Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Raghu Kunche"
Matti Manishinandi Nenu (2019)




పాట: మట్టి మనిషినండి నేను (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: బేబీ పసల


మట్టిమనిషినండి నేను సాహిత్యం

 
పాట: మట్టి మనిషినండి నేను (2019)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: బేబీ పసల

మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను

పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం

ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో
ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో

చెమటచుక్క చదువులు నాయి కాయాకష్టం పాఠాలు
పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు

ఏతమేసి తోడానండీ నాలోఉన్న రాగాలు
దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు

పచ్చపచ్ఛాని పైరమ్మ పాట
ఏరువాకల్లో నాఎంకిపాట

ముళ్లదారే తీసి, పూలేఏసి మీముందు ఉoచాయీ పుట
ఇది నాబతుకు పాట
తీపిరాగాల తోటి, మావూరు దాటి మీకోసమొచ్చాను

మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను
మాణిక్యమన్నారు నన్ను

పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం

ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో
ఏలేలో...  ఏలేలో..
నానవ్వే.. ఉయ్యాలో

Palli Balakrishna Sunday, May 30, 2021
Question Mark (2021)





చిత్రం: క్వశ్చన్ మార్క్ (2021)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: బండి సత్యం
గానం: మంగ్లీ
నటీనటులు: ఆధా శర్మ
దర్శకత్వం: విప్ర
నిర్మాత: గౌరీ కృష్ణ
విడుదల తేది: 2021

రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో
రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే  మరి ఎలగో

ఎనకెనకే పడతావు ఎగా దిగా చూస్తావు
డీజే లు కడతావు డిస్కోలు అడావు 
కథ ఏంటి ? నీ కథ ఏంటి
కారెడ్డము అడమాకు పిలగో 
నా కంట్లో నలుసవ్వమాకు పిలగో

రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ రైయ్ అంటూ దూకితే మరి ఎలగో

గుప్పెడు పూలొట్టుకొని పప్పులుడకవంటావు
గుప్పెడంత గుండెలోన కుంపటెట్టి పోతావు
జాన బెత్తెడు నడుము చాన బాగుగుందని వెళ్లకుండ గిల్లిపోయి నన్నేమో పరిషాను జేస్తావు
ఇక చుసి ఎగ చుసి సిర్రెత్తు కొత్తుంటే సీటీలే కొట్టేత్తావు
తెగ ఆశ పెట్టేసి నా వైపే రాకుండా ఏ వైపో ఎలిపోతావు

కథ ఏంటి  నీ కథ ఏంటి అసలు కథ ఏంటి
ఎడమ కన్ను అదిరింది పిలగో నా వెన్నపూస కరిగింది పిలగో
ఎహె రాంసక్కనోడివిర పిలగో 
రైయ్ రైయ్ అంటూ దూకితే మరి ఎలగో

పాపిటి బిల్లట్టుకొని ఎగా దిగా జూస్తావు
పాయసాలు పెట్టు అని పగలబడి నవ్వావు
చెక్కరకేలి పండు చెక్కిలి పై రుద్దొద్దు
చిటికేసి చటుక్కున చతికిల పడిపోతావు
గరం గరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి
హడావిడి చేసేస్తావు
సల్లకొచ్చి ముంత దాసి నన్ను నువు ఎలాగోల సురా సురా చుట్టేత్తావు

కథ ఏంటి అసలు కథ ఏంటి నీ కథేంది రా
లడాయికి వచ్చినావ పిలగో
మరి లగ్గమైతే తీసేస్కో పిలగో
రామసక్కనోడివిర పిలగో 
రైయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో...


Palli Balakrishna Saturday, January 23, 2021
Palasa 1978 (2020)



చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
విడుదల తేది: 06.03.2020



Songs List:



ఓ సొగసరి ప్రియలాహిరి పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మి భూపాల
గానం: ఎస్.పి.బాలు, బేబి పసల

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేం మరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

చలివేళలో చెలి ఏలనే
సొగసుకు బిడియపు ముసుగూ
ఈవేళలో ఆగావని
అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను
కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనే ఉంటే
ఏదో అంటావునువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

చెలి కురులలో జలపాతమే
తనువొకధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే
మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్గొనువ్వు
నిండు జాబిల్లినవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను
పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేం మరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో
అహహా హహ ఆహహా
ఒహొహో హొహొ ఓహొహో




నాది నక్కిలీసు గొలుసు పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపదం
గానం: రఘు కుంచె, తేజస్విని నందిబట్ల

నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

హే పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు

మీ బావ గారు వచ్చేటివేళ - ఆ..
నీకు బంతి పూలు తెచ్చేటి వేళా - ఆహా
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా

మీ మరిదిగారు వచ్చేటివేళ - ఓసి
నీకు మందారం తెచ్చేటివేళా - అబ్బో
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటి వేళా

మీ మామగారు - ఆ..
పిల్ల మామగారు - ఎల్లే..

మీ మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళా
మీ మామగారు వచ్చేటి వేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా

నాది
నాది

నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నీకు కడియాలు తెచ్చేటి వేళా - ఆ
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా - ఓహో
నీకు కడియాలు తెచ్చేటి వేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా

నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా - ఊ..
అది పెట్టుకుని వచ్చేటి వేళా - చీ
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా
అది పెట్టుకుని వచ్చేటి వేళా

నీకు పట్టుచీర
అబ్బబ్బో పట్టుచీర

పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటి వేళా

నాది
నాది

నాది నక్కిలీసు గొలుసు...
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
హే పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో చూడొలె పిల్లా 
నాది నక్కిలీసు గొలుసు

నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...
నాది నక్కిలీసు గొలుసు...

నాది
నాది
నాది
నాది

నాది నాది నాది నాది నాది
నాది నాది నాది నాది నాది




బావచ్చాడో లప్పా బావచ్చాడ పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: ఉత్తరాంధ్ర జానపదం
గానం: అదితి భావరాజు

బావచ్చాడో లప్పా బావచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (4)

తెల్లచీర కట్టుకోని రామ్మన్నాడు
మంచి మల్లెపూలు పెట్టుకోని రామ్మన్నాడు (2)

పట్టు లంగా కట్టుకోని రామ్మన్నాడు
తీరా వెళ్ళాక వోగ్గేసి వెళ్ళిపొయినాడు (2)

బావొచ్చి బావొచ్చి భలే బావొచ్చి

బావచ్చాడో లప్పా బావచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (2)

ఒరే అన్నయ్యా
ఆ చెల్లి
ఒకటి చెప్పాలా
బేగి చెప్పేయే
చెప్పటానికి  ఎంటుందిరన్నయ్య
ఇంకా నాలుగు ముక్కలు పాడేస్తాను వినుర

యెడమ కాలికేసినాడు ఎర్రటి జోడు
వాడు కుడి కాలుకు ఏసినాడు కర్రిటి జోడు (2)

గుడివెనుక తోటలోకి రమ్మన్నాడు
తీరా వెళ్ళాక తాగేసి తోంగున్నాడు (2)

బావొచ్చే అరే బావొచ్చే అరెరే బావొచ్చే

బావచ్చాడో లప్ప బావ వచ్చాడు
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు (4)





ఏ ఊరు ఏ ఊరే వలె భామ.. పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల రవి కుమార్
గానం: విజయలక్ష్మి , రాజు, జముకు అసిరయ్య

ఏ ఊరు ఏ ఊరే వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ... నీది ఏ ఊరే
సీకకుళం జిల్లా...
జిల్లాలో పలాస మా ఊరు వస్తావా.. 
పలాస మా ఊరు...
బోగట్టలేటేటే మీ ఊరి.. బొగటలింకేటే..
నా దుక్కు సూస్తూనే సెప్తావా...
ఒకసారి ఇంటానే...

ఏ ఊరు ఏ ఊరే.. వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ.... నీది ఏ ఊరే.
పలాస మా ఊరు వస్తావా...
పలాస మా ఊరు...

భుగత ఇను ఇను.. సెబుతా ఇను ఇను..
మా ఊరి వైభోగం...
భుగత ఇను ఇను..సెబుతా ఇను ఇను...
మా ఊరి వైభోగం...
జెముకల కుండని వాయించనా
డేకురు కొండని సూపించనా...

ఏటికి అవతల ఏపుగా ఎదిగిన 
పచ్చాని సౌభాగ్యం..
జీడీ తోటల సింగారాలు.. 
ఆ ఎర్రాసెరువు.. ఎగిరే కొంగల కోలాటాలు.
జీడి పప్పు పేరు సెపితే చాలు...
పలాస విలాసం గురుతొస్తాది.
దేశాలన్నీ తెల్ల బంగారంలా
భావించే విలువైన పంటే ఇది..
ఎంతటి వంటైనా ఇదివుంటే ఓ అందం.
ఎంతటి వాడైనా, దీని రుచికే దాసోహం...
రెక్కలు ముక్కలు సెమట సుక్కలు
మంకీనమ్మకి నైవేద్యం...
బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు..
బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు...

పోరాటాల పురిటి గడ్డే ఇది
చైతన్య గీతాల గొంతే ఇది...
కదిలొచ్చిన చదువుల తల్లే ఇది
జననేతలుదయించే ఇల్లే ఇది...
వలస పిట్టలకి తేలి నీలాపురము
పాదయాత్రలకు మొదలు ఇచ్ఛాపురము
పచ్చని చీరని కట్టిన నేలకి
నుదుటున తూరుపు సింధూరం..

మనం మనం బరంపురం అనుకుంటూ
వరసలు కలుపుకు పోదా తరం తరం...
దేవుడు ఇచ్చిన వరం వరం
ఆ నెత్తురు బదులు ప్రేమే పొంగెను నరం నరం...




కళావతి కళావతి పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: రమ్యా బెహ్రా , రఘుకుంచె

కళావతి కళావతి
కళావతి కళావతి… కళావతి వద్దే వద్దే
కళావతి కళావతి… కళావతి వద్దే వద్దే
హోయ్ హోయ్…
మిడ్డేసుకున్న దాన్ని సూత్తవో… చున్నేసుకున్న దీన్ని సూత్తవో
మిడ్డేసుకున్న దాన్ని సూత్తవో… చున్నేసుకున్న దీన్ని సూత్తవో
మిడ్డి లేదు, చున్నీ లేదు… పొట్ట నువ్వు సూడకుండ
వడ్డాణవెట్టుకున్న… నన్ను సూత్తవో

దాన్ని సూత్తవో… దీన్ని సూత్తవో
నీ కన్నులల్ల మన్నుపొయ్య… నన్నే సూత్తావో 

మిడ్డేసుకున్న దాన్ని సూత్తనో… చున్నేసుకున్న దీన్ని సూత్తనో
మిడ్డేసుకున్న దాన్ని సూత్తనో… చున్నేసుకున్న దీన్ని సూత్తనో
దాన్ని సూత్తనో… దీన్ని సూత్తనో
వడ్డాణవెట్టుకున్న… నిన్ను కూడా వదిలిపెట్టనే
ఓయ్ ఓయ్ ఓయ్…

సాకిలేటులాగున్న దాన్ని తింటవో… ఐస్ ఫ్రూట్ లాగున్న దీన్ని తింటవో (2)
ఐస్ లేదు, గీసు లేదు వయసునంత కరగబోసి
ఎన్నె పూస లాగున్న నన్ను తింటవో
దాన్ని తింటవో, దీన్ని తింటవో… నీ కారమొళ్ళు పాడుగాను నన్ను తింటవో
కళావతి కళావతి… కళావతి వతి వతి

సాకిలేటులాగున్న దాన్ని తింటనో… ఐస్ ఫ్రూట్ లాగున్న దీన్ని తింటనో (2)
దాన్ని తింటనో, దీన్ని తింటనో… ఎన్నె పూస లాగున్న నిన్ను కూడ మింగేస్తనే
ఎల్లెహే…

ఆ రమ్మేసుకొచ్చినాది దానికిస్తవో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిస్తవో
రమ్ము లేదు గమ్ము లేదు… తమ్మలపాకు నమిలి
తెన్నీటి పెదవులున్న నాకిస్తవో…
దానికిత్తవో దీనికిత్తవో… నా పెదవులల్ల తేనె పుయ్య నాకు ఇత్తవో
దానికిత్తవో దీనికిత్తవో… నా పెదవులల్ల తేనె పుయ్య నాకు ఇత్తవో

రమ్మేసుకొచ్చినా దానికిత్తనో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిత్తనో
రమ్మేసుకొచ్చినా దానికిత్తనో… బబ్లు గమ్మేసుకొచ్చినాది దీనికిత్తనో
దానికిత్తనో దీనికిత్తనో… తెన్నీరు పెదవులన్న నీకు కూడా ఇచ్చేత్తానే
కళావతి కళావతి… కళావతి వతి వతి




చింత చెట్టు కింద పాట సాహిత్యం

 
చిత్రం: పలాస 1978 (2020)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: కరుణాకర్
గానం: సంధ్యా కొయ్యాడ

చింత చెట్టు కింద

Palli Balakrishna Tuesday, January 19, 2021
Raagala 24 Gantallo (2019)


 చిత్రం: రాగల 24 గంటల్లో (2019)

సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: శ్రీ మణి
గానం: హరిచరణ్, రమ్యశ్రీ కామరాజు
నటీనటులు: ఇషా రెబ్బా, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
విడుదల తేది: 22.11.2019







నారాయణతే నమో నమో
నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో
నారాయణతే నమో నమో
నమో నమో నమో నమో

నీ నగు మోముకి నమో నమో
నీ సొగసు గుణాలకి నమో నమో
నీ తేనెల మాటకి నమో నమో
నీ తియ్యని మనసుకి నమో నమో
నీ నగు మోముకి నమో నమో

నీ కనుబొమ్మే హరివిల్లా
కసురుగ నాపై విసరకలా (2)

దురుసుకుమారి నీ సుకుమారం
మనసున చేరి చేసెను మారం
చెణుకులు విసిరే అలివేణి అలకకు

నమో నమో నమో నమో
నమో నమో నమో నమో

అడుగులు కలిసే తొలి నడకా
జత కలిసిందా బ్రతుకంతా (2)

ఊపిరి తాళం ఒకటయ్యేలా
చెరిసగమయ్యే రసమయవేళ
శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు

నమో నమో నమో నమో
నమో నమో నమో నమో


Palli Balakrishna Sunday, January 17, 2021
Dongaata (2015)


చిత్రం: దొంగాట (2015)
సంగీతం: సత్య మహావీర్ , సాయి కార్తీక్ , రఘు కుంచె
సాహిత్యం:
గానం: రేవంత్, శ్రావణ భార్గవి
నటీనటులు: లక్ష్మీ మంచు, అడవి శేషు
దర్శకత్వం: వంశీకృష్ణ నాయుడు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.05.2015

బాయ్స్ అండ్ గర్ల్స్
వెల్కమ్ టు ద పార్టీ
లెట్స్ మేక్ దిస్ పార్టీ నాటి నాటి నాటి
జీనాతో జీనా హై ఎక్ దిన్ తో జానా హై
బీచ్ మే క్యూన్ రోనా హై
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

ఇప్పటి సంగతి ఇప్పుడే
చల్ రేపటి సంగతి రేపులే
వర్రీస్ అన్ని వదిలిపెట్టి పార్టీ పార్టీ పార్టీ
అమ్మా నాన్న ఫ్యామిలీ అడ్డొచ్చేవారేలేరులే
ధమ్ రే ధమ్ ఆనందమే జస్ట్ పార్టీ పార్టీ పార్టీ

4 3 2 1
కర్లో మస్తీ కర్లో రే

హే ఖుదా హమ్ క్యా కరే
ఈ క్లైమేట్ సూపర్ డూపరే
మస్తీ గుంది పార్టీలోని గ్లామరే

ఈ కలర్ ఫుల్ మేటరే కళ్ళకు కొట్టే ఫ్లేవరే
కమాన్ గర్ల్స్ రాక్ దిస్ పార్టీ నౌ
లెట్స్ మిక్స్ నాయిస్
డిజే ఇన్ ద హౌస్
లెట్స్ సింగ్ అండ్ డాన్స్ అండ్ స్వయ్ ఏయ్ ఏయ్
పార్టీ పార్టీ పార్టీ పార్టీ
డ్రింక్ అండ్ డ్రైవ్ అని పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ
సిక్స్ ఓ క్లాక్ గుడ్ మార్నింగ్ దాకా పార్టీ చేద్దాం గురువా
కరంట్ తీగలం ఒకటై కలిసాం టైం పాస్ కె కరువా
డాన్స్ ఫ్లోర్ కి ఫైర్ ఆంటీద్దాం జవానికే హే జల్వా
నాచో నాచో యారో సాంగ్ బజావో యారో
మారో మస్తీ మారో మారో ఈ నైట్ కి నువ్వే హీరో

బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం తోటి
జస్ట్ వాచ్ ఇట్ నైట్
మేకప్ లేని మనసులతోటి పార్టీ చేద్దామా

కర్లో మస్తీ కర్లో రే...

బాయ్స్ అండ్ గర్ల్స్ దిస్ నైట్ ఈజ్ పార్టీ టైమురో
మస్తీ మస్తీ  మస్తీ మస్తీ కర్లో మస్తీ మస్తీ మస్తీ
సూట్ బూట్ క్లాస్ గా
నువ్వు వుండొద్దంటా ఫాల్స్ గా
ఈ నైట్ కి నీలో మాస్ ని బయటికి తియ్యరో
ఇంగ్లీష్ సరుకే తియ్యరో ఇండియన్ సెలైన్ ఇయ్యరో

డండనక డండనక  డండనక ట




Palli Balakrishna Tuesday, February 19, 2019
47 Days (2018)


చిత్రం: 47 Days (2018)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: లక్ష్మీభూపాల 
గానం: నీహ కడివెటి
నటీనటులు: సత్యదేవ్, పూజా జవేరి, రోషిణి ప్రకాష్
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
నిర్మాతలు: దబ్బర శశి, భూషణ్ నాయుడు
విడుదల తేది: 15.03.2018

క్యాకరూఁ.. మై క్యాకరూఁ
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే
ఓ మాహివే.. మాహివే..
ఓ మాహివే.. మాహివే..
క్యాకరూఁ.. ఎంత గడుసోడే
క్యాకరూఁ.. సొంతమయ్యాడే

మనసు నాకైనా చెప్పకుండానే
ఎప్పుడో తనతో వెళ్ళిందా
వయసు రాగానే ఎదురుగా తానే
ఎన్నడో ముడిపడిపోయిందా
ఓయ్ నేస్తమా నా ప్రాణమా
నా తోడుగా ఉంటావనే
వున్నానులే నీ కోసం
చిరుగాలి పరదాల్లో
అలసిన కలువగ
చెలియను ఐతే

క్యాకరూఁ.. ఓ మాహివే
మై క్యాకరూఁ.. ఎంత గడుసోడే

పచ్చబొట్టల్లే మారిపోయాడే
వెచ్చగా నాలో కలిశాడే
కాలి మెట్టల్లే చుట్టుకున్నాడే
జంటగా నాతో నడిచాడే
ఓ అమ్మలా ఈ జన్మలా
కలిశావులే కల కాదుగా
విడిపోనులే చితినైనా
మనసంతా నువ్వైతే
నేనని నువ్వని వేరౌతానా

క్యాకరూఁ..మై క్యాకరూఁ..
ఆ నవ్వు చూస్తే మాటరాదే క్యాకరూఁ..
పావురాయల్లే నేను పోతుంటే
నీలి మబ్బై దారి కాచాడే
తేనె చుక్కల్లే జారిపోతుంటే
తుమ్మెదల్లే తాను మారాడే

Palli Balakrishna Friday, February 1, 2019
Mama Manchu Alludu Kanchu (2016)


చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచె
సాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్
నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణ
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 2016

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)
సంగీతం: కోటి
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రీచరన్ , శృతిహాసన్

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే
నీ గుచ్చే గుచ్చే చూపే నచ్చిందే
నిను గిచ్చే గిచ్చే మందే నా మనసే
నా హృదయాన్నే కానుకిస్తున్నా
నిను ప్రాణంగా ప్రేమిస్తున్నా

ప్రేమా....
నిజమా...

నా కనులకు పెదవులు ఉంటే పలికేవే
తొలిప్రేమకు అర్ధం అంటే నువ్వేలే
నీ గుండెల్లో చిన్ని చోటున్నా
ఈ జన్మంతా సర్దుకు పోతాలే

మనసా... ఓ...
నీ తీయటి జ్ఞాపకమల్లె ఉంటానే
నీ మాటను సంగీతంలా వింటానే
నీ కన్నుల్లో ఓ నలుసైనా
నే పడనీనే ఏ నిమిషాన

నిను చూశాకే తెలిసిందే ప్రేమంటే
నా మనసే కావాలందే నీ జంటే
కల నిజమైతే నీలా ఉంటుందే
ఆ సంతోషం నాలా ఉంటుందే


Palli Balakrishna Wednesday, March 14, 2018
Aha Naa Pellanta (2011)



చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: అల్లరి నరేష్ , రీతూ బర్మచా, అనిత
దర్శకత్వం: వీరభద్రమ్
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర
విడుదల తేది: 02.03.2011



Songs List:



సుబ్రహ్మణ్యం పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె

సుబ్రహ్మణ్యం 





నువ్వే నచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: చిత్ర 

నువ్వే నచ్చావు 




లెఫ్ట్ చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు, సింహ, భార్గవి పిళ్ళై

లెఫ్ట్ చూస్తే




వెన్నెల దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం:  సిరా శ్రీ 
గానం: రఘు కుంచె

వెన్నెల దీపం 




చినుకులా రాలి పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: వేటూరి
గానం: రఘు కుంచె, అంజనా సౌమ్య

(ఈ పాట నరేష్, పూర్ణిమ నటించిన నాలుగు స్థంభాలాట (1982) చిత్రం లోనిది, దీనికి సంగీతం: రాజన్ - నరేంద్ర, సాహిత్యం: వేటూరి, గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఈ సినిమాలో రీమిక్స్ చేశారు)

చినుకులా రాలి
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను 
మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా 

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 

ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే 
కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే 
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే 
జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే 
ఆ చల్లనీ గాలులే...

హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
శిశిరమైన  సిధిలమైన
విడిచిపోబోకుమా విరహమై పోకుమా

తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే  
పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే 
నింగికినేల అంటిసలాడె  ఆ పొద్దురావాలిలే 
నిన్నలు నేడై  రేపటి నీడై నాముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే...

మౌనమై మెరిసి గానమై పిలిచి
అలలతో అలిసి  గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ 
భువనమైనా  గగనమైనా
ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా...




సాటర్ డే ఈవెనింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి 
గానం: పృద్వీ చంద్ర, అనుదీప్ దేవ్ , నోయెల్ (RAP)

సాటర్ డే ఈవెనింగ్ 

Palli Balakrishna Friday, November 10, 2017
Bumper Offer (2009)


చిత్రం: బంపర్ ఆఫర్ (2009)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె , సవితా రెడ్డి
నటీనటులు: సాయిరాం శంకర్ , బిందుమాధవి
దర్శకత్వం: జయ రవీంద్ర
నిర్మాత: పూరీ జగన్నాథ్
విడుదల తేది: 23.10.2009

పల్లవి:
బుజ్జి కొండ చూడకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట
ఐ లవ్ యూ... నో నో నో...
బుజ్జి కొండ చెప్పకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో... యా...

చరణం: 1
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే... అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ...
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే... కొండ.....
ఐ హేట్ యూ...

చరణం: 2
దిల్ కవ్వమెట్టి తిప్పినావే... నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే... నో వే
ఇంత దూరం వచ్చి
కాదంటావే... యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే... కొండ.....
పోరా బోండా...
కొండ....

Palli Balakrishna Friday, September 22, 2017
Devudu Chesina Manushulu (2012)



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 15.08.2012



Songs List:



సుబ్బలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: రఘు కుంచెరఘ

సుబ్బలక్ష్మి 




నువ్వేలే నువ్వేలే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శ్రేయ గోషల్

నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ

చరణం: 1
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచాన అంటే ఏంటో చిత్రంగా ఉంది నాలో నాకే
నువ్వే లేకుండా ఇంత కాలం బతికాన అంటే  ఏమో కలనైన నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని కన్నుల చేరని వెన్నెలనీ
అందించావని ఆనందిస్తా నీ తోడులో
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకనే చూస్తున్నా కద నీ ప్రేమలో

చరణం: 2
ఏదో తింటున్నానంతే ఏదో ఉంటున్నానంతే
నువ్వే ఎదురవ్వక పొతే రోజు ఇంతే
నాకే నే బరువై పోయా నాలో నే కరువై పోయా
నిన్నే కలిసుండకపొతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకొని నాలో నే మాట్లాడుకొని
గడిపేశానని గుర్తే రాదిక నీ నీడలా
నాకేతోడు దొరకదని  ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ




డిస్టర్బ్ చేస్తున్నాడే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం:  సుచిత్ర 

డిస్టర్బ్ చేస్తున్నాడే





ఏమిచేతురా లింగా పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం:  ఉదిత్ నారాయణ్, చిన్మయి 

ఏమిచేతురా లింగా 



నువ్వంటే చాలా చాలా ఇష్టమే పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం:  అద్నాన్ సామి, జోఅన్న

నువ్వంటే చాలా చాలా ఇష్టమే 



దేవుడా దేవుడా పాట సాహిత్యం

 
చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం:  రఘు కుంచె, అంజనా సౌమ్య

దేవుడా దేవుడా 

Palli Balakrishna Friday, July 28, 2017

Most Recent

Default