Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Uma Chandi Gowri Shankarula Katha (1968)
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.రామారావు, బి.సరోజాదేవి
దర్శకత్వం: కె.వి.రెడ్డి
నిర్మాతలు: చక్రపాణి, నాగిరెడ్డి
విడుదల తేది: 11.01.1968Songs List:శ్రీ కరంబై అపూర్వమై పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల 

శ్రీ కరంబై అపూర్వమై చెలగునెద్ది?
ఏది చిత్ర విచిత్రమై హృద్యమగును?
ఏది పుణ్య ప్రదంబైన ఎరుక నొసగు?
ఏది వినిన పాపములె హరించి పోవు ?
అట్టి సత్కథ ఏది, మహర్షులార ?శ్రీగౌరి నా పాపలై పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: పి.లీల 

శ్రీగౌరి నా పాపలై నన్ను దీవింప దయచేసెనే
లోక మాతలకు తల్లివౌ తల్లీ నీకె తల్లినౌ వరమిచ్చినావా
మూడు లోకాల తరియింపగోరి మూడు రూపాల విలసిల్లినావా
నీవు శక్తి స్వరూపమె చిన్నీ నీవు రక్తికి నిలయమ్ము కన్నీ
పతిభక్తి కాదర్శము చిట్టీ మీ లీల భువికెల్ల మేలౌనులేఆహా సఖి ఈ వనమే పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: పి.సుశీల & బృందం 

ఆహా సఖి ఈ వనమే కనగా మనసాయె
మనసాయె మనసాయె మనసాయె

ప్రియగాన మహాసాగిన వినగా మనసాయె
మనసాయె మనసాయె మనసాయె

పరాగ విభవముతో మల్లెపూల ఘుమ ఘుమలు
సరాగ గీతముతో తుమ్మెదల రిమ ఝిమలు
వసంతుడే మదిలో పిలిచినటులు అనిపించే
దిసంతులేమేమో పలికినటులు వినిపించె

విలాసలీలలతో లతలు తరులు కలియగనే
వికాస హాసముతో వనసుందరి విరియగనే
అనంగుడే వలపు తలపు చిగురించె
చలించు హృదయములో శృతిని సరిగ సవరించె

ఏమిటో ఈ మాయా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఏమిటో ఈ మాయా కలలోని కథవలెనాయే
వాని నరసీ వాని నొరసీ మనసు విరిసేనే
తానుగా నను తానే అది నిజమే కారాదా
నాటిదో ఏనాటిదో నేటి యీ చెలిమి
మేలుగా ఒక లీలగా కలనిజమే కారాదా
కనులు కలిసి మనసు తెలిసి మేనులే సొలసి
ఉంటిమని కలగంటికదా అది నిజమే కారాదా
ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో, సఖీ
మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా
వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా
మాయయే మటుమాయమై కల నిజమే కారాదానన్నూ వరించు వీరుడు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

నన్నూ వరించు వీరుడు నన్నూ జయించు ధీరుడు
నన్నూ భరించు మొనగాడూ ఎవడే ఎవడే వాడెవడే
నాతో పందెము లాడగనే నాజిగి నాబిగి చూడగనే
డింకకొట్టక డొంకపట్టక జంకక నిలిచే వాడెవడే
నా పరవడికి ఆగేనా నా ఉరవడికి తూగేనా
నను కనిపెట్టీ నా చెయిపట్టీ వనరుగ వలచే వాడెవడే
వడిగల వాడూ వచ్చేనా వగలూ వలపూ తెచ్చేనా
భువిలో లేడని దివినుండెనా దిగి రాగలిగిన వాడెవడేఅబ్బలాలో ఓ యబ్బలాలో పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల 

అబ్బలాలో ఓ యబ్బలాలో నీ అడుగు అడుగునా తళుక్
నీ కులుకు కులుకునా బెళుక్ నీ విసురు విసురునా ఛెళుక్
తళుకు కన్న బెళుకు మిన్న బెళుకు కన్న చెళుకు మిన్న
ఇన్నివన్నె చిన్నెలున్న నిన్ను విడిచి పోనులే
తటాలుమని నీ మిటారి చూపులు కటారులై ఎదనా టెలే, బల్
హుటాహుటిగ మది దూడెలే
ఎంత టక్కు చేసినావు ఎంత టెక్కు చూపినావు
ఇన్ని టక్కు టెక్కులున్న నీకు జోడు నేనెలే
చందమామనే డిందుచేసెనే కందిపోయినా నీ మోము
మెరుపుతీగెనే మరువజేసెనే మెలిక తిరిగినా నీ మేను
మోములోని ఇంపు జూచి మేనులోని సొంపు చూచి
ఇన్ని ఇంపు సొంపులున్న నిన్ను పొగడలేనులే
ఏల మరచినావొ పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: యస్.జానకి 

ఏల మరచినావొ ఓ దేవ దేవా
నన్నేల మరచినావొ ఓ దేవ దేవా
మన ప్రాణ మొకటి కాగా నిను కొలిచి యుంటినే
మన మేను లొకటికాగా నిను వలచి యుంటినే
ఈ పాపి జగతిలోన నా జనన మేలనో
ఈ మూఢ జనుల హింస నే నోర్వజాలనే
మొర నాలకింపవేలా మనజాలనో ప్రభూ
నన్నేలుకొనగ రావా నే కొలుచు దేవదేవాఓ సిగ్గులొలికే సింగారి పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 

ఓ సిగ్గులొలికే సింగారి పిల్లా ఎగ్గులేదే కంగారు పిల్లా
నిలిచి పాడవే – నాతో కలసి ఆడవే -
ఓ మొగ్గలేసే ఓ చిన్నవాడా తగ్గిరావోయ్ ఓ వన్నెకాడా
పాటలేమనీ నీతో ఆటలేమని
ఓర చూపుతో నన్ను కోరినది ఏమని ?
నీ టక్కు టెక్కులు చాలని నా దిక్కు చూడగ రాదని
దాచుకున్న నవ్వులోన తోచు భావ మేమని
ఈ పిచ్చి వాగుడు వద్దని నీ వచ్చిందారిని పొమ్మని
నీదు గుండెలో ఏదో సందడించే ఏమని?
నావంక చూచుటె తప్పని అది మానకుంటే ముప్పని
కన్నెపిల్ల కోపమందు ఉన్న గుట్టు ఏమని ?

ఈ శంక లిక్కడ కాదని ఇక డింక కొట్టక పొమ్మని
నీ కోరచూపులు ఏమని ? నీ కొంటెనవ్వులు ఏమని ?
నీ అల్లీబిల్లీ ఏమని ? ఏమని ? ఏమని ? ఏమని ?
ఇలా నీవు చెంతనుంటే కులాసా కదా యని
సదా నన్ను వీడకుంటే అదే మేలు మేలని
సుందరేశ్వరా ఇందు శేఖరా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: యస్.జానకి 

సుందరేశ్వరా ఇందు శేఖరా కను విందుగ నా సేవల గొని కనికరించరా
పరమ పావనము మధుర మోహనము నిత్య శోభనము నీ మంగళ రూపము
కనులార తిలకించి మనసార అలరించి నేడు నే ధన్య నైతిరా దేవా :
సకల జీవులకు సర్వ దేవులకు పరమ తారకమగు నీ పాదయుగళీ
తనివితీర పూజించి తనువు మరచి ధ్యానించి బాధలే మరచినానురా దేవా !
కలగంటివా చెలీ కలగంటివా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల 

కలగంటివా చెలీ కలగంటివా కలలోన నీప్రియుని కనుగొంటివా
నిండు చందురుని పోలినవాడా పండు వెన్నెలలో నినుచేరినాడా
మేనుసోకించి మేల్కొల్పినాడా మౌన భావాన మనసిచ్చినాడ
కన్నూలు కన్నూలు కలుసుకొన్నాయా పెళ్ళిబాజాలు మంత్రాలు వినిపించినాయా
ఉమను శంకరుని తలచుకొన్నారా పేరుపేహన పిలుచుకొన్నారా
నీ లీలలోనే ఒక హాయిలే పాట సాహిత్యం

 
చిత్రం: ఉమాచండి గౌరి శంకరుల కథ (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల 

నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే
నీ వున్నచోటే స్వర్గాలుగా భువనాలనేలా నా కేలలే
దివినైన ఏలే పతి ఉండగా ఏవైభవాలో నాకునూ ఏలలే
నా విందు నీవై చెలువొందగా ఏ చందమామో నా కేలలే
నా వెలుగు నీవై విలసిల్లగా ఏ వెన్నెలైనా నాకునూ ఏలలే
నీ వలపు వాహినిలో నే తేలగా ఏ కేళియైనా నా కేలలే
నీ ప్రేమ లాహిరిలో నే సోలగా ఏ లాలనైనా నాకునూ ఏలలే

భృగుమహర్షి, ఋషుల బృందము

జయజయ శంకర ఉమామహేశ్వర 
చండీనాధా : గౌరీ మనోహర
జయజయ శంకర మాం పాహీ
ముల్లోకాలకు తల్లిదండ్రులై
చల్లగ భక్తుల నేలు దంపతులు
జయ పరమేశ్వరి  జయ పరమేశ్వర
జయజయ శంకర మాం పాహీ

No comments

Most Recent

Default