Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Seetharamaiah Gari Manavaralu (1991)చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగేశ్వరరావు, మీనా, రోహిణి హట్టంగడి
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: వి.దొరస్వామిరాజు
విడుదల తేది: 11.01.1991

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

హహ..పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ... జతులాడ...

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ


********  *******   ********


చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం: కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
పాపికొండల కున్న పాపాలు కరగంగ
పరుగుళ్ళు తీసింది భూదారి గంగ
సమయానికి తగు పాట పాడెనే
సమయానికి తగు పాట పాడెనే


చరణం: 1
త్యాగరాజుని లీలగ స్మరించునటు
సమయానికి తగు పాట పాడెనే

పప మగ రిరి మగరిరి ససదద సస రిరి సరిమ

సమయానికి తగు పాట పాడెనే
ధీమంతుదు ఈ సీతా రాముడు సంగీఅ సంప్రదాయకుడు
సమయానికి తగు పాట పాడెనే

దద పదప పదపమ మపమగ రిరి రిపమ పప సరిమ

సమయానికి తగు పాట పాడెనే
రారా పలుక రాయని కుమారునే ఇలా పిలువగనొచ్చని వాడు
సమయానికి తగు పాట పాడెనే

దపమ పదస దదపప మగరిరి ససస
దదప మగరిరి సస సదప మపదసస దరిరి
సనిదస పద మప మగరిరిమ

సమయానికి తగు పాట పాడెనే

చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు
చిలకంటి మనవరాలు సదాగ లయలతెల్చి
సుతుండు చనుదెంచునంచు ఆదిపాడు శుభ
సమయానికి తగు పాట పాడెనే

సద్భక్తుల నడతలే కనెనే
అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనెనే
విముఖులతో చేరబోకుమని
వెదకలిగిన తాలుకొమ్మనెనే

తమాషామది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరజనుతుడు చెంతరాకనే సా

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ
పరవళ్ళు తొక్కింది గోదారి గంగ
పాపికొండల కున్న పాపాలు కరగంగ
పరుగుళ్ళు తీసింది భూదారి గంగ********  *******   ********


చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం: కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి(కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ..ఆ.


చరణం: 1
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే
మా చంటిపాపను మన్నించి పంపు

చరణం: 2
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామా


********  *******   ********


చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం: కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకాముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా
మనువలనెత్తే తాత మనువాడ వచ్చాడు మందారపువ్వంటి మా బామ్మని అమ్మమ్మని

నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ
పండంటి ముత్తైదు సందమామ పసుపుబొట్టంత మా తాత సందమామ
నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ

చరణం: 1
కూచను చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓలాల.. తుమ్మెదలాడే ఓలాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాల..గాజులు పాడే ఓలాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా..కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఈ లాల
ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల
దివిటీల సుక్కల్లో దివినేలు మామ సందమామ సందమామ
గగనాల రథమెక్కి దిగివచ్చి దీవించు సందమామ సందమామ
నోమీనొమ్మల్లాలో నోమన్న లాలో సందమామ సందమామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందమామ సందమామ

చరణం: 2
ఆపైన ఏముంది ఆమూల గదిలోన ఆరుతరముల నాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమేపించే మీ తాత వంశం
అరవై ఏళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవయ్యేళ్ళ వాడు మీ రాముడైతే పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంతా ముత్తైదు జన్మ పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనేమా నానమ్మ పెళ్ళికూతురాయెనే


Most Recent

Default