Search Box

MUSICAL HUNGAMA

Rakta Sambandhalu (1975)చిత్రం:  రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  సినారె
గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , మంజుల, లత సేతుపతి, అంజలీ దేవి, పండరీ బాయి
దర్శకత్వం: ఎమ్. మల్లికార్జున్ రావు
బ్యానర్: నవచిత్ర ఎంటర్ప్రైజెస్
నిర్మాతలు: రాఘవమ్మ, మీనాక్షి
విడుదల తేది: 29.08.1975

పల్లవి:
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం..

ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. పాడరా   

ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం..  హరి ఓం.. ఓం పాడరా

చరణం: 1
నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా
నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా

నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా
నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా
ఎగాదిగా నిగా వేస్తే ఏముందిరా     

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా 
ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా

చరణం: 2
అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా

అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా
వేమన్న తావన్న. .  వింత ఇదేరా

హరి ఓం . . హరి ఓం . . హరి ఓం . . ఓం.. పాడరా 
ఎవరో నీవు.. ఎవరో నేను . . అంతా మాయరా
హరి ఓం . . హరి ఓం . .  హరి ఓం . . ఓం.. పాడరా

చరణం: 3
గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా
ఓ మూఢా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా

గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా
ఓ మూడా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా
ఒరే ఒరే ఇదే ఇదే.. పరమ నిజంరా 

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా 
ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా   

******  ******  ******

చిత్రం:  రక్త సంబంధాలు (1975)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ...  ఎందుకో..   ఎందుకో   

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
మేరిసింది దాని ధగధగ..  ఎందుకో...    ఎందుకో

చరణం: 1
కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా
కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా

దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
అలరించే మొనగాడు.. ఎవడో 

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో

చరణం: 2
మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ
మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ

దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
విరబూసి పండేది.. ఎప్పుడో

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో.. ఎందుకో

******  ******  ******

చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం 
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

చరణం: 1
గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ
గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ

గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ
గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ
ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం 

అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

చరణం: 2
మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ
మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ

దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ
దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ

ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం 
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

No comments

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0