చిత్రం: అరణ్య (2021)
సంగీతం: శాన్తాను మోయిత్ర
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్
నటీనటులు: రాణా దగ్గుబాటి, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, విష్ణు విశాల్, శ్రియ పిల్గొంకర్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాణ సంస్థ: ఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేది: 02.04.2021
చిటికేసే ఆ చిరుగాలి... చిందేసి ఆడే నెమలి...
కిలకిలమని కోకిల వాలి పాడెనులె హాయిగ లాలి
అడివంతా ఒకటై ఆహ్వానమే పలికనీ
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ (2)
చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి
అడివంతా ఒకటై… ఆహ్వానమే పలికనీ.
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2)
చుక్కలేడి కూనల్లారా.. అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదే… అందుకో మరి అంటున్నదే
కొమ్మల్లో పూచే పూలు… కురిపించెను అక్షింతల్లు
అల్లరి చేసే తెమ్మెరలు పూసెనులే సుమగంధాలు
సాగే నీ దారుల్లో హరివిల్లులే దించనీ...
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ (2)
మేఘాలే దరువేసే మెరుపులతో అడుగేసే
అది పంచే వెలుగంతా నీ కన్నుల్లో పోగేసే
తూఫానే నీ నేస్తం సుడిగాలే నీ చుట్టం
నువు గుర్తిస్తే చాలంట అడివంతా దాసోహం
మట్టి బొమ్మలాంటోడిని చెట్టు చేమలో ఒకడిని
నా ప్రాణమే నువ్వని కంటి రెప్పల్లే నిను కాయని
చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి
కిలకిలమని కోకిల వాలి పాడెనులె హాయిగ లాలి
అడివంతా ఒకటై ఆహ్వానమే పలికనీ
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2)
మబ్బు చాటు నెలవంకమ్మా ...
నింగి దాటి దిగి రావమ్మా
కడదాకా తన కలలని
కన్నతల్లైన మించాలమ్మా
No comments
Post a Comment