Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Waiting for you (2013)
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట , కసర్ల శ్యామ్
నటీనటులు: గాయత్రీ, అనిల్
దర్శకత్వం: సునీల్ కుమార్ రెడ్డి 
నిర్మాత: ఎక్కాలి రవీంద్ర బాబు
విడుదల తేది: 30.08.2013Songs List:వెయిటింగ్ ఫర్ యు పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: కసర్ల శ్యామ్
గానం: మానస ఆచార్య 

కన్నే మూయక రెప్పే వాల్చక
అలా నువ్వు నా కొరకు చూస్తావనీ
నీకై నేను వేచున్నా వస్తావనీ
నిన్నే చేరమంటోంది నా ప్రాణమే
ఎటూ తేల్చుకోలేదు నా హృదయమే

waiting for you
waiting for you
waiting for you
my love

waiting for you
waiting for you
waiting for you
my love

నీడలా నా జ్ఞాపకాలు నను వీడక నా తోడులాగ
నువ్ చేరిన ఆ రోజులా వెంటాడుతూ ఉంటే
గాలిలా నీ ఉహలేమో నను తాకుతూ నా శ్వాసలాగ
అవి మారుతు నీ పిలుపులా నను పలకరిస్తుంటే
చేరువయ్యే సమయం కోసం ఎదురు చూస్తే కదలదు కాలం

waiting for you
waiting for you
waiting for you
my love

జాడలా నీ అడుగులోన అడుగెయ్యగా నా దారిలోన
నువు చేరవా ఓ ఋతువులా
మౌనాలు వీడుతుంటే
నీడగ యదలోన తలచి వరమియ్యవా
నిలువెల్లా కరిగి నువ్వు నా జతై ఓ దేవతై
మనసార కోరుకుంటే
చీకటైన తూరుపులోన వెలుగు నింపే వేకువ కావా

waiting for you
waiting for you
waiting for you
my love

ఏకాంతం మన సొంతం పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సింధూరి

ఏకాంతం మన సొంతం జతగా రావేలా
నాలోనా సంగీతం పలికే ఈ వేళ
ఏవొ ఏవేవో సెగలే రగిలే
నీతో ఈ నిముషం చనువే పెరిగే
ఏకాంతం మన సొంతం జతగా రావేలా

తొలితొలిగా మరి అడుగే తడబడి
అలజడులే కని తెలిపే పరిసని
లోలోని భావాలు కరిగే మది మురిసిపొతున్న వైనం
ఏకంత తీరాలు ఒకటై ఇల కలిసిపోతున్న తరుణం
నిజమా కలవరమా ఇలా గడిచే సమయం

ఏకాంతం మన సొంతం జతగా రావేలా

కనివిని ఎరుగని వరసే ఇది మరి
కలమరి వింతని నేనే ఋజువని
చిలిపి భావాలు రేగే పెనవేసుకోమంది బిడియం
ఈ హాయి తమకంలో తడిసి మైమరిచిపోతుంది పరువం
జతలో నీ జతలో జీవితమే స్వర్గం

ఏకాంతం మన సొంతం జతగా రావేలా
తలపే కోరినా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సురభి శ్రావణి

తలపే కోరినా కలతే తీరునా గుబులే గుండెలో మానునా
పాదం మోపినా పయనం ఆగునా
కదిలే ఈ క్షణం మారునా
కాలమా భావ్యమా జాలినే చూపుమా
కనులలో తారాడినా కలలతో పొరాడినా కలతగా నే మారినా కలనిలా

తలపే కోరినా కలతే తీరునా గుబులే గుండెలో మానునా

ఏమిటో ఈ సమయం అంతులేనీ సమరం శరములై శోధింప సరియేనా
ఎందుకో తెలియదులే గుండెలో అలజడులే తీరని భారాలే జడిలోనా
ఓపలేనీ వేదనే చేరువై
ఊరడించే చేతులే దూరమై
మూగబోతే ప్రాణమే న్యాయమా
ఒకటే జ్ఞాపకం మెదిలే ఈ క్షణం మదిలో దాగనీ సాగనీ
ఈ పొరాటమే నాలో శ్వాసగా అడుగే వేయనీ నేనిలా
గుండెలో భారమా ఇంతలో మౌనమా
చెరగని గాయలతో చెదరని దూరలతో సాగే నా పయనమే నేడిలా
ఎటులే చూసిన నిన్నే చూడనా కాలం చూపదా దారిక

ప్రాణం పురి విప్పిన వేళా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట 
గానం: గాయత్రీ నారాయణ్

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల
కలే పండే ఒడే నిండే మనసున కురిసే జడి వానే

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల

ఏ రేయి పొత్తిలిలో ఏ కాంతి దాగుందో నునువెచ్చని వేకువలా సూరీడే పొడిచాడు
ఇరు మనసుల ఆ స్వేదం చిరునవ్వై కురిసింది
తొలి ప్రేమకు సాక్ష్యంగా ఓ శ్వాస మురిసింది

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల

ఈ స్పర్స తాకిడిలొ ఏ ఊపిరి రుణముందో
నిశి విడిచిన స్వప్నం లా ఉదయించిన సింధూరం
తనలోని ఆ గోప్యం తనువవుతూ సారూప్యం
మరుజన్మే అనిపించే ఓ తీయని పోరాటం

ప్రాణం పురి విప్పిన వేళా పులకింతల సీమ పరిచింది ఈ నేల
లోకం కనుసన్నలలోన శోకించే కూన నవ్వించే ఓ నేల
హర్ పల్ నాతో పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: డి. సాధన
గానం: డి. సాధన

హర్ పల్ నాతో ఉంటూనే ఏంటో మాయే చేసెనే
నీ నవ్వే నాలో ఉంటునే ఏంటో వింతలు కలిగేనే
మేఘాలలో ఈ తారలే మాట్లాడెనే నాతో
వికసించే ఈ పువ్వులే అంటుంటే నాతో
మనసాగక వేగక నీకై చూస్తు ఉన్నా

waiting for you
waiting for you
waiting for you
ఓ...

oh my love i hv been crazy in you
in the nights i feel so lone
in the streets i search for you there
without u never again i give my love to u

waiting for you
waiting for you
waiting for you
i m waiting for u

తన్నావా మనసుని వెచ్చగా గిలిగింతలు పెట్టేటంతగా
అడిగాను నీ తొలి స్పర్శని ఉంటావా నాతో ఎపుడనీ
అంటుందే ఈ గాలి ఇలా
వెనువెంటే నడిచావని
వెంటాడే నీ నీడ అలా కనుమూసిన మనసుకు తోడై
మనసాగక వేగక నీకై చూస్తు ఉన్నా

waiting for you
waiting for you
waiting for you
i m waiting for u
సుందరి నీవంటి పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: హైమత్, దీప్తి పండా

సుందరి నీవంటి 
మనసిలా నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: సురభి శ్రావణి

మనసిలా నెమ్మదిగా 
నాలో నీ ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు (2013)
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
సాహిత్యం: శ్రేస్ట
గానం: గాయత్రీ నారాయణ్


నాలో నీ ప్రాణం 

No comments

Most Recent

Default