప్రేమముందు బీదోళ్ళు మీరే నంటాను

కారున్న మైనరు..  కాలం మారింది మైనరు..  ఇక తగ్గాలి మీ జోరూ
మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు

చరణం: 3
నీ వెంట నేనొస్తే..  నీ డబ్బు చూస్తాను
నా వెంట నువ్వు వచ్చావా.. లోకాన్నే చూస్తావు

లోకాన్నీ చూడందే..  నువు మనిషివి కాలేవు
లోకాన్నీ చూడందే..  నువు మనిషివి కాలేవు
మావాడివైతే కలకాలం బతికుంటావు..  హత్తెరి   

కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ
మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. హత్తెరి


No comments

Most Recent

Default