Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mahabaludu (1969)
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ
దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 18.04.1969Songs List:చూడండి మీకు నేను పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

చూడండి మీకు నేడు చూపిస్తాను
రుచి చూపిస్తాను
మధువిచ్చీ - మరపించీ
స్వర్గాన్ని మీకు చూపిస్తాను

తాజాగా దించిందండి
వలపునింపి ఉంచిందండి
ఒక్కచుక్కె చాలునండి
ఎక్కినకైపు ఎన్నడు దిగదండి
కోరుకున్న చిన్నదాన్ని చేరుకుంటారు
అందరాని ఆనందాన్ని అందుకుంటారు
ఎంత యెంతటివారికైనా
ఇంద్రభోగం - అక్కడే

మగువమీకు జోడైతేనూ
మధువుగూడ తోడైతేనూ
పడుచుదనం రగిలేనండి
గడుసుదనం పెరిగేనండి
అరవైలో ఇరవైలాగే ఆడుకుంటారు
చెలరేగి ఎవ్వరినైనా గెలుచుకుంటారు
అంతులేని ఈ జగానికి
అసలుమూలం అక్కడే 
ఏమే ఒప్పులకుప్ప పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

ఏమే ఒప్పులకుప్పా, నిను
ప్రేమిస్తే అది తప్పా !
అలరించే జవరాలా - నీ
అందం దాచెదవేలా - రావేలా !

ఓ విరిబోణి - కులికే అలివేణి
నీ వయ్యారాల, తియ్యదనాలు, చవిచూపవే,
రేపు మనసార - మనువాడు తానే,
నేడు తమిదీర - పులకించనీవే

నీ పరువాలు - అవి నా మురిపాలు
నా బిగికౌగిలిలో - నీ సొగసంతా కరిగించవే
కులుకు బింకాలు పొంకాలు దోచి
కోటి బాహువుల బంధించనీవే
మగాడంటే పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: రాజబాబు, పి. సుశీల 

మగాడంటే మజావున్నా
అదోలాంటి భయం
సరాగాలూ విలాసాలూ
తెలియవో యీ నిజం

నేబాలను - ఏమెరుగను
నీవంటే వుందిలే ప్రియం
ఈ నిగ నిగ మేనూ నీకె దాల్చితిరా
ఈ కులుకుల గోమూ కొత్తగ నేర్చితిరా
నునుసిగ్గులా విరిమొగ్గనూ
నిను చూస్తే అవుతా పరవశం 

నీ ముసిముసినవ్వు గుసగుసలాడినచో
నా మిసమిసలన్నీ మేలము లాడునురా
కొన గోటితో - నను తాకితే
ఎదనిండా ఎదేదో సుఖం

రావేలా ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

రావేలా ! జాగేలా
ఓ ప్రియా  నా ప్రియా
సిగలోన మల్లెలు పిలిచెను
గగనాన తారలు నిలిచెను
నీ కోసం నా పరువం
రేకులు విరిసీ నిలిచెను
రవిచంద్రులే వెలిగేదాకా 
భువనమ్ములే నిలిచేదాకా 
గంగమ్మతల్లీ కడుపు చల్లగా

గలగలమని పారేదాకా
చల్లగ నీవుండాలి 
నా నోములు పండాలి

ఆశల దివ్వెలు ఆరకముందే
అపరంజి మువ్వలు ఆగకముందే
ఒడిలోన తియ్యగ ఒదిగేకాలం
బడబానలమె రగులకముందే 
నీ రాకకై వేనేనూ  నా
కడ ఊపిరి దాచేనూ
ఓ..ఓ..విశాల గగనం లో పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల

పల్లవి:
ఓ..ఓ..విశాల గగనం లో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

చరణం: 1
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి
వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి

వొలికే.. మధువు ..కొసరే.. వధువూ రెండూ...నీవే...

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

చరణం: 2
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే
చుక్కలలో జాబిలిలా వెలుగుతావులే
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే

తీరే.. తనివి.. మీరే.. అలవి.. ఏదో...గారడీ...

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..

ఓ..ఓ..విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయం లో కలువలేమా
ఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా...ఆ..ఇక్కడే ఉన్నది (ఏటికే ఎదురీదుతా) పాట సాహిత్యం

 
చిత్రం: మహాబలుడు (1969)
సంగీతం: యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

ఇక్కడే - ఉన్నదీ
చక్కనీ - చిన్నదీ - రా! రా! రా!
ఏటికీ ఎదురీదకు
ఇంతి చెలిమి విడనాడకూ 
నదులన్ని కలవాలి కడలిలోనె 
ఎద ఉంటె కరగాలి వలపులోనె
కమలాన్ని భ్రమరము కలియుటలేదా
కలువకై నెలరాజు వెలుగుటలేదా !
చిలుకతో గోరింక కులుకుటలేదా !
కలికిని చెలికాడు కాదనరాదురా 
జవరాలితోడా మేలమాడా జాలమేలరా

లతకూన తరువును పెనవేయదా
లాలించితే హొయలు చిగురించదా :
జగతిలో ప్రణయమే సహజమురా !
మగువకూ మగవాడు మనసీయవలెరా 
మురిపాలతోడా బాలతోడా తేలవేలరా

No comments

Most Recent

Default