Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gudachari 116 (1966)

చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, జయలలిత, గీతాంజలి
దర్శకత్వం: ఎమ్.మల్లికార్జునరావు
నిర్మాత: సుందర్ లాల్ నహత
విడుదల తేది: 11.08.1966

Songs List:

ఓహో వాలు చూపుల వన్నెలాడి పాట సాహిత్యం

చిత్రం:  గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
ఓహో వాలు చూపుల వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే
హహహహ ఉహూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 1
అందమైన దానివీ...  ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ...  వలచి వస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 2
చిలిపి చూపుల కన్నులూ
మొలక నవ్వుల పెదవులూ
పలకరించే వన్నెలూ.. పులకరిస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 3
నిన్న సంగతి మరచిపో
నేటి సుఖమే తలచుకో
రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

మనసు తీరా నవ్వులే పాట సాహిత్యం

చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా ...
లాల లాల లా ... లాల లాల లా

చరణం: 1
చేయి కలుపు సిగ్గు పడకు
చేయి కలుపు సిగ్గు పడకు
అందుకోవోయి నా పిలుపు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

అవును నేడే ఆటవిడుపు
అవును నేడే ఆట విడుపు
ఆట పాటల కలగలుపు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా ...
లాల లాల లా ... లాల లాల లాటెల్

చరణం: 2
పువ్వులాగ పులకరించు
పువ్వు లాగా పులకరించు
దాచకోయి కోరికలు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

ఆశలుంటే అనుభవించు
ఆశలుంటే అనుభవించు
అనుభవాలే సంపదలు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా.. యా యా ..యా యా

నీతో ఏదో పనుంది పాట సాహిత్యం

చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

నీతో ఏదో పనుంది

నువ్వునా ముందుంటే.. పాట సాహిత్యం

చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 1
ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ
ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ
జింకపిల్లలా ..చెంగుచెంగుమని.. చిలిపి సైగలే చేసేవూ...

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 2
చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ
చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ
బుగ్గపైన ..కొనగోటమీటి.. సిగ్గుదొంతరలు దోచేవూ ...

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 3
లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ
లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ
మాటలల్లి ..మరుమందుచల్లి.. నను మత్తులోన పడవేసేవూ

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

పడిలేచే కెరటం చూడు... పాట సాహిత్యం

చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

పల్లవి:
పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు

చరణం: 1
వెన్నెల విరిసే వేళా... వన్నెలు మెరిసే వేళా
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
మిసమిసలా చిన్నలు చూడు... ఉసిగొలిపే హృదయం చూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...

చరణం: 2
పరులెవరూలేని చోటా... పరువాలు పూచే చోటా
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
మరుగులేని మమతలు చూడూ... మనసుంటే నన్నే కూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...

ఎర్రా బుగ్గల మీద మనసైతే...పాట సాహిత్యం

చిత్రం:  గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 1
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా

మొక్కజొన్న తోటలోన మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 2
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ... రేవు కాడ...
కాకినాడ... రేవు కాడ...

కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 3
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట... చెరువు కాడ...
గండిపేట... చెరువు కాడ...
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా

గండిపేట చెరువు కాడ గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి గాండ్రుమంటయే

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

No comments

Most Recent

Default