చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: అభినవ్ చుంచు, తేజ్ కూరపాటి, తేజుస్ కంచర్ల, దినేష్ తేజ్, ప్రియ వడ్లమని, రమ్య పసుపులేటి, దక్ష నగర్కర్, హెంల ఇంగ్లే
దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, ఏ. రియాజ్
విడుదల తేది: 14.12.2018
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
నిశిలో శశిలా నిన్నే చూశాకా
మనసే మురిసే ఎగసే అలలాగా
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిముషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: స్పూర్తి యాదగిరి
ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా
కలతై కనులే వెతికేరా నీకే
ఒదిగే తనువే జతలేక తోడై
చుట్టూ నావెంటే ఎంతో మంది ఉన్నా
నా నువ్వే లేవని యాతన
కరిగే కన్నీరే పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన
చూస్తూ చూస్తూనే మాయగా
నువ్వే మారవు శ్వాసగా
మది నిను మరువనని మాటే ఇచ్చెనులే
మరువక కడదాకా ఉండరా
మౌనం చేసే గాయం
మార్చలేదా సాగే కాలం
నన్నేమన్నా ఏమనుకున్నా
నుఫ్లేకుంటే చీకటే
ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా
No comments
Post a Comment