Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vagdanam (1961)
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
నటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణకుమారి
అసోసియేట్ డైరెక్టర్: కె.రాఘవేంద్రరావు
దర్శకత్వం: ఆచార్య ఆత్రేయ
నిర్మాతలు: కె.సత్యనారాయణ, డి.శ్రీరామ మూర్తి
విడుదల తేది: 05.10.1961

( ప్రముఖ పాటల రచయిత ఆచార్య ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు, అలాగే ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు)Songs List:తప్పెట్లోయ్ తాళాలోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: నార్ల చిరంజీవి 
గానం: యస్.జానకి, సరోజిని 

తప్పెట్లోయ్ తాళాలోయ్- దేవుఁనిగుళ్ళో బాజాలోయ్
చప్పట్లోయ్ సరదాలోయ్ - పిల్లలె బళ్ళో రాజాలోయ్
బడికీ గుడికి తేడాలేదోయ్ భక్తీశ్రద్దా ఒక టేనోయ్
పలకా బలపం అక్కడికి
పళ్ళూ పూలూ ఇక్కడికి

ఎం. బి. బి. ఎస్. డాకర్,
అబ్బో - రంగునీళ్ళతో డబ్బు గుంజకు
డోకా లేని వకీలునౌతా
ఆఁ తప్పుడు కేసుకు వత్తాసీయకు
మన కే గొప్పలు వద్దోయ్
మంచివాళ్ళమైతే చాలోయ్ 

మేటి చదువులు మెదడుకు బలము
ఆటలు పాటలు వంటికి బలము
రెండూ వుండే దండి మనుష్యులే
నిండుదనం మన జన్మభూమికి

మనసులు కలసిన స్నేహాలు
మిల మిల మెరిసే దీపాలు
వేరైతేనేం దేహాలు
ఒక టేగా మన ప్రాణాలుకాశీ పట్నం చూడర బాబూ పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి.సుశీల , ఘంటసాల 

ఓహెూ ! నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి
బీదవాడ
మనిషిగా బ్రతికేందుకు కనీసావసరాలైనా
లేనివాడా – అయ్యయ్యో
కాశీ పట్నం చూడర బాబూ, కల్లాకపటం లేని గరీబూ
అల్లోలక్ష్మణ అని అల్లాడే, పల్లెలదుస్థితికేమి జవాబు?
నిరాశతోను నిస్పృహలోను తెరువేరుగని నిరుపేదలు
మురికిగుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటిపేటలు
పాడురోగాలు మోసుకు తిరిగి ప్రజలను చంపే ఈగలు
కరువూ బరువూ పరితాపాలు, కలసి వెరసి మన పల్లెలు
శరీరాలో అర చటాకైనా రక్తంలేని దరిద్రులనే
పీల్చుకుతింటాడు – దోమరాక్షసుడు
వాడి దుంపతెగ - మేడల్లో మిద్దెలలో నివసించేవారి
జోలికైనా పోడుగదా... అయ్యయ్యో
పోడుగదా--అయ్యయ్యో

వైద్యసహాయం అసలేలేదు - వున్నా దొరకవు మందులు
డాక్టరుకోసం వెతికేలోగా, రోగులు గుటుక్కు మందురు
నెత్తురు పీల్చే వృత్తిపరులె-మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లెజనాలను - పంచుకు నంచుకు తిందురు 

ప్రజలతో సమానంగా కష్టసుఖాలను, పంచుకుంటామంటారు - మన వినాయకులు
అవునవును సుఖాలన్నీ తమకు దక్కించుకొని
కష్టాలన్నీ మనకు వదిలేస్తారు - అయ్యయ్యో
ఎవరోవచ్చి సాయం చేస్తారను వకోడమే పొరబాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బదానాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు - అ దేకదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిననాడు- ఎదుటివాడి కది
తలపోటు 
నగజాతనయం (Harikatha) పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల 

రామదాసు :
నగజాతనయం సహృదయం చింతయామి సదయం
త్రిజగమహోదయం శ్రీ నగజాతనయం॥

శ్రీరామభక్తులారా ! ఇది సీతాకల్యాణ సత్కథ. నలభై రోజులనుంచి చెప్పిన కథ. చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్రసౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా ! కాస్త పాలు, మిరియాలు ఏమన్నా?

చిత్తం – సిద్ధం.

భక్తులారా ! సీతామహా దేవి స్వయంవరానికి ముల్లో కాలనుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి ... ఆహా ! అతడెవరయ్యా అంటే 

రఘురాముడు రమణీయ వినీలఘనశ్యాముడు వాడు
నెలరేడు సరిజోడు మొనగాడు వాని కనులు మగమీల
నేలురా వాని నగవు రతనాల జాలురా 
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు 
మరోమరుడు, మనోహరుడు, రఘురాముడు

శబాష్ శబాష్ 
ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో

ఎంత సొగసుగాడే, మన సింతలోనె దోచినాడే
మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే 

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా అక్కడ
స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి, అనియె నిట్లు -

ఓ యనఘులారా ! నా అనుగుపుత్రి సీత
వినయాదిక సద్గుణవ్రాత, ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి విఁటి నెక్కిడజాలిన యెక్కటి జోదును నేడు
మక్కువమిూరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు. 

అని యీ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే, సభలోనివారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట.
మహావీరుడైన రావణాసురుడు కూడా 'హా' ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము' అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున

ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరపువలె నిల్చి 
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సరమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత 
మదనవిరోధి శరాసనమును తన శరమును బూనినయంత 
ఫెళ్లుమనె విల్లు - గంటలు ఘల్లుమనె - గుభిల్లుమనె గుండె నృపులకు, 
ఝల్లుమనియె జానకి దేహము ఒక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర
శ్రీమద్రమారమణ గోవిందో హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్లుగా వుంది.
మరొక్కసారి - జై  శ్రీమద్రమారమణ గోవిందో హారి

భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు.
అంతట
భూతలనాధుడు - రాముడు
ప్రీతుండై - పెండ్లియాడె, పుధుగుణమణి
సంఘాతన్ – భాగ్యో పేతన్ సీతన్
భూతలనాధుడు - రాముడు
ప్రీతుండై - పెండ్లియాడె..
శ్రీమద్రమారమణ గోవిందో హారి 
వన్నె చిన్నె లన్నీ వున్న పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల 

వన్నె చిన్నె లన్నీ వున్న చిన్నదానివే అన్నీ వున్న దానివే
ఎన్ని వున్నా జోడు లేక లేనిదానివే - ఏమీ లేనిదానివే-
ఉత్త ఆడదానివే

తిరిగే చక్రాలున్నా - పై పైకెగరే  గుఱ్ఱాలున్నా
కళ్లెం పట్టి కళ్లనుగట్టి నడిపే మొనగాడుండాలి
అందని దైనాగానీ నరులందరు కోరుదురందాన్ని
తూకం వేసి పాకంచూసి, డెందం ఒకరికే ఇవ్వాలి
అందం డెందం కలిపి ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు, అన్నీ వున్నవనుకోవాలి
వెలుగు చూపవయ్యా మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, ఘంటసాల 

రామదాసు :
పాహిరామప్రభో ! వరదా, శుభదా, పాహి దీనపాలా
వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా
విజయ :
మహాత్ములైనా దురాత్ములైనా, మనుజుల పేరనె మసలేరయ్యా
అందరికి నీ అభయం కలదని, అనుకోమందువ దేవా
నేరక చేసిన కారణమున మా నేరము నేరము కాకపోవునా?
కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా
కల రూపేదో కలవో లేవో ఎదవున్నది యీ వేదనకేనో
ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా 
నా కంటి పాపలో నిలిచిపోరా పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఊ..ఉ...ఉ...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఆ..ఆ..ఆ..ఆ...

చరణం: 1
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
అహ..హా..ఆ..
ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో...
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొంద్దాము అందని ఆకాశమే...

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

చరణం: 2
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
అహ..హా..ఆ..
ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
మేఘాలలో వలపు రాగాలలో...
మేఘాలలో వలపు రాగాలలో....
దూర దూరాల స్వర్గాల చేరుదమా....

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

చరణం: 3
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అహ..హా..ఆ..
ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అందాలనూ తీపి బంధాలను...
అందాలనూ తీపి బంధాలను...
అల్లుకుంద్దాము డెందాలు పాలించగా...

నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా...

మా కిట్టయ పుట్టినదినము పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పిఠాపురం, వసంత & కోరస్

మా కిట్టయ పుట్టినదినము తానీ తానారే తానీ
కిలకిలాని నవ్వెను జగము తానీ తావారే తాని
పిల్లనగ్రోవి వినుము తానీ తానారే తానీ
నల్లని సామిని కనుము తానీ తానా రే తానీ
మన పల్లే బృందావనము, మన మనసే దేవాలయము

నందారె దేవ నందారె. నందాకుమారా నందారె
కోరస్ : నందారె దేవ నందారె, నందాకుమారా నందా రె
ఆందారె దేవ నందారె, నందాకుమారా నందారె
కోరస్: నందారె దేవ నందా రె, నందాకుమారా నందారె
చల్లను అమ్మే పిల్లను చేరి..
కోరస్ : చల్లను అమ్మే పిల్లను చేరి
అల్లరిచేసి చల్లను తాగి
కోరస్ : అలరి చేసి చలను తాగి

పులుపెక్కె పిల్లా వలపింత కలుపని
పులుపెక్కె పిల్లా వలపింత కలుపని
గొల్లున నవ్వేవు కిట్టయ్యా, కొంటికిట్టయ్యా
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా
నల్లనయ్య ఏ యిల్లు దూరినా
నల్లనయ్య ఏ యిల్లు దూరినా
వెన్నముద్దకని వెతికి చూ సేము
వెన్నముద్దకని వెతికి చూసేము
వెన్నతోపాటు ఏ కన్నె మనసో
వెన్నతో పాటు ఏ కన్నె మనసో
కాజేసి పోతావు, కిట్టయ్య దొంగ కిట్టయ్య,
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా
చీరెలు దోచి చెట్టెక్కినావు
చీ రెలు దోచి చెట్టెక్కినావు
సిగున భామలు మొగలెనారు.
సిగ్గున భామలు మొగ్గలైనారు
పుట్టేది గిట్టేది బట్ట' లేకని

కోరస్: పుట్టేది గిట్టేది బట్ట లేకనీ
బురిడీలు కొట్టేవు కిట్టయ్య చిలిపి కిట్టయ్య,
ఎట్టయ్య నీతో ఎట్టయ్యా
బంగరునావ బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

బంగరునావ బ్రతుకు
బంగరునావ దాన్ని
నడిపించు నలుగురికి మేలైన త్రోవ
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్డగించినా
కదిలిపోవు కాలచక్ర మాగిపోవునా
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ

అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్నీ త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ

కనులున్నది కన్నీటికి కొలను లౌటకా
వలపన్నది విఫలమై విలపించుటకా?
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా
నావనడిపించు నలుగురికి మేలైన త్రోవ బంగరునావ


No comments

Most Recent

Default