Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Raitu Bidda (1971)

చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
నటీనటులు: యన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, అనురాధ, శాంతకుమారి, ఛాయాదేవి, సుజాత
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: కోట్ల వెంకట్రామయ్య
విడుదల తేది: 19.05.1971Songs List:దేవుడు సృష్టించాడు లోకాలు పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: కొసరాజు
గానం: గంటసాల & కోరస్

దేవుడు సృష్టించాడు లోకాలు
ఈ మనిషే కల్పించాడు తేడాలు

పంచెగ్గట్టి మట్టిలో దిగితే
బీదా బిక్కి భావముండదు
వళ్ళు విరిచి చాకిరీకి వంగితే
గొప్పవాడినని అహం ఉండదు

రైతే మేడిపట్టకపోతే... ఓ ఓ ఓ 
నవధాన్యం పండిచకపోతే 
తినడానికి నీకెక్కడ వుందీ
ఇంకా నీ బ్రతుకేముంది

మూడంతస్తుల మేడల్లోనా
సంతోషం కనబడదయ్య
ఓడల్లాంటి కారుల్లోన 
సంతుస్టన్నది కరువయ్యా

వెచ్చని పూరిగుడిసెల్లోన
పచ్చని పొలాల పైరుల్లోనా
శ్రమపడుతుంటే పిచ్చి రైతులా
చెమట బొట్టులో ఉందిరా సుఖం

ధనగర్వమ్మున నిక్కేవాడికి
శాంతియన్నదే ఉండదురా
రాజకీయముల మునిగేవాడికి
జీవితమల్లా అశాంతేరా
నాదని భూమిని నమ్మేవాడికి
నాగలి పట్టి దున్నేవాడికి
ఉన్నది ఎంతో సంతృప్తి
ఉందిరా సుఖ సంపత్తిఅ- అమ్మ ఆ - ఆవు పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల & కోరస్

శాంత: 
అ- అమ్మ ఆ - ఆవు
అమ్మవంటిదే ఆవు
అది తెలుసుకో నీవు
ఇ - ఇల్లు ఈ - ఈశ్వరుడు
ఇంటిని ఇలనూ కాచేదెవడు ?
ఈశ్వరుడు ! పరమేశ్వరుడు

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ 
ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ జ - చ ఛ జ ఝ ఇ
ట ఈడ ఢ ణ - తథదధన
పఫ బ భ మ యరలవ

అ మొదలుకొని క్ష వరకు మన
అక్షరాలు యాభైయారూ 
అక్షరమాల నేర్చుకొని
ఆపై బ్రతుకులు దిదుకొని
చక్కని పౌరులు కావాలి ! మన
జాతికి పేరు తేవాలి     (అ-అమ్మ)

అందరిదీ ఒకేకులం
అందరమూ మానవులం
కండలు పెంచితే సరిపోదు
కొవాలయ్యా బుద్ధిబలం  (అ-అమ్మ)

మనభాషలు వేరేఐనా 
మన మతాలు వేరేఐనా
జీసస్ - ఈశ్వర్ -
ఈశ్వర అల్లా తేరేనామ్
సబకో సన్మతి దే భగవాన్

కోరస్: రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్.
శాంత : సబ్ కో సన్మతి దే భగవాన్
కోరస్: రఘుపతి రాఘవ రాజారామ్
పతిత పావన సీతారామ్

శాంత : మన భాషలు వేరే ఐనా
మన మతాలు వేరే ఐనా
పాలూ పైరూ ఒకటే ! 
భూమాత అందరి కొకటె

శాంత : పేదా గొప్పా భేదాలు
పెళ్ళగించుకొని పోవాలి
గిరిజనుడే పురజనుడై
ధరా చక్రమును తిప్పాలి
ఈధరా చక్రమును తిప్పాలి
అ- అనురాగం ఆ - ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల

రాము : అ - అమ్మ ఆ - ఆపు
రాము : ఇ - ఇల్లు, ఈ 
శాంత : ఈశ్వరుడు !
రాము : ఇంటిని ఇలనూ కాచేదెవడు ?
ఈశ్వరుడు - పరమేశ్వరుడు ! !
శాంత : అప్పుడే అక్షరాలన్నీ నేర్చేసుకున్నారే
రాము : (నవ్వుతూ) అక్షరాలు అవేఐనా అర్థాలు వేరు
అ- అనురాగం ఆ - ఆనందం
అక్షరాలు అవేఐనా
చెప్పండి సరికొత పాఠాలు
మాష్టారు ఇక చెప్పండి సరికొత్త పాఠాలు

శాంత : నెలవంక కంటబడితే కలువమ్మ నవ్వుతుంది
గోరింక వెంటబడితే చిలుకమ్మ కులుకుతుంది
ఎందుకో ! తెలుసుకో
రాము : చిలకమ్మ ఎగిరేది : కలువమ్మ వాడేది
చెలియా నీ వలపేమో ! కలకాలం నిలచేది
తెలుసుకో ! తెలుసుకో ! చిలకమ్మ

శాంత : నీచూపు సోకగానే నా చెంప కందిపోయె
నీమోము చూడగానే నా మేను పొంగిపోయె
ఎందుకో ! తెలుసుకో ! తెలుసుకో !
రాము : నీ చెంప చిగురింత ! నీ మేని పులకింత
కనరాని ఒకవింత | కావాలి మరికొంత
తెలుసుకో ! తెలుసుకో ! 

రాము - శాంత: 
అ అనురాగం ఆ - ఆనందం
అక్షరాలు అవేఐనా అర్ధాలు వేరు
రాము : ఇక చెప్పండి సరికొత్త పాఠాలు
శాంత : ఇంకా చెప్పాలా సరికొత్త పాఠాలు
అనేక వరాల
విరిసిన మరుమల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల, యస్. పి.బాలు

సాకీ : 

ప్రసాద్: 

దిక్కులను చూ సేపు
దిగులుగా నిలిచేవు !

అనుకున్న కబురంద లేదా ! 
ఎందు కమ్మాయి నీకింత బాధ !

పల్లవి:
ఓ ఓ ఓ విరిసిన మరుమల్లీ
జరుగును మన పెళ్ళి
ముత్యాల పందిరిలోనా
మురిపాల సందడిలోనా
మురిపాల సందడిలోనా

రాధ :
అమ్మగారి దీవనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరేనన్నారా

ప్రసాద్ : ఓ.... ఓ.... ఓ.... ఆ ..... ఆ....ఆ....

రాధ : 
అమ్మగారి దీవనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరేనన్నారా

ప్రసాద్: 
మనసు కనుగొన్నారు ప్రణయకథవిన్నారు
మనసు కనుగొన్నారు ప్రణయకథ విన్నారు
మనల మన్నిచారు మనువు కుదిరించారు
విరిసిన మరుమల్లీ జరుగును మన పెళ్ళి

రాధ:
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా
కళ్ళలోన కలకాలం దాచుకుంటావా

ప్రసాద్ : 
వలచి కాదంటానా | కలసి విడిచిపోతానా

రాధ:
పలచి కాదంటానా | కలసి విడిపోతానా !
ఏకమైవుందాము : ఎన్ని జన్మలకై నా : !
విరిసిన మరుమల్లీ ! జరుగును మన పెళ్ళి !
అద్దరాత్రిని నిద్దుర పొద్దున పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, యల్. ఆర్. ఈశ్వరి

ఎల్లయ్య : 
ఏమే బాలా ఏందే గోలా !
నిను నేను వలచీ - వచ్చానే లైలా !

అమృతం : 
అద్దరాత్రిని నిద్దుర పొద్దున పచ్చావా ?
యీ - పరాయిపిల్లను అన్యాయంగా
బజార్న పెడతావా ?
నన్ను - బజార్న పెడతావా !
ఏమయ్యో ! ఏమయ్యో : ఏమయ్యో !
మామయ్యో ! మామయ్యో ! మామయ్యో

ఎల్లయ్య : 
పరాయిదానవు నువ్ కావు
నా సొంతదానివై ఉన్నావు
ప్రేమపక్షులకు పగలూ రేయ్యను
భేదాలేమీ లేనేలేవు
చమక్ ! చమక్ ! చమ్ !  (అద్దరాత్రిని!)

అమృతం : 
పక్కన ఉన్న మా అయ్య
పసికట్టాడంటే ఓరయ్యో ఓహో ఓహో
మక్కెలిరగ గొడతాడయ్యో
నీ నిషా ఎగిరిపోతుందయ్యో ఓ ఓ ఓ.

(అద్దరాత్రిని!)

ఎల్లయ్య : 
చుక్కేశాడూ నిదరోయాడు
మనగొడవేమి వినుకో లేడు పిల్లా ! పిల్లోయ్ !
బిత్తరపోయీ అడలె తేవు
ఒళ్లోకూసో గుమ్మపుతావు
పిల్లా పిల్లా ! పిల్లా పిల్లా ! అమృతం అమృతం
అమృతం నా అమృతం |  (అద్దరాత్రిని!)

అమృతం : 
అబ్బబ్బో మొనగాడయ్యో
ఎర్రి మీద ఉన్నాడయ్యో
తెల్లారినాక చూద్దామయ్యా
తీరిక చేసుక రావయ్య
చమక్ ! చమక్ ! చమ్ ! (అద్దరాత్రిని!)
రైతే రాజ్యం ఏలాలీ పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల & కోరస్

రైతే రాజ్యం ఏలాలీ ! మన రైతుకు రక్షణ కావాలి !
మన రైతుల బాధలు తీరాలీ !
దున్నేవాడే హక్కుదారుడని
ఢంకాకొట్టి చాటాలి, ఢంకా కొట్టి చాటాలి !

శాంత :
కలవారింట్లో పుట్టినవాడూ - లేమిని వరించి వచ్చినవాడూ
కష్టజీవిగా బ్రతకడమే - తన పరమార్థంగా ఎంచేవాడూ
త్యాగం శీలం గలిన నాయకుడొక్కడుండినా చాలూ
కోటికి ఒక్కడుండిన చాలూ దేశానికి ఎంతో మేలు !
కోరస్: దేశానికి ఎంతో మేలు

||రై తేరాజ్యం ఏలాలీ||

రాము : 
నీ గొప్ప చెప్పుకొని తృప్తి చెందకు - ఆ వేశాలతో చిందులెయ్యకు
కష్టజీవిలా ఐక్యతలో - దేశానికి మోక్షం వుందని చెప్పు
అని కుర్చుండే సోమరిపోతుల - డచ్చీలిక పై చెల్లవురా రైతేరాజ్యం ఏలాలీ
శాంత : మన రైతుకు రక్షణ కావాలి
రాము | మన రైతుల బాధలు తీరాలి
ఇద్దరు : దున్నేవాడే హక్కుదారుడని
ఢంకా కొట్టి చాటాలి - ఢంకాకొట్టి చాటాలీమనిషిని నమ్మితే ఏముందిరా పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి.జె. సుకుమార్

పుల్లయ్య : 
మనిషిని నమ్మితే ఏముందిరా
మబ్బును నమ్మినా ఫలితముందిరా ! నాన్నా
తీవెను పెంచితే పూలిసుందిరా
గోవును పెంచితే పాలిస్తుందిరా !

పాముకు మొక్కుకుంటే పక్కకు తొలగునురా
మనిషిని నమ్ముకుంటే పచ్చివిషం దొరుకునురా
పచ్చివిషం దొరుకునురా !
||మనిషిని నమ్మి తే॥
కుడిచిన, పొదుగునే పొడిచేవారున్నారు
పెట్టినచేయినే విరిచేవారున్నారు
బంధువులని చెప్పుకొనే రాబందులు ఉన్నారు
మేకవన్నె పులులూ ఈ లోకమంతా ఉన్నారు
ఈ లోకమంతా ఉన్నారు ||మనిషిని నమ్మి తే॥
మె 'త్తగ మసులుకుంటె మెతుకుపట్టదు : నాన్నా !
మంచికి ఈలోకం విలువకటదు !
ఏటికి ఎదురీదనిదే గటు దొరకదు
ఎతుకు పెఎతు లేక ఏదీ జరగదు | నునిషిని నమ్మి తే॥రాజు, రాణి, పాట సాహిత్యం

 
చిత్రం: రైతుబిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. పి. బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది , యల్. ఆర్. ఈశ్వరి బృందం

హే ! మహా ప్రభో !
పొందుగ మీ కీరితి జన
బృందమ్మున దూకి ఫెళ ఫెళమనుచున్
సందుల గొందుల దూరి 
పసందుగ ఎగబ్రాకెనయ్యా ! సరసాల జియ్యా

బృందం : మేటి సరదారు వయ్యా
తదిగినతోం ! తదిగినతోం ! తదిగినతోం !

వంతకుడు : 
మహాప్రభువుల దర్శనార్ధము వచ్చిన
(పుల్లయ్య) నిమిత్తమేమి సెలవీయ వయ్యా

రాజు :
కప్పల బెక బెక లటుల
డప్పుల చప్పుడులవోలె ఢమఢమ మనుచున్

రాణి,
గుప్పున వ్యాపించెను ఓ యప్పా , మీ పెండ్లి వార్త!
అఖిల జగాలన్ నిన్ను ఇక పొగడ జాలన్

బృందం : 
తళాంగు తధిగిణ పితకతోం!
తళాంగు తధిగిణ పితకలోం

సూత్రధారుడు : ఓ... ఆ ఆ ఆ అయ్యా!

కోరస్:
తాంగిట తకఝణు తాంగిట తకఝణు
తాంగిట తకఝణు తాంగిట తకఝణు
తాంగిట తకధినతోం తాంగిట తకధినతోం

కృష్ణుడు : 
వెడలె యదువంశ భూషణుడు - బంగారు రధముపై

(రాము) వెడలె శరణాగత పోషణుడు
ఒక్క చేతిలో చక్రము మెరయగ

కోరస్ : ఒక్క చేతిలో చక్రము మెరయగ
కృష్ణుడు : ఒక్క చేతిలో వేణుపు వెలయగ
కోరస్ ; ఒక్కచేతిలో వేణువు వెలయగ
కృష్ణుడు : దారిలోన నరనారులు పౌరులు - బారులు దీరిచి ఔరాయనగా
వెడలే - యుగువంశ భూషణుడూ

సూత్ర: బాలామణి రుక్మిణి పంపిన ప్రణయసం దేశము

(పుల్లయ్య) 
భూసురోత్తముని వలన విని వలెయని గోపాలచూడామణి
ఏ ప్రకారంగా సెలవిచ్చెనయ్యా అంటే

కృష్ణుడు :
హరిపొందు గోరిన - సిరివోలె రుక్మిణి
రాము: వలచె నన్నేయని తెలియునయ్యా
హరిపొందు గోరిన - సిరివోలె రుక్మిణి
వలచె నన్నేయని తెలియునయ్యా !
ఎలప్రాయమందె బొమ్మల కొల్వులో నన్నె
వలచినదంచును తెలియునయ్యా !

2) 
రమణీలలామ రూపము నా హృదయసీమ
చెరిగిపోలేదని చెప్పలేవయ్యా
కలలోననె న ఆ కన్నియ పేరె స్మ
రించెదనని విన్నవించవయ్యా

3) 
అన్న కాదన్న అయ్య ఔననకయున్న
ఒక్క శిశుపాలుడేకాదు దిక్కులన్ని ఎత్తివచ్చినగాని హేఁ !
జయించి మించి - కలికి నేలుకొందునటంచు తెలుపవయ్యా
సూత్ర : అంతట శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రకారంబుగా బయలు దేరి
(పుల్లయ్య) నాడయ్యా అంటే 

కృష్ణుడు : అదిగదిగో నా రుక్మిణి - అల్లదుగో అందాల బాలామణీ
(రాము)
అదిగదిగో నా రుక్మిణి ముక్కోటి దేవతల మొక్కులు చెల్లించి
కోరస్:
మొక్కులూ చెల్లించి
కృష్ణుడు : కొండంత బరువు తన గుండెల్లో భరియించి
కోరస్: గుండెల్లో భరియించి
కృష్ణుడు : నా రాకకై వేచి కనులు కాయలుగాచి
కోరస్: నా రాకకై వేచి కనులు కాయలుగాచి
కృష్ణుడు : నడయాడినది చూడు అదిగదిగో నా రుక్మిణి
సురగరుడ - శుచరకిన్నెరులైన
భీకాలుసురులైన - నరపాలకులైన --
కొదము సింగమురీతి కుప్పించి దూకి
కోరస్ : కుప్పించి దూకి
కృష్ణుడు : చేతనిడుకొనిపోదు నా పైడి బొమ్మను
కోరస్: నా పెడి బొమ్మను
కృష్ణుడు : ఎత్తుకొనిపోదు నాముద్దుగుమ్మను
కోరస్ : ఎత్తుకొనిపోదు నా ముద్దుగుమ్మను
కోరస్ : ఎతుకొనిపోదు 
ఎతుకొనిపోదు ఆ... ఆ... ఆ...

No comments

Most Recent

Default