Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chinnanati Snehitulu (1971)

చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్. టి.రామారావు, జగ్గయ్య, శోభన్ బాబు, వాణిశ్రీ , దేవిక
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 06.10.1971Songs List:ఇక్కడే ఈ గదిలోనే పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: గంటసాల, పి.సుశీల

ఇక్కడే ఈ గదిలోనే
అప్పుడే ఒకటైనప్పుడే
అలివేణి సిగపూలు ఏమన్నావో...ఈ
అలివేణి సిగపూలు ఏమన్నావో
తొలిరేయి తెలవారలేనన్నదో
మరి ఏమన్నదో చెప్పనా మళ్ళీ చెప్పనా

శృతిమించెను శ్రీవారి మనసు
గడుసైన వయసు అగుపించెను
ఆనాటి తలపు అరువైన వలపు

నీ ఓర చూపుల తొందరలు
నీ దోర నవ్వుల దొంతరలు
అలనాటి రాగాలే పాలికించగా
అనురాగ వీణ నిదురింతునా నా

ఇక్కడే ఈ గదిలోనే
అప్పుడే ఒకటైనప్పుడే
దొరగారి యెదపొంగు ఏమన్నదో...ఈ
అలివేణి సిగపూలు ఏమన్నాదో
పరువాలు విరబూసి 
చెప్పవే జాబిల్లి చెప్పవే

ఇక తీరును ఇన్నాళ్ల వేడుక ఇల్లాలి కోరిక
ఉదయించును మన ఇంట భానుడు ఒక బలరాముడు
మీనోటి పలుకే దీవనయై
మీ తోటి బ్రతుకే పావనమై

ఏమని తెలుపనురా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
ఏమని తెలుపనురా స్వామి
ఏమని తెలుపనురా !
తొలి చూపులోనే-ఏ
గిలిగింతలాయెనో!!

చరణం: 1
చిననాటి కధలేవో తెలిపీ-
చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ
మీటీ-కన్ను గీటీ
చెమరించు నా మేని
పెనుగాలి వలె తాకి
మనసు తెలిసి మరులుకురిసి
కన్నియ మది కరగించిన గడసరివని
ఏమని ! ఏమని! ఏమని
ఇంకేమని తెలుపనురా !

చరణం: 2
ఎదలోని పొదరింట జేరీ - నన్నే కోరీ
పదునైన తల పేదో రేపీ - ఆశ చూపీ
రసలోక శిఖరాల - కొసలేవో చూపించి
ఏమనందు! ఇంకముందు
ఏ వింతల ! పులకింతల ! తేలింతువో !
ఏమని ! ఏమని! ఏమని ! ఇంకేమని !!అడగాలని వుంది పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

అడగాలని వుంది ఒక టడగాలని వుంది
అడిగిన దానికి బదులిస్తే
అందుకు బహుమానం
ఒక టుంది!
ఎదురుగా నిలుచుంటే
ఎంతో ముద్దుగ మెరి సేదేదీ ?
అందీ అందకుంటే
ఇంకెంతో అందం చిందేదేదీ ?

చేప ! చూపు ! సిగ్గు ! మొగ్గ
మొగ్గ కాదు కన్నెపిల్ల బుగ్గ !!
కొత్తగా రుచి చూస్తుంటే
మత్తుగా వుండేదేదీ !
మళ్ళీ తలచుకుంటే
మరింత రుచిగా వుండేదేదీ

వెన్న ! జున్ను ! తీపి ! పులుపు
పులుపు కాదు తొలి వలపు ! !
ఎంతగా చలి వేస్తుంటే
అంతగా మనసయ్యేదేదీ ఎంతగా చేరదీస్తే
అంతగా మురిపించేదేదీ !

కుంపటి! దుప్పటి ! గొంగలి ! కంబళి
కంబళి కాదు కౌగిలీ !!

అడగాలని వుంది అది
అడగాలని వుంది!
అడగంగానే ఇచ్చేస్తే
అందులో రుచి యేముంది!!

అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

అందాల శ్రీమతికి
మనసైన ప్రియసతికి
వలపుల కానుకగా! 
ఒక పాపను నేనివ్వనా !!

మబ్బులలో విహరించే
మావారి అనురాగం
వాడని మందారం! 
నా పాపిట సింధూరం!!
మా బాబు నయనాలు!
లేత జాబిల్లి కిరణాలు !

వీడే.. ఇంతవాడే! 
అంతవాడై వెలుగుతాడు!

కళలు నిండారగా
సిరులు పొంగారగా!!
శౌర్యంలో నేతాజీ
సహనంలో గాంధీజీ
శాంతి గుణంలో నెహ్రూజీ
సాహసంలో శాస్త్రీజీ
ఒరవడిగా వడివడిగా 
నీ నడవడి తీర్చిదిద్దుకొని
సరిహద్దులలో పొంచిన ద్రోహుల
తరిమి తరిమి కొట్టాలి!
వీర సైనికుడవై భారతావని
పేరును నిలబెట్టాలి!!
వందేమాతరం!
వందేమాతరం!
సీతమ్మతల్లికి సీమంతమమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల & పార్టీ

పల్లవి:
సీతమ్మతల్లికి సీమంతమమ్మా
శ్రీదేవిభూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తు శుభమస్తు సుపుత్రాప్రాప్తి రస్తు తథాస్తు,

చరణం: 1
వేదగాననే వినువీధులంటగ
మంగళనాదాలు ముంగిట
శ్రీవాణి జయ స రంగ -
శ్రీగౌరి శుభగీతి వినిపించగ

చరణం: 2
కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల సేసలు చల్లీ
ముత్తైదువలే హారతు లివ్వగా
ముక్కోటి దేవతలు దీవించగా
నోములు పండగా పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల & వసంత

నోములు పండగా నూరేళ్ళు నిండగా
పెరగాలి బంగారు నాన్నా నిలపాలి నీ పేరు కన్నా

చీకటినే వెలిగించే
దివ్వెవు కావాలనీ
చింతలు తొలగించే
చిరునవ్వువు కావాలని
కన్నతల్లి ఎన్నికలలు కన్నదో
ఎన్నెన్ని దేవతలకు
మొక్కుకున్నదో!

పరమాత్మకు ప్రతిరూపం నీవనీ
పసిడి కళల మణిదీపం నీవనీ
కలలుగని నినుగన్న కన్నతల్లి మనసు

కడుపులో పెరిగిన ఓ కన్నా!
సీకే తెలుసు! నాకన్నా నీకే తెలుసు!

పాలిచ్చి పాలించే ఈ తల్లీ తల్లి కాదు నీపాలి కల్పవల్లీ
ఈ వరాల మొలకను! ఈ జాబిలి తునకను
దీవనగా మాకిచ్చిన ఆ తల్లి తల్లి కాదు మాపాలి కల్పవల్లి
ఎందుకయ్యా నవ్వుతావు పాట సాహిత్యం

 
చిత్రం: చిన్ననాటి స్నేహితులు(1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఎందుకయ్యా నవ్వుతావు ఎవరు సుఖపడినారనీ
నవ్వుకోరా తనివి తీరా ఎవ్వరేమైతేమని!
నువ్వు కడుపున పడిననాడే 
నుదుటి కుంకుమ చెరిపినావే
నిండు వెన్నెల బాటలో
కన్నీటి చీకటి నింపినావే
చావు బ్రతుకుల ఉందిరా
నిను చల్లగా కాపాడు దేవత
ఆమె నీడయె లేని నాడు
ఆగిపోవును మన కథ
నిన్ను పెంచిన కల్పవల్లీ
నిండుగా బ్రతకాలనీ
వేడుకోరా వెంక టేశుని

వేడుకోరా విశ్వనాధుని
వేడుకోరా! వేడుకోరా!


No comments

Most Recent

Default