Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maavari Manchitanam (1979)
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి (All)
మాటలు: గొల్లపూడి
నటీనటులు: N.T. రామారావు, వాణిశ్రీ, బేబీ రోహిణి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
నిర్మాత: పండరీ కాక్షయ్య
విడుదల తేది: 09.03.1979Songs List:ఎంతకైనా తగినవాడవేరా పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

ఎంతకైనా తగినవాడవేరా !
మురళీధరా ! రాగాల దొరా ! నవ
శ్రావణ జలథర నీల సుందరా !

||ఎంతకైనా||

ననుమరచీ యమునను మరచి , వె
న్నెల కురియు ఇసుక తిన్నెల మరచీ
మధురాపురిలో వున్నావా !
నీ మథురాథరనే కాదన్నావా !

||ఎంతకైనా||

ఈ సురపొన్నలు చెబుతాయి ! నా
యెదలోని తీయని అలజడినీ ! ఈ
వెదురు పొదలన్నీ చెబుతాయి నీ
వేణువు చేసిన అల్లరినీ

||ఎంతకైనా||

ఎంతగా సుమశరుడు నన్ను వేధించినా
వింతగా హిమకరుడు నన్ను కవ్వించినా
రేలన్ని పగబూనినా ! చలి - గాలి సెగలై వీచినా !
నీ భావనమే నా జీవనమై - నీ కీర్తనమే నా నర్తనమె
నీ చరణమే నా శరణమై - నీ స్మరణమే భవతణమై
నిన్ను నమ్మి ఇన్ని నాళ్ళు వేచిన
ఎన్ని యుగములైన నిన్నే వలచిన
రాధనురా ! నీ రాధనురా 

||ఎంతకైనా॥

మీ మంచితనానికి పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల, ఎస్. పి. బాలు

మీ మంచితనానికి చేస్తున్నాను - మరోసారి వందనం !
అది - వందనమో శ్రీ చందనమో
హృదయాలు పొందిన స్పందనమో ! ....

ఎదపైన గిరులను మోపే - ఇలకున్న సహనం మీది !
శిలలందు మణులను చూసే - తులలేని హృదయం మీది
సుగుణాలన్ని ఒక బైయున్న-సుందరరూపం మీది 

||మీ మంచి||

పసిడి కలల మేడలకన్నా - పర్ణశాల మేలని తెలిసీ
తనువులోని తళుకులకన్నా - మమత విలువ మిన్నగ తలచి
మలచుకున్న బ్రతుకులోన - పులకించు అనంత నసంతం
చెంచీత వెడలే వేటకు పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల, రామకృష్ణ, ఆనంద్ , కోవెల శాంత

చెలికత్తెల:
చెంచీత వెడలే వేటకు ! చిన్నారి ముద్దుల
చెంచీత వెడలే వేటకు
కుడియెడమల చెలికత్తెలు నడవగ
అడవి మెకమ్ములు గడగడలాడగ
కాసెకట్టి విల్లుపట్టి మగటిమి
రాశియైన వీరావతారమన

చెంచిత: 
తగవేనా ఇది మగువా సరియేనా ఇది లలనా !
పిట్టల కొట్టుట వేటేనా - లేళ్ళను కొట్టుట వేటేనా !
గాండ్రు గాండ్రుమని గర్జించెడి | సింగాల జూలు చేపట్టుటేవేట

॥చెంచీతం||

వచనం:
ఏమి వింత మెకము - ఇదియేటి కొత్త మొకము
తలయేమో సింగానిది - తనువేమో నరునిది
పకితే ఈ మెకమునే చేపట్టవలె పసిడిబోనులోన చెరపట్టవలె

ఎ వూరు ఏ వూరు నీది ?
ఏపూరు తలచినా నాదే
ఏ పేరు ఏ పేరు నీది ?
ఏ పేరు పిలిచినా నాదే !
ఎవ్వరో నిను కన్నవారు ?
లేరెవరు నను గన్నవారు !

ఏదీ నీ కులమేది యేది?
పుట్టుకే లేనివాని కులమేమి చెప్పేది ?
కూత గాడివే
చేత జూస్తువా!
ఓ యబ్బో మగసిరి గలాడివా
మగవాడను - సిరికి తగువాడను
చెట్టు లెక్కగలవా ఓ నరహరి
పుట్ట లెక్క గలవా ?

చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా !
ఓ నరహరి ! చిగురు కోయగలవా

చెట్టులేమి లెక్క ఓ చెంచిత పట్ట లేమి లెక్క
గుట్టలు మిట్టలు దాటి, చుక్కల మెట్టు లెక్కగలనే
చంద్రుని గుట్టు పట్టగలనే ,

ఏరు లీదగలవా, ఓ రబ్బీ ! ఊరు చేరగలవా ?
ఏరులేమి లెక్క వరదల హోరులేమి లెక్క
పుట్టగానె, తొడగొట్టి, కడలి కలబెట్టి ఈదినానే 
ఒ చెంచిత! గట్టు చేరినానే!

పుడమి నెత్తగలవా ! ఓ నరహరి ! పడగలొత్తగలవా ?
పుడమిని మోసే పడగలపైనే పడక వేయగలనే,
నువునా ఒడికి చేరుకుంటే, మరినా అడుగులోత్తుతుంటే
ఓ చెంచిత : పడగ లొ తగలనే !

అమ్మమ్మో ! ఏల ? ఏలా నాకింత పులకింత, ఈవింత కవ్వింత
పురులు విప్పినా పరువం ! కరిగిపోయె నా గరువం

హరి తాకిడికి సిరి కరుగ కుండునా
మరులెత్తి మరుగ కుండునా ?
ఈ రగిలే తీయదనం - ఏనాడూ ఎరుగనురా
ఏమిమాయచేసినావో - ఇంక ఓపజాలనురా !
ఓ దొరా......... నా దొరా !

మాయ కాదు దేవి ! విడదీయని తొలి బంధమిది !
ఒరులెవరూ ఎరుగనిది ! ఒక నేనే ఎరిగినది?

చెంచుదొర: 
చెంచీతా ! ఓ చెంచీతా !
ఎవడుర ఈ గుంటడు నా కూన నదుముకుంటాడు!
ఏమి కండపొగరు ? ఏమి గుండె జిగురు ?
వంచెద తుంచెద తెంచెద నిను కాల్పించెద
వంచక కీచకుడా !

నారద:
నారాయణ ! నారాయణ ! చెంచుదొరా |
యోచించుదొరా ! ఈ లచ్చిమి ఇక్కడుండవలసింది కాదు,
అక్కడ.... ఆ సింగని ప్రక్కన.

చెంచుదొర: 
అదేమిటి సామి ! ఎకసక్కాలా ?
వూరూ పేరూ తెలియనోడికి, ఎనకాముందూ ఏముందో తెలియనోడికి
ఎట్టా కట్టబెట్టేది స్వామి నా సిట్టి కూనను

నారద: పిచ్చి దొరా

పద్యం: 
ఊరెరుగని పేరెరుగని
వేరెవ్వరు తోడులేని విభుడు లభింపన్
ఔరా ! నీ కూతురు ఏ
పోరెరుగక నిత్య సుఖములు పొందును గాదా !

వచనం: 
అ పైన మీ లచ్చిమికి నచ్చినవాడు, నేను మెచ్చిన వాడు, 
ఊఁ..... కానీ..... శుభస్యశీఘ్రం.....కల్యాణమస్తు ....

నారద: నారాయణ నారాయణ !
ఆదిలక్ష్మి: స్వామి ! ఎక్కడ నా నారాయణుడు ?
నారద: పిచ్చితల్లీ ! ఇంకెక్కడి నీ నారాయణుడు

పద్యం: 
నారసింహమూర్తి నరుడుగా రూపొంది
చెంచుదాని వలను చిక్కెనెపుడో
నమ్ముకున్న హరియే నట్టేట నిను ముంచె
కంచె చేను మేయ కలదెదిక్కు !


ఆదిలక్ష్మి: మునీంద్రా  ఇది నిజమా!
నారద: అనుమానమా తల్లీ  అయితే మీకళ్ళతోనే చూడండి రండి .

చెంచిత: మోముపైన సిరిగంథముంది
ఎక్కడిదిరా సింగా  ఓ సింగా ,
సింగ: ఓ ఆదా  పుప్పొడి తప్ప ఏముంటుందిలేవే సింగీ ఓ సింగీ 
చెంచిత: పెదవిమీద ఆగంటు లెక్కడివి సింగా ఓ సింగా 
సింగ: ఓహో అదా  పొదరిల్లుకదలి తుమ్మెద పెదవి కరిచిందే చెలియా  ఓ చెలియా

చెంచిత: చెక్కిలీని నొక్కినట్లు చిన్నెలున్నాయెరా సామీ ఓ సామీ
సింగ: భలె..... భలే జుంటి తేనెలుజోపుతుంటే ఒత్తెనుకొమ్మ భామా ! ఓ భామా |
చెంచిత: అంతేనా సామీ |
సింగ: అంతేనే భామా |

ఆదిలక్ష్మి: 
జగముల నేలే పరంథామా !
తగునా నీకిది సుగుణ థామా !
శ్రీలక్ష్మి నే మరచినావా ? ఈ
చెంచు గుమ్మను వలచినావా ?

చెంచిత: ఎవతివే మాయలాడి ! నా సవతివా టక్కులాడి !
ఆదిలక్ష్మి: క్షీరాంబుథిలో పుట్టీ ! శ్రీహరి ఉరమున పెట్టీ !
కులసతినగు నన్నే ! ఈ కులట తూలనాడే !
పలుక వేలా ఓ ప్రాణనాధా 
అలుక ఏలా శ్రితపారిజాతా

చెంచిత: ఆపవే ఓ నంగనాచీ ! నీ నటన చూపకే ఓ చుప్పనాతీ !
ఆదిలక్ష్మి: వగలన్ని కట్టి పెట్టు! నా మగని నిక విడిచి పెట్టు 

చెంచిత: కట్టేసి వుంచితిన నేను |
ఆదిలక్ష్మి: మందు పెట్టేసి వుంచుకున్నావు |
చెంచిత: చేతనైతే తీసుకెళ్ళు
ఆదిలక్ష్మి: నీ శ్రీరంగ నీతులిక చెల్లు |
చెంచిత: నీ దారి చూసుకో
ఆదిలక్ష్మి: నీ నోరు మూసుకో
చెంచిత: నేనెవరో తెలుసుకో
ఆదిలక్ష్మి: నేనెవరొ తెలుసుకో

నారద: అయ్యయ్యో , అగచాట్లు, అగచాట్లు  ఆగండమ్మా  ఆగండి,
అమ్మా  ఆదిలక్ష్మీ ఈ చెంచులక్ష్మి ఏవరో తెలుసా ?

పద్యం: 
రాక్షసా ధీశ్వరుండు హిరణ్య కశిపుడజునిచే వరములు పొంది అహము పొంగి నిఖిల సురకోటిపైకి దండెత్తిరాగ,
ఫలము నందుంచే విభుడు నీ కళను , నాటి
ఫలమే చెంచిత యౌచు వర్ధిలెను దేవీ 

ఆదిలక్ష్మి: ఎమిటీ ! నాకళే ఈ చెంచీతా | నేనే ఈ చెంచితనా కళా !

శ్లోకం:
వనమాలీ గదీశార్ని శంఖీ చక్రీచ నందకీ
శ్రీమన్నారాయణో విష్ణూ వాసుదేవో భి రక్షతు |
కన్నా కన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు

కన్నా కన్నా దాగున్నావా
చిన్నా చిన్నా చూస్తున్నావా |
అమ్మదొంగా తొంగి చూస్తున్నావా ! నా
కన్నుగప్పీ ఆటలాడుతున్నావా |
చికిచికి జింజిం....చికిచికి జిం....
పొదమాటున పొంచి వుంటే
బూచులుంటాయి. తాచులుంటాయి

చెట్టు చాటున నక్కివుంటే
కోతులొస్తాయి నన్నెత్తుపోతాయి
దాగుడు మూతలు ఆడొద్దు
దారి తప్పిపోవద్దు..... పోవద్దు

॥చికిచికి॥

అమ్మ ఒడిలోవున్న చలువ
మల్లి కేదీ జాబిల్లి కేదీ
నాన్న నీడలో ఉన్న విలువ
ఎన లేనిది అది కొనలేనిదీ
అమ్మను ఎన్నడు మరవొద్దు
నాన్న నీడ విడవొద్దు.....విడవొద్దు

॥చికిచికి॥యాడనుంచి ఊడిపడ్డాడో పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

యాడనుంచి ఊడిపడ్డాడో
ఆసామిగాడు , వాడికన్ను నా మీదనే
ఓ లచ్చుమమ్మా | 
వాడ వాడ గుప్పుమన్నాదే

మొగిలిపూల అత్తరు పూసుకొని
మూడు పూటల సోకుచేసుకొని
ఈల వేసుకుంటూ - మీసాలు దువ్వుకుంటూ
వంక పెట్టివస్తాడె మాయింటికీ వాడి
వాలకం తెలిసిందె అత్తింటికి మా అత్తింటికి 

మాపటేలా మావాడొచ్చాడూ
పదవేపిల్లా పోదామన్నాడు ఇంతలో....
మాయిదారి సామిగాడు - మళ్ళీవూడి పడ్డాడు
ఏ మాయ చూపాడొ మావోడికి !
వాడెంతకూ రాడాయె నాకాడికీ....
మర్నాడు మాయింటోడు - తెల్ల గుర్రమెక్కి వచ్చేశాడు
పైటెందు కన్నాడు - అవ్వ | గౌను తొడగమన్నాడు
పల్లె వదలమన్నాడు - పట్నం పదమన్నాడు
ఓయమ్మే | ఆడి జిమ్మడా |
ఎంతపని చేశాడు సామిగాడు | మా
యింటోడ్ని తిప్పేశాడు సచ్చినోడు ఆసచ్చినోడు
అమ్మదొంగ పాట సాహిత్యం

 
చిత్రం: మా వారి మంచితనం (1979)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, శైలజ

లల్లా లల్లా లాల ల్లాలా
లల్లా లల్లా లాల ల్లాలా

అమ్మదొంగ తొంగిచూస్తున్నావా | నా
కన్ను గప్పీ ఆటలాడుతున్నావా |

చికిచికి జింజిం చికిచికిజిం
అమ్మ ఒడిలో వున్న చలువ
మల్లి కేదీ జాబిల్లి కేది |
నాన్న నీడలో ఉన్న విలువ
ఎనలేనిదీ అది కొనలేనిదీ
అమ్మను ఎన్నడు మరవొద్దు
నాన్న నీడ విడవొద్దు విడవొద్దు
అమ్మ యేదనీ నాన్న లేడనీ
కుమిలావురా నీ విన్నాళ్ళుగా |
అమ్మనై వా - నాన్ననైనా
నేనేలేరా - ఓ నాన్న
కన్నా కన్నా కనుగొన్నావా
చిన్నా చిన్నా చేరుకున్నావా |
అమ్మదొంగ గుర్రమెక్కుతున్నావా
మీ నాన్న మీదే స్వారి చేస్తున్నావా

చికిచికి చెల్ చెల్ - చికిచికి చెల్
చెల్ చెల్ రాజా - చెల్ చెల్ చెల్
చెల్ చెల్ నాన్నా - చెల్ చెల్ చెల్

No comments

Most Recent

Default