Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Savyasachi (2018)




చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
నటీనటులు: నాగచైతన్య, మౌనిమ చంద్రభట్ల
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, సి.వి.మోహన్, వై. శంకర్
విడుదల తేది: 02.11.2018



Songs List:



వై నాట్ పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: PVNS రోహిత్, మనీషా ఈరబత్తిని 

చాటుగా చాటుగా దాచిన మాటలు
రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో

చాటుగా చాటుగా దాచిన మాటలు
రోజులు రోజులు వేచిన చూపులు
గీతాలు దాటుకుని ఏవైపెళ్ళాయో

ఓ నేనిక నీకాని నువ్వి నాకని
తేలిన సంతోషం లో పడుతూ
ఏమైపోతున్నాయో

పోనిలే పోనీ చేద్దామా
కానుంది కానించేద్దామా
ప్రాయాన్ని పాలించేద్దామా
ఆఅహ్

వై నాట్
మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
వై నాట్
మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్
వై నాట్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్

వై నాట్
మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
వై నాట్
మన ఇద్దరి బాధైనా హాయవుతుందోయ్
వై నాట్
మనకిప్పుడు ఏదైనా వీలౌతుండోయ్

నిన్ను విడిచిన నిమిషం నుంచి
నిన్ను మరచిన క్షణమే లేదు
నువ్వు కలవని తేదీ నుంచి
నిన్ను తలవని రోజే లేదు

తెలుసుగా నీ ప్రేమ బలం
కనుకనే కలిసాం మనం
మనసులో నీ జ్ఞాపకం
చెరిగిపోదన్నది నిజం

దూరాన్ని దూరం చేద్దామా
ఊహల్ని ఊరించేద్దామా
సరదాలో స్వారీ చేద్దామా...

వై నాట్
మన చేరువ లోకాన్నే మరిపిస్తుండోయ్
వై నాట్
మన కౌగిలి కాలాన్నే కరిగిస్తుండోయ్
వై నాట్
మనకిప్పుడూ ఏదైనా వీలుస్తుండోయ్

మనకిక్కడ చేదైనా తీపౌతుండోయ్
మన ఇద్దరి బాధైనా హాయిలుతుందోయ్
మనకిప్పుడూ ఏదైనా వీలుస్తుండోయ్



నిన్ను రోడ్డు మీద పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: పృధ్వి చంద్ర

(ఈ పాట నాగర్జున గారు నటించిన అల్లరి అల్లుడు (1993) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు)

నూనూగు మీసాల నూత్న యవ్వనమున
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైంది  ప్రేమ కహాని
ఆ క్యాంటీన్  లో సొల్లు కబ్బుర్లు 
నైటంత ఆ బైక్ షీకారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీటే
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాకెడ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయత్తు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయతు
మై హార్ట్ ఇస్ బౌన్సీన్గ్ న్ ఫాలింగ్ ఎట్ యు

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వోడొద్దు నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయతు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగామన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత
దునియా మొత్తం దున్నయెద్దము

లైలా మజ్ను
లగ్గాయతు లగ్గాయతు
దేవి పారు
లగ్గాయతు లగ్గాయతు
మెయిన్  దీవాని తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నెర్ లో
చెయ్యి చెయ్యి తగిలేలా
గురుతుందా రాసలీలా

లేట్ నైట్ లో , లైవ్ చాట్ లో 
ఎన్ని పాటల్లో, హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు, చిల్లరి ఊహాలు
ఎన్నని చెప్పను, పిల్లో మహాతల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయత్తు
అది భామ కాదు బాతు



ఒక్కరంటే ఒక్కరు పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీనిధి తిరుమల 

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక తనువును ఎదిగిన కవలలు
ఒక తీరున కదలని తలపులు
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు

విడి విడి కుడి ఎడమలుగా
కలవనంటు ఎందుకలా
చేరి సగమున కలివిడిగా
ఒదగమంది అమ్మ కల
చెరో చెయ్యి మీదిగా
చంప నిమిరితే చాలు
మరో వరమే లేదనుకుంటూ
మెరిసిపోవా నా చిరు నవ్వులు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు

అన్న వెంట అడవులకేగిన
లక్ష్మణుడి ఆదర్శం
ఆరమరికలు దాటి సాగితే
అడుగడుగు మధుమాసం
నా కలలకు రెక్కలు మీరు
నా ఎనిమిది దిక్కులు మీరు
సంబరాల మీ సహవాసమే 
మేం కోరిన సంతోషం
మీ ఇద్దరి వృద్ధిక చూస్తూ
గడవాలి నా ప్రతి నిమిషం
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు

ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటే ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు





టిక్ టిక్ టిక్ పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: హైమత్, శ్రేయా గోపరాజు 

కోపం... అపార్థం
నువ్వింకా ఇంకా పెంచిందే నీ అందం
రోషం....ఆవేశ
నాలో కొంచెం పెంచిందే ఎదో పంతం
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
నువ్విక నాకే ఆఖరి మజిలీవి
నీడగ ఉంటానే ప్రతిసారి
I am very sorry లేదు వేరే దారి

చాలా చాలా చేశానిప్పటికే
Please don't mind
చూసి చూసి చూడనట్టోదిలేసేయ్
Love is blind
కోపం that's the part of game
ఆటే రాక చేస్త dream
నీలో ప్రేమ ఎంతుందో
నాలో కూడా same to same

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడవదు కాలం నీతో పాటే ఉంటే
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారానికి సంకెళ్ళేసి మరీ
ఓ... హనీ... ఓ
ఆపేస్తాగా ఆ సమయాన్ని
చుట్టూ లోకం ఏమైనా అయిపోని

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్




1980, 81, 82 పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో
We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో
ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర
ఎప్ప ఎప్ప ఎప్పప్పప్పప్పప్ప 

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో

చూసుకో చూసుకో
VCR లో అమ్మ నాన్నల పెళ్లి
వెళ్ళిపో వెళ్ళిపో
అంబాసిడర్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి మల్లి
చేతులు వీడని వీడియో గేమ్ లు
బాటరీ లైట్లు హవాయి చెప్పులు
బూమెర్ బబుల్ గమ్ములు ఊదిన బుడగలతో
లైఫ్ రీవైండ్ చేద్దామా
హార్ట్ ని రీబూట్ చేద్దామా
హాయి ని రీ కాల్ చేద్దామా

We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో...
ఇదిగిదిగో ఇదిగిదిగో...
ఎప్ప ఎప్ప ఎప్పప్పప్పప్పప్ప

1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో




ఊపిరి ఉక్కిరి బిక్కిరి పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: శ్రీ సౌమ్యా, శ్రీ కృష్ణ , మోహన భోగరాజు 

ఊపిరి ఉక్కిరి బిక్కిరి 





సవ్యసాచి పాట సాహిత్యం

 
చిత్రం: సవ్యసాచి (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా, రామక్రిష్ణ కోడూరి 
గానం: దీపు, రమ్యా, రాహుల్, హైమత్, మౌనిమ. సిహెచ్, రేవంత్, ప్రణతి, ఉమా నేహా, మోహన భోగరాజు, శ్రీ సౌమ్యా, లోకేశ్వర్, PVNS రోహిత్, ఆదిత్య, కౌశిక్ కళ్యాణ్, సోనీ 

చండ మార్తాండ భామండలీ మండితా
ఖండాలా దండ దా రా హతి
కాద్రవే యాగ్ర జోదగ్ర దంష్ట్రాకరాలాగ్ని
భీభత్స కీలార్భటి
యక్షర గణాధ్యక్షా హేమాక్ష భీతాక్ష
మా రక్షణా దక్ష ధీ:

సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి

సవ్యసాచి
ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి

సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి

భండన ప్రచండ భేరి కాహళీ ప్రహార
ముక్త ఢమ ఢమ ఢమ ఢమ ధ్వని
ప్రవర్తితాశ్వ చరన రింఖ
ట ట ట ట టట్ట టకట టాక్
తురంగ హేష సాంగ భట
సమూహ ఘోష భాతి

సవ్యసాచి సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి

సవ్యసాచి 
ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి

సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి


No comments

Most Recent

Default