Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru Ammayilu (1972)
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, వాణిశ్రీ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.ఆర్.పుత్తన్న కనగల్
నిర్మాణం: యునైటెడ్ ప్రొడ్యూసర్స్
విడుదల తేది: 02.10.1972Songs List:పువ్వులో గువ్వలో వాగులో తీగలో పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల 

పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవేనమ్మా
అన్నిట నీవేనమ్మా 

నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మా
నీ పాపగ నన్ను చూచుకోవమ్మా -
కొమ్మ కొమ్మపై కుసుమంలో
కమ్మని తేనెవు నీవే నీవే
జాలి గుండెతో జల జల పారే
సెలయేరువు నీవే
నింగిలో నేలలో రంగు రంగుల హరివిల్లులో ....

సీతాకోక చిలుకలతో
చేరి వసంతా లాడేను
బంగరు వన్నెల జింకలతో
చెంగు చెంగున యెగిరేను
కొండలో కోనలో తోట బాటలో

నీ చల్లని నీడే నా యిల్లు
ఈ మూగజీవులే నా వాళ్ళు
అంతులేని నీ అందాల లోకం
అంతా నాదేనమ్మా -
మనసులో మమతలో కనులలో నా కలలలో నీవే
లేరా లేరా లేరా ఓ రైతన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల 

లేరా లేరా లేరా ఓ రైతన్నా
రెక్కల కష్టం నీదన్నా !
దేశానికి రక్షకుడవురాః
నువ్వు లేకపోతే భోజనంబు పూజ్యమేనురా 

వరుణ దేవుడు అడగకుండ వర్షం ఇస్తున్నాడు
బసవన్న ఱంకెవేసి ప్రక్కన వస్తున్నాడు
కన్న తల్లి గోదావరి కరుణ జూపుతున్నది
చేలల్లో ధాన్యలక్ష్మీ చిందులు వేస్తున్నది

భూదేవి నిన్ను చూచి పొంగి పోతుంది
ఉప్పొంగి పోతుంది
రత్నాలూ వరహాలు కురిపిస్తుంది.
తానిచ్చే సంపద మారణకాండకు కాకుండా
దేశం కోసం ఉపయోగించి
మంచితనమ్మును పెంచనున్నదీ

కాలం మారింది దేశం మారింది
కాలంతోపాటు అడుగు ముందు వెయ్యవోయ్
నీ శ క్తిని చూపించు నీ హక్కులు సాధించు
విజయము నీదేనోయీ ఎదురు నీకులేదోయీ...
ఓహో మిస్టర్ బ్రహ్మచారి పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

ఓ మిస్టర్ బ్రహ్మచారి ఒకటో రకం బ్రహ్మచారి
నా ఓర ఓర చూపులో వయ్యారాల కైపులో
పడగానే అవుతావు సంసారి

కోటిలో ఒకడే ముని కాగలడు
కోటకు ఒకడే రాజవగలడు 
ఒక్కొక్క వ్యక్తి ఒంటిగ వుంటే 
ప్రపంచమే హఠాత్తుగా సమాప్తి కాదా...

ఈ జగమంతా జంటల మయము
ఇంపూ సొంపూ కలసిన జయము
ముదూ మురిపెం ముచ్చట తీరా
ఇదరి హాయికిహదు లేదులే ?....
ఎపుడు ఎపుడు ఎపుడూ పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. సుశీల , పిఠాపురం నాగేశ్వరరావు 

ఎప్పుడు - ఎప్పుడు - ఎప్పుడు
పెళ్ళి ఎప్పుడు మన పెళ్ళి ఎప్పుడు
రోజులు జరుగుతు వున్నాయ్
మోజులు తీరక వున్నాయ్ 

పెళ్ళి పెళ్ళి పెళ్ళి
అవుతుందిలే పెళ్ళి అవుతుందిలే నీవు
చంద్రమండలానికెళ్ళి వచ్చినప్పుడు
అక్కడున్న మన్ను కా స తెచ్చినప్పుడు
అప్పుడు అప్పుడు అప్పుడు
పెళ్ళి అవుతుందిలే పెళ్ళి అవుతుందిలే 

అటయితే అమెరికాకు పోతాను
రాకెట్టు పట్టుకొని ఎగురుతాను
కొయ్ కొయ్ కొయ్ కొయ్
గాలిలోన తేలిపోయి నీ ఒళ్ళో వాలిపోయి
చందమామలోన వున్న జింకను తెచ్చేస్తాను .
అప్పుడు అప్పుడు అప్పుడు
పెళ్ళి అవుతుందిలే పెళ్ళి అవుతుందిలే
మబ్బులోన నీళ్ళుకూడ తెస్తాను -
నీ మనసులోని కోర్కెలన్నీ తీరుస్తాను
సోపు వేయ వచ్చావా, సోగ్గాడ - ఆహా
ఆపవోయి డాపుసరి బల్లోడ - ఆయ్
పెళ్ళంటే గోంగూరా బెండకాయ సాంబారా
అది నూరేళ్ళ పంట నువ్వు ఆత్రపడితే తంట
మరై తే.... ఎప్పుడు ? ఎప్పుడు ? ? ఎప్పుడు ???
ఈ చల్లని లోగిలిలో... పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల 

పల్లవి:
ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలి

ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి... అనురాగం పండాలి ... అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో...

చరణం: 1
పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా...
పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి

ఈ చల్లని లోగిలిలో ....

చరణం: 2
శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా ... ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి ....

ఈ చల్లని లోగిలిలో ....

చరణం: 3
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో....
వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి

ఈ చల్లని లోగిలిలో.... ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలినా హృదయపు కోవెలలో.... పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
నా హృదయపు కోవెలలో.... ఆ... ఆ
నా బంగారు లోగిలిలో.... ఆ... ఆ
ఆనందం నిండెనులే... అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో... ఆ ఆ
ఆనందం నిండెనులే... అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...

నా హృదయపు కోవెలలో...

చరణం: 1
ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో... నా మనసును నిలువునా దోచితివే

నా హృదయపు కోవెలలో...

చరణం: 2
అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే... నా బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో...

చరణం: 3
ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో...
వచ్చే పోయే అతిధులతో... మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే... అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో...

No comments

Most Recent

Default