Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Krack (2021)

చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, శ్రుతి హసన్, వరలక్ష్మి శరత్ , అప్సర, సముద్ర ఖని
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 09.01.2021Songs List:భూం బద్దలు పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ

ఊళ్ళో యాడ ఫంక్షన్ జరిగిన
మనమే కదా ఫస్టు గెస్టు
దద్దరిల్లే దరువుల లెక్కన
మన ఐటమ్ సాంగ్ మస్తు

అల్ ది బెస్టు

చీమకుర్తిలో కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

ఏ చోటుకి పోయినా అదే పాత వరసా
చిన్నా పెద్దా నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పల్లేక ఆళ్ళ గోల సూల్లేక
గాల్లోన ముద్దులని ఎగరేసా

ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్మ

భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దిస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటే గుండెకింద సలుపొస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపొస్తాందే
స్టేజి మీదకెక్కనియ్యి వంద నోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండా పిండేస్తా
కరువుతీరా ఒక్కసారి కావులించి వదిలేస్తా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముదొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే

డీజే డీజే డీజే డీజే డీజే కాదురొరేయ్
ఇది ఓజే ఒంగోలు జాతర ఓజే ఓజే ఓజే

యమ ఆర్కెస్ట్రా డాన్సు మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యు మై ఫ్యాన్సు అందరికీ థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్ మీల్స్
దిమ్మ తిరిగే రిలాక్సు అడగన్లే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు

నీ జోషు, నీ గ్రేసు అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందర జుజూబీలే
మిస్ ఇండియా ఫిగర్స్
ఎయ్..! వన్ టౌన్ రాజా నీ ఫన్ టౌన్ కి వచ్చానే
వినిపించెయ్ నా జ్యూక్ బాక్సు

ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్మ్

భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా
భలేగా తగిలావే బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్ర

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా


ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకుమారం అబబో
సురుకు ఎటకారం కారం అబబో అబబబ్యాబో

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం
హో హో..! భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా

తిండిమాని తిండిమాని తిండిమాని
తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా
నిదురమాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా

మైళ్ళకొద్ది వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్నా
నిన్ను కలిసిన రోజునుంచి బొత్తిగా నే నిన్నే మరిచి
నీతో ఉంటున్నా

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం
హోహో..! భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

తగిలావే తగి తగి తగిలావే భలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం
తగిలావే తగి తగి తగిలావే భలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం

కోరమీసం పోలీసోడా పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్ర

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి

నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది
నన్నెల్లి పొమ్మంది సవతి..!!
రవ్వంత నీ పక్క సోటివ్వనంటుంది
పోట్లాటకొస్తుంది దండెత్తి

ఆ సంగతేందో ఓ కాస్త నువ్వే తేల్చుకోరా పెనిమిటీ
కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి

పనిలో పడితే నీకేది గురుతురాదు
నువ్వలా వెళితే నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత చెరొక సగముగా
సమయమంత నీవే ఆక్రమించినావురా

ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ నిన్నేగా నే
మెల్లోని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి నీ క్షేమమే
కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా నీతో ఉన్నదంటా

కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి
మాస్ బిర్యానీ పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: కసార్ల శ్యామ్
గానం: రాహుల్ నంబియార్, సాహితి చాగంటి

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)

హే సింగారాల సివంగి
వయ్యారాల ఫిరంగి
కొంటె చూపు కోనంగి
పైట సెంగే పతంగి

హే పిస్తోల్ లాగే ఉన్నాదే
పిట్ట నడుం సంపంగి
బుల్లెట్ దాగి ఉన్నాదే
సొట్టబుగ్గల సారంగి

హో స్వీటీ నా డ్యూటీ
ఇకపైన ఇంట్లో నీతోటి
ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

బంగారం రా నీ బలుపు
బాంబులు మోతే నీ పిలుపు
పొట్టెలంటి నీ పొగరు
తట్టి లేపే నా ఫిగరు

AK 47 లా దూకేస్తార నీతోడు
ఏకంగా నీ వంటింట్లో చేయిస్తారా పెరేడ్
నన్ను కొట్టు నన్ను చుట్టు
ఇన్నినాళ్ళ ఆకలి తీరేట్టు

ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)

బేడీలు రెడిలే - జోడీగా వేయాలే
చెరసాల లుండాలే - చెలి కౌగిలి చాలే
దొరగారు హుషారే - దొరసాని తయారే

చిన్ని గుండెల్లో నువ్వు సిరెనాల
మోగుతుంటావే ఎదలో నిలిచి ఇలా
పొద్దు మాపుల్లో యూనిఫాంలా
అంటి ఉంటానే నీలో ఒదిగేలా

హే అందాలకే ఇయాల బందోబస్తు ఇయ్యాల
చందమామై తెల్లార్లు నువ్వే గస్తీ కాయాల
నే నచ్చి నిన్ను మెచ్చి
ముద్దులిచ్చి కుంటా రెచ్చి రెచ్చి

ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)
కటారి థీమ్ సాంగ్ సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: కసార్ల శ్యామ్
గానం: రాహుల్ నంబియార్, సాహితి చాగంటి

కట కట కటారోడు కస కస కస కసాయోడు


Most Recent

Default