Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kokila (1990)


చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All)
గానం: ఎస్. పి. శైలజ
నటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)
మాటలు: ఎల్.బి.శ్రీరామ్
దర్శకత్వం: గీతా కృష్ణ
నిర్మాత: జి.మహేశ్వర రావు
విడుదల తేది: 1989

( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా)

పల్లవి:
ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరే
చెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరే
నీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చాను
నాతో కలిసి వస్తావా.. నీతో మెలిసి పోతాను

చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా

పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా

చరణం: 1
జాబిలమ్మ అమ్మ నాకు.... చుక్క పాప అక్క నాకు
నీటి బుగ్గ తామరాకు.... పూల మొగ్గ పూతరేకు
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని

హార్టు బీటు ఆదితాళాన.. హయ్ హయ్ హోయ్
ఆడుతున్న అందాన్ని
ఆర్ట్ పీసూ రంగు రాగాలా... ఒలె ఒలె ఒలె
ప్రాణమున్న శిల్పాన్ని

పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా

చరణం: 2
ఒంపు పక్క హంపి ఉంది... ఒప్పుకుంటే హాయి ఉంది
కొంగు చాటు చేసుకున్న.... తుంగభద్ర పొంగుతుంది
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు

సన్నజాజి పూలపుప్పొళ్ళు.. హాయ్.. పూసుకున్నా నీకోసం
కొత్తమోజు కంటి పోకళ్ళు.. అయ్.. హాయ్.. చేసుకోరా నీ సొంతం

పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా

చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా


*****  ******  ******


చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
కోకిల.. కోకిల.. కోకిల
ఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహా

కోకిలా... కొ క్కొ కోకిల
కూతలా... రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఏయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ.. నేనురా..
హ హ హ.. ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ...

చరణం: 1
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే.. నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే.. నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం... ఛీఫో
ముద్దొచ్చె రూపం... వదులు
కన్నుల్లో తాపం... హహహ
వెన్నెల్లో దీపం... హోయ్
నాలోని లల్లాయికే.. నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో

కోకిల కొ క్కొ కోకిల.. కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ

హే.. హే.. కొమ్మ పండే.. కొమ్మ పండే..
రెమ్మ పండే.. రెమ్మ పండే..
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
బుగ్గా పండే... బుగ్గా పండే
సిగ్గు పండే... సిగ్గు పండే
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా

చరణం: 2
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకి
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే.. ప్రాణాలు తోడే
వయ్యారమంతా.. వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ... హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు.. ముదిరేను మురిపాలు

కోకిలా.. కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా.. అహహహా...
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ

No comments

Most Recent

Default