Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Love in Andhra (1969)
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల
దర్శకత్వం: రవి
నిర్మాత: యస్. భావనారాయణ
బ్యానర్: గౌరీ ఆర్ట్ ఫిలిమ్స్
విడుదల తేది: 20.04.1969Songs List:భలే ఖుషీగా వుండాలి. పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి , బి. వసంత 

భలే ఖుషీగా వుండాలి.
బ్రతుకు మజాగా గడపాలి
వయసు సొగను జతచేయాలి.
మనసులో ప్రేమ పొంగాలి

పరువంలోని సరదాలన్ని తరుణంలో నేచవిచూడాలి
కిల కిల కిల నవ్వుతూ 
వలపుల వల రువ్వుతూ

కోరిన ప్రియునే చేరాలి
ఆ కౌగిట ఊయలలూగాలి
ఆ ఊయల స్వర్గం కావాలి

నీ ఓరచూపు నీలోని కైపు
నెలరాజునైన మురిపించాలి
గల గల గల గాజులు 
గుమ గుమ గుమ జాజులు

పందిట బాజాలు మోగాలి
నీతలపై ముత్యాలు రాలాలి 
నీ చెక్కిట ముద్దులు కురియాలిఏమ్మా ఏమ్మా ఏమ్మా ఇటు తిరిగిపాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి , పి. బి. శ్రీనివాస్ 

ఏమ్మా ఏమ్మా ఏమ్మా ఇటు తిరిగి
ఈ వేళలో ఆ కళ్ళలో ఎవరిని దాచావమ్య
ఓమ్మా ఓమ్మా ఓమ్మా ఈ వింత చూడవేయమ్మ
నా కళ్ళలోని నీడచూసి కలవరపడుతున్నాడమ్మో

కలలోన చెలికాడు కలుసుకుంటే పలకరింగ
చినవాడు మనసార చేరుకుంకే కలవడెంత
తెలుసుకో భామా! అదేలే ప్రేమ
అక్షరాలు రెండు అనుభవాలు మెండు

చిగురాకు మోవిపైన చిరునవ్వే చికిలింత
నీ చేయి నాచేయి ఏకమైతె ఒక వింత
తెలిసెనా రవ్వంత తెలుసుకో మరికొంత
వలపు తీపి సాంతం తెలుసుకోవె కాంతం
గుడు గుడు కుంచం పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి & బృందం 

గుడు గుడు కుంచం కిర కిర మంచం
అడిగేవారికి మా అందాలు లంచం

కోరస్:
గుడు గుడు కుంచం కిర కిర మంచం
కాస్కో రాజా ! చూస్కో రాజా

చక్కని చిన్నది ఉంది చెక్కిట చిటికేసింది
రోషం ఉంటె మీసం దువ్వి ముందుకు రమ్మంది

కోరస్:
ఇదిగో రావయ్య అందుకొని పోవయ్య

ఏమయ్యో! రావయ్యో మజా మజా
గుడు గుడు గుడు

తిన్నెలమీదే ఆట కన్నెలతో సయ్యాట
పడుచుదనాలా పొనుపు చూసీ
పడిపోవద్దయ్యా

కోరస్:
నాతో రావయ్యా! నీతో నేనయ్యా!

ఏమయ్యో! రామయ్యో!
చలో చలో గుడు గుడు గుడు

ఫో ఫో పొమ్మంటె పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి , పి. బి. శ్రీనివాస్ 

ఫో ఫో పొమ్మంటె వస్తావేం బంతి
పో పో పొమ్మంటే రమ్మనిలే ఇంతీ
రా రా రమ్మంటే పోతావే బంతి
రా రా రమ్మంటే పొమ్మనిలే ఇంతీ
ఔనా?
అవును
అంతేనా?
అంతేగా
నీ మాటంటె నీళ్ళల్లో మూటేలే
కాదు
కాదా?
నీతోడు
నా మాటంటే ముత్యాల బాకులే
అదే ఆశతో భలే మోజుతో చెలుని చేరింది బంతి 
చెలిమి కోరింది ఇంతీ
ఏమిటి?
నీ మనసే
నా మనసా?
నన్ను లోలోన వలచేవు నీవు
కనులే
కనులే
కలిపి
కలిపీ?
నన్ను మౌనంగా పిలిచేవు నీవు 
నిన్ను నేనైనా! నన్ను నీవైనా 
గెలుచుకోవాలి ఇంతీ 
నిజం తెలుసుకోవాలి బంతి
Love in Andhra పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి, యస్.పి. బాలు 

లవ్ ఇన్ ఆంధ్ర బలే సరదా
లవ్ ఇన్ ఆంధ్ర బలే సరదా
We are Love Birds We are Young Ones Come on

కోరస్:
Love in Andhra, Lovely Andhra

ఇమాం పసందు మామిడిపండ్లు తీపి తీపి
అనాబుషాహి ద్రాక్షపండ్లు ఏమి కైపు కైపు

కోనసీమ ఆవకాయ ఘాటు ఘాటు
పల్నాటిసీమ గోంగూర యేమి హాటు హాటు

వడ్లమూడి నారింజ పులుపు తీపి
వన్నెలాడి ప్రక్కనుండె యెంత Happy Happy
అందం ఉన్నదీ హల్లో అన్నదీ పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్ 

అందం ఉన్నదీ హల్లో అన్నదీ
అల్లరి కళ్ళదీ జిల్ అన్నదీ
పందెం వేసే పచ్చని సొగసే
చిందులు వేస్తుంది
హల్లో! హల్లో! హల్లో ల్లో ల్లో లో 

నీ మధు పాత్రలోని పొంగులాగ
నిన్నూరించనా! ఊగించనా! జాలీగా
క్రొత్తగ పాడుతూ! కులాసగ ఆడుతూ
మత్తుగ నిన్ను చేరుకొని మిన్నులందుకోనా

నీ కెమ్మోవిలోని కెంపులన్ని
రమ్మంటున్నవీ! సై అన్న ! అహజానీ॥
వెచ్చగ తాకుతూ ముచ్చటలాడుతూ
మెత్తని కైపులోన నీ రూపు దోచుకోనా!

ఏడుకొండలవాడా పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, యస్. జానకి 

ఏడుకొండలవాడా వెంకన్న సామీ.
దాసులపై దయరాదా
ఎక్కడ ఉన్నావయ్యా! గోవిందా!
మొక్కులందుకోవయ్యా గోవిందా!
ఒక్కసారి నిను దర్శిస్తే
మా చిక్కులు తీరును లేవయ్యా! గోవిందా! గోవిందా!

కొలిచినవారికి కొంగుబంగారమై
కోరిన సిరులిచ్చే యెంకన్నా
కోయని పిలిచిన ఓ-యని పలికే
కొండంత మనసే నీదన్నా
వడ్డికాసులవాడా! గోవిందా
ఆపద మొక్కులవాడా! గోవిందా
దుష్ప్రభంజనా! శిష్టరంజనా
పంకజచరణా! సంకటహరణా
ఎట్టులైన నీ పదపంకజములు
పట్టుబట్టి చేపట్టక వదలను గోవిందా! గోవిందా!

అలివేలు మంగమ్మ అలకలు పోతుంటే
కలవరపడకయ్య ఓ దేవా!
బీబీ నాంచారమ్మ బిగువు చూపుతుంటే
బెంబేలు పడకయ్య మా దేవా!
భక్తులమున్నామయ్యా గోవిందా!
భజనలు చేస్తామయ్యా! గోవిందా!
తిరుమలవాసా! దురితవినాశా
సురిచిరవేషా సుందరహాసా
పరాకుచేయక బిరానకోరిన
వరాలొసగి మము తరింపజేయరా! గోవిందా!
గోవిందా!


No comments

Most Recent

Default