Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rama Krishnulu (1978)
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్.టి.రామారావు, నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 08.07.1978Songs List:ఎందరో మహానుభావులు పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
హహహం
కన్నె ఎవరో  కానిదెవరో
ఎలా చెప్పేది 
కన్నె ఎవరో కాని దెవరో ఎలా చెప్పేది
ఈ కలికాలంలో ఈ మాయాజాలంలో
రంగు చూశా పొంగు చూశా
చంగురంగు నడక చూశా
కొంగుజారే కులుకుచూశా
దేన్నిచూసీ దేంతో తూచీ ॥కన్నె॥

తోటనిండా గులాబీలు
శుభానల్లా
వాటిచుట్టూ బ్రమరాలూ
తేనెలూరే పెదవులు
వాటికోసం వేటాడే పురుషులూ- ఆ..ఆ..ఆ..ఆఁ

తేటి వాలిన పూవు ఏదో
తేనే పిండిన పెదవి ఏదో
ఏలా చెప్పేదీ
వాడిపోయిన రేకులు చూశా.
వేడియారిన ముద్దులు చూశా  ॥కన్నె॥

వెనకా ముందు భేదాలు
హుఁ - వివరం తెలియని వేషాలు
ఆడా మగ తేడాలు
అంతు దొరకనీ రోజులు
షర్టు లోపలి జాతి ఏదో....
జుట్టు కప్పిన ముఖము ఏదో
ఎలా చెప్పేదీ -
పగటి వేషం ముసుగు తీశా
వెనకా ముందుకు తిరగవేశా

నిసనిగరిగసరి దని దరి సరి నిస
పదపసనిసనిదని పదమపగమరిగ
గారికీ - నీదదా - దారిహా
కంటిరెప్పల రెప రెపలు
కన్నె పిల్లకు గురుతులు

మగమనీద - మగమసాని
మగమరీస - గరిమగరిస - నీ
కన్ను గీ పేజాణకు - అవి
వెన్నతో పెట్టిన విద్యలు -


కందిపోయే సిగులో మరి - ఆహా -
రంగుపూసిన బుగలేయివి - ఎలా తెలిసేది
ఆఆఆఆ ఎలా తెలిపేది
బుగమీద కాటు వేశా
కంటిసెగకు సవాలు చేశానవనవలాడే చిన్నదానా పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు,  పి.సుశీల

నవనవలాడే చిన్నదానా 
నవమాసాలలో ఉన్నదానా
పెళ్ళీగిళ్ళీ లేకుండానే పిల్లను కనబోతున్నావా
తల్లివి కాబోతున్నావా

కవకవలాడే చిన్నవాడా
కవటాకల్లే ఉన్నవాడా 
చూపులతోనే చూలొచ్చేస్తే
పుట్టేవాడికి నాన్నవుతావా
వాడమ్మకి మొగుడవుతావా

పొంచిఉంద పరంజి నిగనిగ
పొంగు వయసు రంగులోన
పొంగు కాస్త ఆరిపోతే
రంగు మాత్రం మిగిలేనా
వెతికిచూడు దొరుకుతుంది
విలువైనది దాచుకుందీ
నిలువ తెలిసి వెతుకుతున్నా
వేళవస్తే దోచుకోనా
తనతన తానా తన తనతానా తన తన తానా
తనాననా - నమ

ఆడది కోరేది  ఆశగ దాచేదీ
నగలూ నాణ్యాలొకటేనా 
పురుషుడు చూసేది  దొరవలె దోచేది
వయసూ సొగసూ వగలేనా
సొగసును మించేది  వయసుతో పెరిగేది
మనసే నాకు లేదనా 
అది ఎప్పడు తెరిచేది ఎవ్వరికిచ్చేది
ఇప్పుడు తెలుసా నీకైనా 

ఎంత మిడసరి వాడ వాడవైనా
అంతునీకు చిక్కుతానా
ఎంత గడసరి దానివైనా
అంతు చూడక వుంటానా
అంత మగసరి నీకుంటే
నీకు సొంతం నేను కానా
అంతటితో సరి హరీ హరీ 
అంత దూరం రానిస్తానా
తనతనతానా తనతనతానా తనతనతనా తనాననాదుప్పట్లో దూరాక దూరమేముంది పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: రామకృష్ణ,  పి.సుశీల

పల్లవి:
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

మనసేమో మల్లెపూల మంచమౌతుంది
అహ...మనసేమో మల్లెపూల మంచమౌతుంది
వయసును వయసే వాటేసుకుంటుంది

దుప్పట్లో...హొయ్ హొయ్ హొయ్ హొయ్
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

చరణం: 1
కనబడితేనే చాలని ఉంటుంది.. కనపడగానే దడ దడమంటుంది 
ముచ్చట కాస్త మూగపోతుంది.. ముచ్చమటలుగా ముద్దైపోతుంది

ఓరచూపు చూసుకున్న చేరనంటుంది..
హా చేరువైన చేరలేని దూరముంటుంది...

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్..
దుప్పట్లో దూరాక దూరమేముంది..
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది..

చరణం: 2
చూస్తుంటేనే చాలనిపిస్తుంది.. చూసిన కొద్ది సొంతమైతే మేలనిపిస్తుంది...
చేయి తగిలితే ఝల్లుమంటుంది.. ఆ సంబరంలో ఒళ్ళు తాకితే..
జల జలమంటుంది ...

అమ్మబాబోయ్... ఎవరేనా చూస్తే...
అమ్మబాబోయ్ ఎవ్వరేనా చూస్తారంటుంది
అంత కన్న పచ్చ జండా ప్రేమకేముంది

దుప్పట్లో..హా...దుప్పట్లో..హు..
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

చరణం: 3
కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది.. కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది
కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది.. కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది

మూడుముళ్లకు ముచ్చట పడుతుంది.. ముద్దుల మూటలు ముడుపే కడుతుంది
ముడుపులిచ్చే మొదటి రాత్రి రానే వస్తుంది.. పొండి మీరు పోకిరంటు మొండికేస్తుంది

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్..
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముందిఝుయ్ ఝుయ్ ఝుయ్ మంటుంటే పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ

ఝుయ్ ఝుయ్ ఝుయ్ మంటుంటే
గూబ గుయ్ గుయ్ గుయ్ మంటాది 
గూబ గుయ్యిమంటుంటే 
కళ్ళు గిర్రుమంటాయీ
దిమ్మ తిరిగిపోవాలీ.…దెబ్బకుదయ్యం వదలాలీ ॥ఝుయ్॥

ఎత్తులు వేసే చాణక్యుణ్ణి —
అంతకు మించిన జిక్తులమారి శ్రీకృష్ణుణీ
మనసిచ్చానా దేవదాసునీ
ఎదురొచ్చారా ఎదురేలేని రామరాజునీ
దిమ్మతిరిగిపోవాలీ -
దెబ్బకు దెయ్యం వదలాలీ ....  ॥ఝుయ్॥

పటామంటే ఉడుంపటు మాదీ
పగపట్టామంటే నాగుపాము పగమాదీ 
పడగెత్తామా కాటు సూటిగా పడుతుందీ 
పాపం చేసిన వాడికి కాలం తిరుపోతుందీ
చేతులు కలిపామిద్దరమూ 
చేసేదేదో చేతలలోనే చూపిస్తామూ
చేతులు కలిపామిద్దరమూ 
చేసేదేదో చేతలతోనే చూపిస్తామూ
విడిపోదెన్నడూ మా అనుబంధమూ 
విచిపోదెన్నడూ మా అనుబంధమూ 
కడదాకా మా లక్ష్యం ఏదో సాధిస్తామూ  ॥ఝుయ్॥అబ్బబ్బబ్బచ్బో ఆడవాళ్లు పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ, పి.సుశీల, వాణీజయరాం 

అబ్బబ్బబ్బచ్బో ఆడవాళ్లు ఒళ్లు బలిసి ఉన్నవాళ్లు
బరితెగించి పట్టపగలే బజారుకెక్కారూ..

అయ్యయ్యయ్యయ్యో మగవాళ్లు 
ఒడ్డు పొడుగూ  సోగ్గాళ్లు
పడుచుపిల్లలు పై బడుతున్నా పస్తాయిస్తారూ

కన్నుగీటీ నవ్వుతోటీ కవ్విస్తున్నారూ
కన్నెవయసూ కాచుకుందీ రమ్మంటున్నారు.
ఆహాఁ.....
కన్నుగీటీ నవ్వుతోటీ కవ్విస్తున్నారూ...
ఓహో-
కన్నెవయసూ కాచుకుందీ రమ్మంటున్నారూ
సైగచేసి రమ్మన్నా -
ఆహాఁ....
సైగ్గ వచ్చీ పొమ్మన్నా
చేవలేక జావగారి జారిజారి పారిపారిపోతున్నారూ
పదును కొచ్చిన పదారేళ్ళకూ పగ్గం వేస్తారు
అదును ఉందీ అంతదాకా ఆగమంటారూ

పదును కొచ్చిన పదారేళ్ళకూ పగ్గంవేస్తారూ..
అదును ఉందీ అంతదాక ఆగమంటారూ...
వేగమొస్తే ఆగదంటూ వేడిపుడితే ఆరదంటూ
కట్లు తెంచీ-గట్లుతెంచీ...
ఉప్పెనల్లే వెల్లునల్లే ఉరుకుతున్నారు ॥ అబ్బబ్బ॥

పైటకొంగూ నిలవనంటే...
ఏం చెయ్యమంటారూ ?
పోటుకొచ్చిన ఏటినెట్లా
దాటమంటారూ...హోయ్ హోయ్
పైటకొంగూ ముడి వేస్తాం నీటిపోటూ ఆపేస్తాం.
పట్టుమంటూ పట్టుబట్టి
క్యారు క్యారు బ్యారు బ్యారుమన్పిస్తాం ॥అబ్బబ్బబ్బో॥ఆడనా - పాడనా పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల, వాణీజయరాం 

ఆడనా...
పాడనా...
ఆడనా - పాడనా
ఆడనా - పాడనా 
ఆడుతూ స్వర్గాన్ని అందించనా
పాడుతూ నరకాన్ని మరిపించనా 

నా కాళ్ళల్లో గజ్జెలు మోగుతున్న వరకూ
కంఠంలో ప్రాణం ఆడుతున్న వరకూ 
కళ్ళల్లో నీ రూపు కదులున్న వరకూ
నాహృదయంలో సీప్రేమ మెదులుతున్నవరకూ..

నిప్పును ఆర్ఫేటందుకూ నీరు ఉన్నదీ
నీ కోసం కళ్ళల్లో కన్నీరు ఉన్నదీ 
కన్నీళ్ళకు రాయయినా కరుగుతుంది 
కరగకుంటే కన్నీరే నిప్పపుకుందీ 
ఆడుతూ స్వర్గాన్ని అందిచనా ఆఆఆఆ
పాడుతూ నరకాన్ని మరిపించనా 

ప్రళయ కాల కాళిలా 
పడగెత్తిన తాచులా
పైకి దూకు డేగలా
పసిపట్టిన రేచులా
ఝుళిపిస్తూ జడిపిస్తూ
సాగుతూ ఊగుతూ 
కత్తిలా మెరుస్తూ
నెత్తురై పారుతూ
ఆడనా
పాడనా
బలె బలె రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: రామకృష్ణులు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ, పి.సుశీల, వాణీజయరాం 

బలె బలె బలె బలె బలె రామయ్యా 
దితె బలె బలె బలె బకె కృష్ణయ్యా
హరేరాను హరేకృష్ణ రామకృష్ణ హరే హరే
హరేకృష్ణ హరేరామ కృష్ణారామ హరేహరే

రామయ్యా - ఓ రామయ్యా 
మరో రావణుడు పుట్టాడయ్యా
కృష్ణయ్యా - ఓ కృష్ణయ్యా 
ఒక కంసుడింక మిగిలాడయ్యా
ఉన్నదొకే మార్గం మనకున్న దొకే బాణం
ఆహ ఆహు ఆహుం..
ఆహుం ఆహుం ఆహుం
హోయ్-ఉన్నదొకే మార్గం
మనకున్నదొకే బాణం
గురిచూసీ గిరిగీసీ గుండెకేసి కొట్టాలయ్యా

రరర రరర రరర రరర రం
లలల లలల లలల లలల లం
రావణుడు చచ్చిందీ...
సీతవల్లనే లంక బూడిదయ్యిందీ..
ఆ ఆ ఆ ఆ ఆ కోతివల్లనే
రావణుడు చచ్చింది సీతవల్లనే
లంక బూడిదయ్యిందీ కోతివల్లనే
సీత కాచుకుందిరా రాముని రాకకూ
కోతి ఎగిరిపోకముందే నిప్పు పెట్టుతోకకూ
సరే సరే ఓ రామరామ...
భలే భలే ఓ కృష్ణ కృష్ణ
ఆహుం ఆహుం ఆహుం....
ఆహుం ఆహుం ఆహుం....

బాలుడా...గోపాలుడా..
వసుదేవుడున్న జైలు ఎక్కడా
హొయ్ వీరుడా...రఘువీరుడా
నీనాన్న సత్య హరిశ్చంద్రుడా
ఋజువూ చెయ్యాలిరా...
ఋణమూ తీర్చాలిరా..
రామకధ కృష్ణలీల ఒకటేనని చెప్పాలిరా

No comments

Most Recent

Default