Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aakasam Nee Haddura (2020)








చిత్రం: ఆకాశమే నీ హద్దు రా(2020)
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధీ , జీవీ ప్రకాష్ కుమార్
నటీనటులు: సూర్య , అపర్ణ బాలమురళి, మోహన్ బాబు
దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత: సూర్య, రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలి స్పుర్తి
విడుదల తేది:  12.11.2020

లల్లాయి లాయిరే లాయిరే...ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే...లాయ్
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ

కాటుక కనులే మెరిసిపోయే... పిలడా నిను చూసి
మాటలు అన్ని మరిసిపోయా..... నీళ్ళే నమిలేసి...

ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు... గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు... ఈడుకేమో జాతరొచ్చేరా...
నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా..!
మోడుబారిపోయి ఉన్న... అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చివురులొచ్చేరా....

నా మనసే నీ వెనకే తిరిగినది...
నీ మనసే నాకిమ్మని అడిగినది...

లల్లాయి లాయిరే లాయిరే...ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే...లాయ్
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ


గోపురాన వాలి ఉన్న పావురాయిలా...
ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా...
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా...
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా...
నా మనసు విప్పి చెప్పనా... సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా..!
నే ఉగ్గబట్టి ఉంచినా... అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా..!!
నీ సూదిలాంటి చూపుతో... ధారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా...
నా నుదిటి మీద వెచ్చగా... ముద్దు బొట్టు పెట్టారా
కుట్టి కుట్టి పోరా...ఆ ఆ, కందిరీగ లాగా...
చుట్టు చుట్టుకోరా... ఆ ఆ, కొండచిలువ లాగా...

కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా...
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా....
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా....
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా...
నీ పక్కనుంటే చాలురా... పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా....
నే వేడి వేడి విస్తరై.... తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య...
నా చేతి వేళ్ళ మెటికలు... విరుచుకోర మెల్లిగా
చీరకున్న మడతలే చక్కబెట్టారా....
నీ పిచ్చి పట్టుకుందిరా... వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా... ఆ ఆ, నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా... ఆ ఆ, వెన్నుపూసలాగా

లల్లాయి లాయిరే లాయిరే...ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ
లల్లాయి లాయిరే లాయిరే...లాయ్
లల్లాయి లాయిరే లాయిరే... ఏఏ








చిత్రం: ఆకాశమే నీ హద్దు రా(2020)
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాదు కృష్ణన్. కె, జీవీ ప్రకాష్ కుమార్

సఖియే...
తానే  తాననే  తానననే తానననే తానననే

ఒక్కనిమిషం నువ్వు కనరాకుంటే దిగులైతాదే
దోబుచికైనా నన్ను ఒదిలి ఎళ్ళిపోకే నువెళ్ళిపోకే
నర నాడులన్ని తడబడిపోతాయే నువు లేకుంటే
నా ఊసులన్నీ ఊపిరి తీస్తాంది చెలి నీ కొరకే
పేరుకే నేనున్న నా ప్రాణంగా ఉంది
నువ్వేనే నువ్వేనే

ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం నువ్వు
కనరాకుంటే దిగులైతదే
దోబుచికైనా నన్ను ఒదిలి వెళ్ళిపోకే నువెళ్ళిపోకే

నెత్తురు చిందని కత్తి నీ చూపుల ఒత్తిడని
కనరాని గాయమయేలా కొసావే నా ఏదని
ఊపిరితిత్తుల ముంచే పరదేశీ అత్తరని
తలవాల్చనే ఒడిలోన నీ శ్వాసకు దగ్గరని

మరుజన్ముంటే చీమై నేపుడుతానే
నీ పెదవుల తీపై అందేలా తిప్పలు పడుతానే
మరుజన్ముంటే చీమై నేపుడుతానే
నీ పెదవుల తీపై అందేలా తిప్పలు పడుతానే

కథలో ఎంకిని ఇంట మా గొప్పగా అనుకున్నా
నా ఎదురుగా నిన్నే చూసి నీ కలలో పడుకున్నా
ఎవ్వరు రాసిన రాతో నీ జతలో నేనున్నా
జన్మాలెన్ని అయినా నా బతుకే నువు అన్నా

పడతాడంటే పడిపోడా మగవాడు
అంతోటి గొప్పగా మలిచాడే నిన్నపైవాడు
పడతాడంటే పడిపోడా మగవాడు
అంతోటి గొప్పగా మలిచాడే నిన్నపైవాడు

సఖియే...
తానే  తాననే  తానననే తానననే తానననే







చిత్రం: ఆకాశమే నీ హద్దు రా(2020)
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుంజయ్, అనురాగ్ కులకర్ణి

తానే తన నానే నానే నానే తన నానే (3)

నడి గుండెల్లో నిప్పుంది మండించు దాన్ని
ఆ మంటల్లో వెలిగించు నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైన లెక్కించకు దేన్ని
ఎదురీదాలి చేరాలి లక్ష్యాలని

ఒడ్డున ఉండి రాళ్లేస్తారు
నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువ్వు తేలిన నాడు
మూసుకుపోవా వాగినా నోళ్లు

ఒడ్డున ఉండి రాళ్లేస్తారు
నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువ్వు తేలిన నాడు
మూసుకుపోవా వాగినా నోళ్లు

ముక్క చెక్కలుగా విరిచేయ్
నీకెదురుపడిన చిక్కులనీ
ఉక్కు రెక్కలతో ఎగరే
నిన్ను నమ్ముకున్న నీ కలని

తానే తన నానే తానా నానే తానా నానే

అదిగో ఆకాశం నీ హద్దురా

ఇటు రా అని చిటికేసావో
గెలుపెందుకు దిగి రావాలి
నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్ట తెలియాలి
గర్వంగా చెప్పుకునేందుకు నీకో ఓ కథ కావాలి
చెమటోడ్చి పొందిన విజయం
పరిమళమే నిను చేరాలి

కన్ను చిన్నగున్నదంటూ చిన్న కళలు కంటామా
లేనిపోనీ పేదరికంతో వాటికి గిరి గీస్తామా
మట్టిలోకి వెళ్లిపోయామో మళ్ళి పుట్టి వస్తావా
ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా

మనసు పెట్టి పని చేస్తూ ఓర్పుతోనె అడుగేసేయి
నీదైన మార్పుగా నేడే సరికొత్త చరితనే రాసేయ్

తానే తననానే తననానే తననానే
తానే తననానే తననానే తననానే (2)

ఆకాశం నీ హద్దురా పద పద...

No comments

Most Recent

Default