Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Majili (2019)





చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
నటీనటులు: నాగచైతన్య, సమంత
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 04.04.2019



Songs List:



వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: భాస్కర్ భట్ల
గానం: రేవంత్

వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ
హైట్ వెట్ చెకింగూ
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగూ
డౌరీ గివింగూ (2)

మ్యారేజ్ బెల్ల్సు రింగింగూ
సింగల్ బెడ్ షేరింగూ
ఇన్‌సైడ్ ఫర్స్ట్ లవ్ కిల్లింగూ
యూ ఆర్ డైయింగూ

వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ

వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ

వన్ బోయ్ వన్ గర్ల్ లుకింగూ
హైట్ వెట్ చెకింగూ
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగూ
డౌరీ గివింగూ

నాన్నకే మాటిచ్చావని
ఆఆహ్.. నాన్నకే మాటిచ్చావని
అమ్మ అలిగిందని
మనసుకే ఉరి తాడెసి
ముడి వేస్తావా తాళిని

జంటకాని పిల్లతో
ఏడు అడుగులు వెయ్యడం
ఆరు అడుగుల గొయ్యిని
నీకు నువ్వే తవ్వడం

నీకు తోడు మర్రిచెట్టు
స్కూల్ గ్రౌండు, గాంధీ బొమ్మ
గుండెలోన చెరిగిపోనీ
నీ ప్రేమ బొమ్మా

వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
యూ ఆర్ ఫీలింగు క్రయింగు డైయింగూ

కళ్ళ ముందుండే రూపం
ఆఆహ్.. కళ్ళ ముందుండే రూపం
మనసునే తాకదే
మనసులో నిండిన ప్రాణం
ఎదురుగా వచ్చి వాలదె

రైలు జర్నీ కాదురా
లైఫ్ జర్నీ పెళ్లి రా
ఎవ్వరైతే ఏంటనీ
సర్దుకోలేం సోదరా

కళ్ళలోకి చూడలేక
మాట కూడా కలపలేక
జీవితాంతం జంట మధ్య
భూ మధ్య రేఖా...

వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
ఐ యాం  ఫీలింగు క్రయింగు డైయింగూ

వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద లవింగూ
వేర్ ఈస్ ద వేర్ ఈస్ ద ఫీలింగు
ఐ యాం  ఫీలింగు క్రయింగు డైయింగూ



ప్రియతమా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: చిన్మయి శ్రీపద

పల్లవి:
ప్రియతమా ప్రియతమా 
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో 
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా 
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా 
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో 
తెలిసినది వలపులో మధురిమా

చరణం: 1
నీ ప్రేమలో ఆ రాధనై నే నిండుగా మునిగాక
నీకోసమే రాశానుగా నా కళ్లతో  ప్రియలేఖ
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడక వెనక పడెను మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా 
ఒక్కసారి చూడరా పిల్లడా

చరణం: 2
ఉన్నదిరా ఉంటానురా నీ నీడలో కడదాకా
కన్నీటితో కార్తీక పూ దీపాన్నిరా నువులేక
దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచెనసలు మధుర క్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా 
పలికినది హృదయమే సరిగమ
చిలిపిని తలపులో 
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా 
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా
నిన్నుకోరుకుందిరా సుందరా




నా గుండెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: యాజిన్ నజీర్, నికితా గాంధీ

నా గుండెల్లో ఉండుండి మెల్లంగా 
ఝల్లుమందే ఏమయ్యిందో 

నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా 
ఇష్టంగుందే ఏమౌతుందో

మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే 
అడగాలీ మన కథే

ఓ ఓ... 
నా గుండెల్లో ఉండుండి మెల్లంగా 
ఝల్లుమందే ఏమయ్యిందో 

ఏల అందిందే ఆకాశం అందేసిందే
ఏల ఆనందం పొంగిందే
ఏల అల్లిందే ఉల్లాసం అల్లేసిందే
ఏల ఒళ్ళంతా తుళ్ళిందే

ఇంచుమించుగా ఊపిరాగేట్టుందిలే
నువ్వే చూసి చూడనట్టు వెళ్లకే
కొంచెం కొంచెంగా మౌనం కరిగేట్టుందిలే
నువ్వే మంత్రం వేసి మనసే లాగితే
మన మాటే - పాటగా మారనీ
మన పాటే - ప్రేమగా సాగనీ
ఆ ప్రేమే స్వప్నమై సత్యమై స్వర్గమైపోనీ
మన కలయికలో

నా గుండెల్లో ఉండుండి 
మెల్లంగా ఝల్లుమందే
ఏమయ్యిందో 

మంచు పువ్వంటి చిన్ని నవ్వు నవ్వేస్తే
పంచ ప్రాణాలన్ని మళ్లీ పుట్టేలే
పంచదారంటి తీపి ఊసులాడేస్తే
లక్ష నిమిషాలైనా ఇట్టే గడిచేలే
సంద్రమైనా చిటికెలో దాటనా
సందెపొద్దు జిలుగులో చేరనా
మధురం మధురం మధురం
మన ఈ ప్రేమమ్ - సుమధుర కావ్యం

నా గుండెల్లో ఉండుండి మెల్లంగా 
ఝల్లుమందే ఏమయ్యిందో 

నా ఊహల్లో నువ్వొచ్చి వాలంగా 
ఇష్టంగుందే ఏమవుతుందో

మదిలో మెదిలే మాటలనే
పెదవే దాచనందే
యెదలో ఎగసే అలజడినే 
అడగాలీ మన కథే




ఏడెత్తు మల్లెలే పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: శివ నిర్వాణ
గానం: కాల భైరవ, నిఖిత గాంధీ

ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే దారే లేదే

నీ తోడు కోయిలే
పొద్దుగూకే వేళ కూయలేదే 

రాయెత్తు అల తెరదాటి 
చేరరావే చెలియా
ఈపొద్దు పీడకల దాటి
నిద్దరోవే సఖియా 

నీ కంటిరెప్ప  కలనే
కన్నీటిలోన కథనే 
నీ గుండెలోన సడినే 
నీ ఊపిరైనా ఊసుని

నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోననీ



ఏ మనిషికే మజిలీయో పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: వనమాలి
గానం: బేబీ అనూష , అరుణ్ గోపన్, చిన్మయి శ్రీపద

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు

నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..

నువ్వు..ప్రతీసారి 
నీ ప్రపంచంలొ
నను చూస్తూన్నా..
నేను..అదే పనిగ
నిను వెలేస్తూనె వున్నా

నువ్వు..నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను..ఒక మనసులేని
శిలలాగ మారినానా..

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని
ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?

ఇన్నాళ్ళు నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి
బ్రతికేదెలాగ..?

ఈ వేషమే ఎన్నాళ్ళని
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని

నువ్వు నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను గతంలోని
ఆ కలల్లోనె వున్నా

నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం

నా గుండెనడుగు
చెబుతుంది నీకె
ఈ ఊపిరుందీ
నీ చెలిమి కొరకే

నీ కోసమె వేచిందిలే
నువు సేద తీరె
ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగ
నిను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నువ్వు గతంలోని
ఆ కలల్లోనె వున్నా

నేను ప్రతీసారి
నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువ్వు అదేపనిగ
నను వెలేస్తూనె వున్నా

నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగ మారినావా

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు



మయ్యా మయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

మయ్యా  మయ్యా

No comments

Most Recent

Default