చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: ఎస్. పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చలం, విజయ లలిత, విజయ నిర్మల
కథ , స్క్రీన్ ప్లే: రాజశ్రీ
దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు
నిర్మాత: టి.మోహన్ రావు
విడుదల తేది: 01.19.1972
పల్లవి:
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...
మమతలమూట
చరణం: 1
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ
ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మ అన్నది - ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...
మమతలమూట
చరణం: 2
అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా..
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...
మమతలమూట
చరణం: 3
అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...
మమతలమూట
No comments
Post a Comment