చిత్రం: చిత్రాలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కైలాష్ కెహర్, విష్ణు ప్రియ రవి
నటీనటులు: సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేది: 12.04.2019
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరీక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)
ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక ఆగకుండ సాగాలిర నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)
ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
చిత్రం: చిత్రాలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సుదర్శన్ అశోక్
రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
వానలా వీణలా వాన వీణ వాణిలా
గుండెలో పొంగిన కృష్ణ వేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా
సరిగమల్ని తియ్యగా ఇలా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్థరాత్రి లా
నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలత పూతలా
రాయలోరి నగలలోంచి
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కళ్లలా
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన
నిన్ను చూసే రాసినాడలా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
నడకే నువ్వలా కలలలో కోమలా...
నడకే నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విల విలా
విడువకే నువ్వలా పలుకులే గల గల
పెదవులు అదిరితే గుండె గిల గిల
అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంతా పొంగిపోయేలా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
No comments
Post a Comment