Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Akhandudu (1970)
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, అప్పలాచార్య, సినారె, మహారధి
గానం: పి బి. శ్రీనివాస్, సుశీల, మాధవపెద్ది, జానకి, జయదేవ్, స్వర్ణలత
నటీనటులు: కృష్ణ , భారతి
కథ: సి. యస్. రావు
మాటలు: మహారధి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
నిర్మాతలు: నెల్లూరు కాంతారావు, H.S.హుసేన్
విడుదల తేది: 24.07.1970Songs List:ఓం హర పురహర శంకర పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: టి. ఆర్. జయదేవ్, యస్. జానకి 

ఓమ్: హరా పురహరాః హరా! శంకరా!
హరా! అమర గంగాధరా!
గిరిజా మానస కమల మధుకరా 
బాలచంద్ర కోటీరా: ఓమ్: ఓమ్: ఓమ్! 

పు. సాకీ: 
ఒక్కనాగిని పినాకిని మహేశుని గూర్చీ 
చెక్కు చెదరక తపము చేసే
పెక్కు యుగములు తపముచే సె తపముచేసే ....

పల్లవి: 
చంద్రశేఖరా రారా
పిలచి పిలచి అలసినారా చంద్రశేఖరా రారా

చరణం: 1
నాగినిరా అనురాగినిరా-నీ గుణ మెరిగిన భోగినిరా
కరుణాసదనా కదలి రారా
కన్నులారా కాంచువరకు కదలను
నిన్నుగాక వేరువరము కోరును రారా ॥చంద్రశేఖరా||

చరణం: 2
నేతవులే నరదాతపులే నీవే జీవ విధాతవులే 
భువన మోహన మూరి విలే
కొండపైని మింటిపైని కొలువై 
సురలకేని మునులకే దొరకవు రా రా

చరణం: 3
నీకాలికి కడియం కావాలనీ
ఆ కేలికి కంకణ మవ్వాలనీ
ఆకంఠంచుట్టూ మాలికనై ఒకడోలికనై ఊగాలనీ 
కోరికరాః వేడెదరా! నీదయరా!  ॥చంద్ర శేఖరా||
నా పేరే మల్లెమొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

నా పేరు మల్లెమొగ్గ - నాకున్నది రోజా బుగ్గ 
నా రంగూ పొంగూ చూసే ఓరయ్యో యింత సిగ్గా 
ఓరయ్యో యింత సిగ్గా

చరణం: 1
నాకన్ను గిలుపు లోకాలకు మేలుకొలుపు
నా మేని విరుపు రసికులకే వెన్ను చరుపు

అబ్బా!
ఒక చిరునవ్వు చిలికిన చాలు
వికసించేను నవ నందనాలు
పైట చిరుగాలి సోకినచాలు 
కోటిపరువాలు సడ గెతి ఆడేను ॥నా పేరు॥

చరణం: 2
నా విందు పిలుపు అందుకుంటే మరులు గొలుపు 
నా తేనె వలపు అందకుంటే ద్రాక్ష పులుపు
ఏం పులుపు?
ద్రాక్ష పులుపు
ఒక జడవ్రేటు తగిలిన చాలూ 
త్రుళ్ళి పడతాయి సురలోకాలూ
గజ్జె ఘల్లంటు మ్రోగిన చాలూ 
నీల గగనాలు పురి విప్పి ఆడేనూ 
 వారేవా !  ॥నా పేరు॥
కిటికీ లో నిలబడి చూశావు పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల 
గానం: మాదవ పెద్ది సత్యం, టి. ఆర్. జయదేవ్, స్వర్ణలత 

ఆ ఆ.....
కిటికీలో నిలాబాడీ చూసేవు న్యాయమా 
ననుజేరా రావేలనే - అందాల బొమ్మా
వినవే భామామణీ
నా ముద్దు గుమ్మా - ననుజేరా రావేలనే 
తీగలాగ సాగే ప్రేమ పూలుపూసి కాసేలోగా 
తీగలాగ సాగే ప్రేమ - పూలు పూసి కాసేలోగా 
ముసలిడొక్కు పందికొక్కు వచ్చినాడే ఏమి సేతునే 
డొక్కు వచ్చినాడే ఏమి సేతునే.....
దూరానా నిలబడి పిలిచేవూ న్యాయమా
చెరలోన వున్నానురా - అందాల రాజా 
ఓహో మోహనాంగా
నా బాలరాజా చెరలోనా వున్నానురా
సరసమాడె సమయమాయెను
విరహ వేదన సైపజాలను

అయ్యో ఏమి సేతునే భామా!
ఓ..... ...... ....

సరసమాడే సమయ మాయెను
విరహ వేదన సైపజాలను 
వీధి తలుపూ గడియతీసీ
ఏలుకోరా పూలరంగా నా పూలరంగా 
ఫ్రియుడా నా బాబే ఇపుడే వస్తే
నువు ఏంజేస్తావుర ప్రియుడా - నాబాబే యిపుడేవస్తే

ఏంజేస్తానా!
మొట్ట మొదట వాడి మొహాన వూస్తా
జుట్టు పట్టుకుని కిందికి తోస్తా

కిటతకు తెయ్యకు థాథిమితా

కోరస్:
మొట్ట మొదట వాడి మొహాన పూస్తా 
జుట్టు పట్టుకుని కిందికి తోస్తా 

మొట్ట మొదట వాడి మొహాన పూస్తా
జుట్టు పట్టుకుని క్రిందికి తోస్తా
మొట మొదట వాడి
మొహాన వూస్తా - జుట్టు పట్టుకొని 
కిందికి తోస్తా
మొట్ట మొదట వాడి మొహన వూస్తా 
జుట్టు పట్టుకొని కిందికి తోస్తా 

పాత చెప్పులే చేత పట్టుకొని
కొడతాన్ - తిడతాన్
సఖియా నీ బాబంటే ఒక లెఖా పారేసిన బీడీ ముక్కా
ఓ సఖియా - నీ బాబంటే ఒక లెక్కా
అరేయ్ గాడిద
గాడిద నేను నీడొక్క చించుతానురా
గాడిద నేను నీడొక్క - నేను నీకొక్క 
ఓరేయ్ నీడొక్క చించు తానురా 
నీ ముక్కు చెక్కేసి నోరు నొక్కేసి రక్కేసి తోలు
నీ ముక్కు చెక్కేసి నోరు నొక్కేసి రక్కేసి తోలు
చీరేసి ఎండేసి డోలు కట్టించి వాయించుతాను

నీ డొక్క - నేను నీ డొక్క 
ఓరేయ్ నీడొక్క చించుతానురా! 
గాడిద నేను నీ డొక్క చించుతానురా
రా...రా...రా!
ఓ యమ్మో ఇంతకోపం ఏల ఏల పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్ 

పల్లవి:
ఓయమ్మో - ఇంత కోపం ఎలా ఎలా 
ఇంతకోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా ఇలా

చరణం: 1
దారిలో బంజారిగాళ్ళుంటారు 
ఊరిలో సోంబేరిగాళ్ళుంటారు
ఎక్కడవున్నా - అన్నుల మిన్నా 
మాటేసి గురిచూసి వేటాడుతుంటారు... ॥ఓయమ్మో॥

చరణం: 2
డేగలా ఎగిసి పడుతున్నావు 
నాగులా బుసలు కొడుతున్నావు
కసురుకున్నా - కలికి మిన్నా
నీ జాడలో నీడలో దాగివుంటాను  ॥ఓయమ్మో॥

చరణం: 3
గూటిలో చిక్కింది చిన్న జాగా 
కోటలో వేశావు పెద్దపాగా
చాలు చాలు - నాటకాలు
నీ గుట్టు లోగుట్టు కనిపెట్టి వుంటాను..... ॥ఓయమ్మో॥
ఓ హంస నడకల దాన పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. బి. శ్రీనివాస్ 

పల్లవి:
ఓ హంస నడకల దానా అందాల కనుల దానా
నా వలవు తెలుపుకోనా నీ మనసు తెలుసుకోనా
నీ పెదవిపై చిరునవ్వునై
కల కాలముండి పోనా

చరణం: 1
నీ సొంపులు చూసీ - నీ సొగసులు చూసీ
నా మది తొందర చేసే నీ మోములో ఒకజాబిలి
నా కన్నుల వెన్నెల కురిసె.... ॥ఓ హంస॥

చరణం: 2
నీ చల్లని మాటే ఒక కమ్మని పాటై 
వినిపించెను నా నోట నా రాగమే అనురాగ మై
వేసింది పూల బాట....  ॥ఓ హంస॥

చరణం: 3
ఒక తీయని స్వప్నం - అది మలచిన శిల్పం 
నాలో నిలచిన రూపం నీరూపమే నా మనసులో 
వెలిగించెను రంగుల దీపం..... ॥ఓ హంస॥
మంచి బియ్యంలోన మట్టిబెడ్డలు జేర్చి పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: మహారధి 
గానం: మాధవపెద్ది సత్యం, టి. ఆర్. జయదేవ్

మంచి బియ్యములోన మట్టిబెడ్డలు జేర్చి 
బొర్ర పెంచిన యట్టి ముచ్చు యితడు 
ప్రతిదిన మేడు గంపల మట్టి గరిపించి 
గడ్డి మేయించుడీ ఖలుని చేత 

పాల డబ్బాలనే బ్లాకు మార్కెటు జేసి
పసివారి జంపిన పాపియితడు
సలసల కాగేటి చమురులో పడదోసి
మన్వంతరము పాటు మాడ్చు డితని

లంచాలు తెగమేసి లక్షలు గడియించి
దేశాన్ని అమ్మిన దేబె యితడు 
సీసమ్ము కరిగించి చెవినిండుగా బోసి 
కొరడాల బాదుడీ క్రూరమతిని

నోట్లు పెట్టుబడిగా ఓట్లు సంపాదించి 
పార్టీలు మారిన భ్రష్టు డితడు
ఉక్కు ముక్కుల కాకులుక్కు మీరి పొడుచు 
తరి ముంచుడితని వైతరణిలోన

పాపులధికులై భూమికి భారమగుట
రౌరవాది నరకముల ప్రళయ భీక 
రాగ్ని కీలలన్ దహియించి అయ్యధముల
పాతకాల్ కడిగించుడో దూత లారా!
రా రా రమ్మంటే రావేల పాట సాహిత్యం

 
చిత్రం: అఖండుడు (1970)
సంగీతం: టి చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

రా! రా! - రమ్మంటే రావేలా
నీకింత బెదురేలా ఒంటరిగా వున్నారా
నను కాపాడిన చేతులలోనే
వాలేదనంటే యీ బిగు వేలా!
మగువే తానై వలచిన వేళా 
మగవారి బింకాలన్నీ యింతేనా

రా! రా! రమ్మంటే రావాలా 
పొమ్మంటే పోవాలా - నీ మాటే సాగాలా
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
నిలకడలేనీ చెలియలతీరూ
దివినుండే దేవునికైనా తెలియదులే 

యౌవ్వన మంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసే
నీవే నీవే నా సర్వమనీ
నీ కోసం వేచితినోయీ రావోయీ  ॥రా రా॥ 

No comments

Most Recent

Default