చిత్రం: రాగల 24 గంటల్లో (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: శ్రీ మణి
గానం: హరిచరణ్, రమ్యశ్రీ కామరాజు
నటీనటులు: ఇషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
విడుదల తేది: 22.11.2019
నారాయణతే నమో నమో
నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో
నారాయణతే నమో నమో
నమో నమో నమో నమో
నీ నగు మోముకి నమో నమో
నీ సొగసు గుణాలకి నమో నమో
నీ తేనెల మాటకి నమో నమో
నీ తియ్యని మనసుకి నమో నమో
నీ నగు మోముకి నమో నమో
నీ కనుబొమ్మే హరివిల్లా
కసురుగ నాపై విసరకలా (2)
దురుసుకుమారి నీ సుకుమారం
మనసున చేరి చేసెను మారం
చెణుకులు విసిరే అలివేణి అలకకు
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
అడుగులు కలిసే తొలి నడకా
జత కలిసిందా బ్రతుకంతా (2)
ఊపిరి తాళం ఒకటయ్యేలా
చెరిసగమయ్యే రసమయవేళ
శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
No comments
Post a Comment