Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Agni Pareeksha (1970)
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, బేబీ శ్రీదేవి
దర్శకత్వం: కె. వరప్రసాద రావు
నిర్మాత: జి. ఆదిశేషగిరరావు
విడుదల తేది: 10.07.1970సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)Songs List:కలవారి వినోదాలు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల

సాకీ:
ఆడదాన్ని ఆటబొమ్మ అనుకుంటారు
అడిగినంత ధనం పోసి కొనగలమనుకుంటారు
మగువ కూడా మనిషన్నది మరిచే పోతారు

పలవి: 
కలవారి వినోదాలు
మగవారి విలాసాల
కలకాలం బానిసగా
ఈ ఆడది బ్రతకాలా

||కలవారి||

చరణం: 1
సొగసులున్న మనిషి మీకు కావాలి
ఆ మనిషిలోని మన సెవరికి కావాలి
ప్రతివాడికి తన సుఖమే కావాలి
ఎదుటివారి బాధ ఎవరికి కావాలి

వెలకట్టి మీరు ఆడదాన్ని వెలయాలు చేసినారు
మా జీవితాల మల్లెలన్ని మీ కాలరాచినారు
ఈ దీనురాలి కన్నీరే మీ పన్నీరాయె 

||కలవారి॥

చరణం: 2
అన్నారని సీతమ్మకు అగ్నిపరిక్షా
ఆ నాటికి ఈ నాటికి ఆడదానికేనా శిక్షా
మారలేదా... మారబోదా...
ఏనాటికి.... ఈ తీరు....
ఆడదాని అందం దోచి
అణచి వేసే వారే అంతా
వాడిపోయిన గులాబిలాగే
పారవేయుట మీకొక వింత
లోకమంతా ఇంతేలే..
నాలోన నిన్ను చూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల

నాలోన నిన్ను చూసుకో
నీలోన నన్ను నిలుపుకో
నిండారు ప్రేమ సీమలో
నీవూ - నేనూ - ఒక టేలే

॥ నాలోను ||

ఎన్నో ఎన్నో యుగాలుగా నిన్నె కదా తలంచాను
నిన్నే సదా వరించాను
నమ్మినా మానినా నా మదీ నీదిలే
జగాలు ఎన్ని మారినా
జతగా మనమే నిలుతములే

॥ నాలోను||

కోరికలే పూచిన పూలు
అవే మన తలంబ్రాలు - అవే అవే వసంతాలు
అవే అవే వరాలోయ్
ఏడనీ కలయిక వాడని మాలకి

సరాగ స్వప్న జగతిలో
కలిసి మెలసీ కరిగెదమా

|| నాలోన||
ఇదా మీ సభ్యత పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

పల్లవి:
ఇదా మీ సభ్యత
ఇదా మీ నాగరికత
ఇదేనా సంస్కృతి
ఈ తరగని పరుగుల జోరేనా ప్రగతి !

చరణం: 1
పతితులకే సమాదరణా
సవిత్రులకే నిరాదరణా
పతివ్రత లెవరో కానరా
అపనిందలు వేయుట మానరా
అనురాగమె - అభిమానమె
కరువైన జగాన విషాదపు గాథలు కాక
సుఖము కలదా !

చరణం: 2
నాయకులే వినాయకులా
వినాయకులే విధాయకులా
అసత్యమె రాజ్యం చేసెనా
అధర్మమే చిందులు వేసెనా
రహదారిలో పెడదారులా
పెనుచీకటి చాటున సాగే మోసపు తీరు

చరణం: 3 
కృత్రిమమే ప్రశస్తమని
కుతంత్రములే స్వతంత్రమనీ
విచ్చల విడియే నీతిగా
పిచ్చెక్కిన కోతుల రీతిగా
పొరపాటులే అలవాటుగా
తిరుగాడు షరాబుల పోజులు మారే
రోజు రాకపోయే

కొండపై నిండుగా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

పల్లవి:
కొండపై నిండుగా కొలువున్న మా తల్లి
కనక దుర్గా నీకు జేజేలు లోక
జనని శాంభవి నీకు దండాలు

|| కొండపై ||

చరణం: 1
భూలోకమందు మా పూజలందుకొనంగ
దుర్గవే- యిటకు దిగివచ్చావు
కనక దురవై యిక్కడే నిలచావు
కాళివైనా మహంకాళి వైనా నీవె
బహురూపముల మమ్ము  బ్రోచు అంబవు నీవే

చరణం: 2
శాంతమ్ము తో నీవు ప్రత్యక్షమైతేను
చిరునవ్వు వెన్నెలలు కురిసేను
కరుణా రసము వెల్లి విరిసేను
ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూచావంటే
గప్పు గప్పున నిప్పులురికేను
గుప్పు గుప్పున మంటలేగ సేను
దుర్గా కనకదుర్గా కనకదుర్గా
ఎలాగనీ ఎలాగనీ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్నిపరీక్ష (1970)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: సుశీల

పల్లవి: 
ఎలాగనీ ఎలాగనీ
నిండిన మనసందాకా
నిలచుండలేక పాడాలనీ
ఎలాగనీ ఎలాగనీ

||ఎలాగనీ||

చరణం: 1
వాకిటి తలుపిక వేయను
ఈ కన్నులు మూయనె మూయను
తొందర తొందరలైతే
ఆనందమె సాగర మైతే
కనువిందుగా నా ముందర
కనుపించేదాకా ఎలాగనీ

చరణం: 2
దాచిన అశ్రుల జల్లులలో
తడిసిన చూపుల మల్లెలతో
దాగని నవ్వుల దివ్వెలతో
స్వాగతమిచ్చే తొందరలో
చిరుగాలిలో విరుతీగలా
ఓడలూగిపోతే ఎలాగని

చరణం: 3
ఆ అడుగుల సడి నా కొరకే
ఆ నడకల వడి నా కొరకే
దవు దవ్వులనే వినిపించగా
రివ్వు రివ్వుననే నెదు రేగగ
తన కౌగిట నను చేరిచి
దయ చూపేదాకా ఎలాగనీ

||ఎలాగు||

No comments

Most Recent

Default