Search Box

Paruvu Prathista (1993)చిత్రం: పరువు ప్రతిష్ట (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: సుమన్, సురేష్ , మాలాశ్రీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సి.గుహనాథన్
కో-డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1993

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

ప్రేమసీమ సొంతమాయె చందమామ
జోడు సంబరాల సంగతే పాడవమ్మా
పాడవమ్మా పాడవమ్మా
రంగమంత సిద్ధమాయె చుక్కభామ
వేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మా
చూడవమ్మా చూడవమ్మా
తపించు ప్రాయాలు తరించి పోవాలి
గమ్మత్తు గాయాలతో
రహస్య రాగాలు తెగించి రేగాలి
కౌగిళ్ళ గేయాలతో
వానవిల్లై పెదవులు
ముద్దునాటే పదునులో
బాణమైనా గానమైనా
తేనెకాటే తెలుసుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

మాయదారి సోయగాలు మోయలేక
నీకు లేని పోని యాతనా కన్నెతీగా..
కన్నె తీగా.. కన్నె తీగా..
తీయనైన తాయిలాలు దాయలేక
నీకు పాలు పంచి పెట్టనా తేనెటీగా
తేనెటీగా తేనెటీగా
సయ్యంటు వస్తాను చేయూత నిస్తాను
వెయ్యేళ్ళ వియ్యాలతో
వయ్యారమిస్తాను ఒళ్ళోకి వస్తాను
నెయ్యాల సయ్యాటతో
బంధనాలే సాక్షిగా మంతనాలే చేయగా
మన్మధుణ్ణే మధ్యవర్తై
ఉండమందాం చక్కగా

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
No comments

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0