Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Muhurtha Balam (1969)




చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ , నాగభూషణం, జమున, విజయ నిర్మల
దర్శకత్వం: ఎమ్.మల్లికార్జున రావు
నిర్మాతలు: వై.వి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద రావు, ఎమ్.వి.రామదాసు
విడుదల తేది: 13.06.1969



Songs List:



డోయ్ డోయ్ వస్తున్నాడోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

డోయ్ డోయ్ డోయ్ డోయ్  వస్తున్నాడోయ్
వస్తున్నాడోయ్ దిగి వస్తున్నాడోయ్
పైలా పచ్చిసు వయసున్నవాడు
పగడాల జిగివున్న ఓ వన్నెకాడు

పల్లేరు గాయాలు గుచ్చుకుంటాయి
కాళ్లు పదిలామంటే వింటాడో
వాలుచుపులు ఉచ్చుకుంటాయి
వరుస తెలుసుకోమంటే ఏమంటాడో

ఎర్రగా బుర్రగా ఉన్నాడు
ఎంచక్కా షోకు చేసుకున్నాడు
ఎవ్వరికైనా మనసిచ్చాడో
ఇవ్వలేకనే తిరిగొచ్చాడో

జొన్నచేలకే షికారు పోతాడో
కన్నెగాలికే కంగారు పడతాడో
మస్తు మస్తుగా ఊళ్ళో ఉంటాడో
బస్తీకి తిరిగి ఎగిరిపోతాడో




కాయ్.. కాయ్, కావలి కాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

కాయ్.. కాయ్, కావలి కాయ్
కళ్లుమూయ్, కాయలు కోయ్
కోసిన కాయలు ఒళ్ళో వేయ్
హాయ్....హోయ్....హోయ్....హోయ్

మనసు మనసు , కలపాలోయ్
వలపు మసాలా వేయాలోయ్
నవ్వుల తాలింపెట్టాలోయ్
మువ్వొంకాయే వండాలోయ్
మువ్వొంకాయే వండాలోయ్
హాయ్....హోయ్....హోయ్....హోయ్

నిజంలాగా మింగుడు పడదు
కటిక చేదు కాకరకాయ్
నిష్టూరంలా ఇష్టం కాదు
కొరకొరలాడే మిరపకాయ్
కోసిన కాయలు ఒళ్ళో వేయ్
హాయ్....హోయ్....హోయ్....హోయ్

వయసు సొగసు కలసినట్టుగా
చిక్కుడు పందిరి వేసింది
పందిరి కిందా పెళ్లివిందుకై
చక్కని కాయలు కాసింది
చక్కని కాయలు కాసింది
హాయ్....హోయ్....హోయ్....హోయ్



బుగ్గ గిల్లగానే పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, యస్.పి. బాలు

బుగ్గ గిల్లగానే సరిపోయిందా
గిల్లి గిల్లి గిల్లి నవ్వగానే సరిపోయిందా?
కోరుకున్న చిన్నదాని గుండెలోన
ఏముందే కొంచమైన తెలుసుకున్నావా?

బుగ్గ గిల్ల గానే సరిపో లేదు,
గిల్లి గిల్లి గిల్లి నవ్వగానే సరిపోలేదు
నీ కొంగూ నాకొంగూ ఏకంగా ముడి వేసే
వేళకోసం వేచియున్నాను 

ముత్యాల పందిరి వేసి రత్నాల పీట వేసి
బంగారుచేతులతో బాసికం కడతావా బావా
మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి
మురిపించే చేతులతో మూడుముళ్లు వేస్తానే
నీ జాగ గూడి వస్తానే...
కన్నెపిల్ల మాటంటే పెన్నపూసలాంటిది
కాస్త వేడిసోకిందా కరిగిపోతానంటది బావా
చలచల్లని కళ్ళల్లో మెలమెల్లగా దాచుకుంటే
వెన్నలాంటి ఆ వలపే వేడి తగలకుంటది
నా నీడలాగుంటది





అమ్మలగన్న అమ్మలారా పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల & బృందం

అమ్మలగన్న అమ్మలారా - అక్షింతలను
వేయండి వేయండి
హాస్యాలాడే ఆడపడుచులు - అమ్మా కొంచెం ఆగండి ఆగండి
ఆగం.... ఆగం.... హాస్యాలాడక మానం
హాస్యాలాడక మానం....
తలబిరుసు పెళ్లి కూతురు, మెడలే వంచిదట
అవ్వవ్వ అవ్వవ్వ సిగ్గుబిడియం ఆసలే లేవుకదా
తాళిని కట్టించి ముకు తాడును పొయ్యాలి 
మొగుడే రావాలి పొగరే తగ్గాలి
అవును అవును అవును 
పొగరే తగ్గాలి పొగరే తగ్గాలి 

అసలైన మరదళ్ళంటే అల్లరి బాజాలు
మురిపాల పరాసికాలు ముళ్ల రోజాలు
సందడి చేయాలి, సరదా పండాలి
సందిట్లో అమ్మాయి భరతం పట్టాలి పట్టాలి
అవును అవును అవును 
భరతం పట్టాలి భరతం పట్టాలి
గయ్యాళి నోటికి తాళం టక్కున వేయాలి
తీరైన బుగ్గలు చిదిమి దీపం పెట్టాలి
సిగ్గులు చిందాలి చిలిపిగ నవ్వాలి
అందాన్ని దిష్టి తీసి హారతి యివ్వాలి
అవును అవును అవును 
హారతి యివ్వాలి హాగతి యివ్వాలి...



నీకు ఎంత మనసుందో పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

నీకు ఎంత మనసుందో నాకు తెలుసునోయ్
నాకు ఎంత గుబులుందో నీకు తెలియదోయ్

రా....రా....రాజ రాతిగుండెవాడా
మెత్తగా తాకితే ఉంగరాల వేళ్లు
మత్తుగా ఉండదా మాయదారి ఒళ్లు
నీ కోడె వయసులోన వుంది కొత్త కొత్త వేడి
కత్తిగోళ్లు వాడి

రా....రా....రాజ నీకు నాకు జోడి....
ఓరగా చూడగా నోరు ఊరుతుందోయ్
యిద్దరు కూడితే ఇంపు పెరుగుతుందోయ్ 
ఇది ఆకుచాటు పిందెకాదు
పచ్చి కాయ కాదోయ్ చాకులాంటి వాడా

రా.... రా.... నేనే రాజ నిమ్మలపండు
వెన్నలా ఉన్నదీ వన్నెలాడి చూపే
వెచ్చగా ఇవ్వనా నచ్చినట్టే కైపు
ఈ గువ్వపిట్ట కులుకు జూసి గుటక లేయువాడా
గుండె దోచుకోరా
సై సైఁ సైఁ - ఇంక స్వర్గమేలరా




చిరు చేదు పాట సాహిత్యం

 
చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల 

చిరు చేదు పానీయము చింతలను మరపించులె
చవిచూడగలవారిని స్వర్గాల తేలించులే 
మత్తులో గమ్మత్తులే లోకమంతా చిత్తులే

తెరలన్నీ తొలగించేను నిజమునే పలికించేను
ఊరించి ఊగించేసు వలపులే చిలికించేను 
అందాల నీ ప్రేయసీ అందించు మధుపాత్రలో
అసలైన నీ రూపము ఆందరికి కనిపించును
మత్తులో గమ్మత్తులే లోకమంతా చిత్తులే
పంచుకో నాతో మధువు పెంచుకో 
మెత్తనిమత్తు
కలకాలం కరగని ముద్దు
కౌగిలింత విడనీయొద్దు
ఈ నిషా.... ఈ కుషీ....ఈ నిషా....ఈ కుషీ
ఈనిషా పోనీయొద్దు ఈ కుషి చెడనీయొద్దు


No comments

Most Recent

Default