చిత్రం: పల్లెటూరు (1952)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: వేములపల్లి శ్రీకృష్ణ
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు
దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావు
నిర్మాత: పి.శివరామయ్యా
విడుదల తేది: 16.10.1952
పల్లవి:
చేయెత్తి జైకొట్టు తెలుగోడా...
గతమెంతో ఘనకీర్తి గలవోడా...
చేయెత్తి జైకొట్టు తెలుగోడా...
గతమెంతో ఘనకీర్తి గలవోడా...
చరణం: 1
వీర రక్తపుధార ...వారబోసిన సీమ
వీర రక్తపుధార ...వారబోసిన సీమ
పలనాడు నీదెరా ...వెలనాడు నీదెరా
పలనాడు నీదెరా ... వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి...
తాండ్ర పాపయ్య గూడ నీవొడోయ్...
నాయకీ నాగమ్మ... మల్లమాంబా... మొల్ల ...
నాయకీ నాగమ్మ... మల్లమాంబా... మొల్ల ...
మగువ మాంచాల... నీ తోడబుట్టినవోళ్ళే...
మగువ మాంచాల... నీ తోడబుట్టినవోళ్ళే....
వీరవనితలగన్న తల్లేరా...
ధీరమాతల జన్మభూమేరా...
చరణం: 2
కల్లోల గౌతమీ ఆ ఆ ఆ ఆ ఆ...వెల్లువల కృష్ణమ్మ ఆ ఆ ఆ ఆ ఆ
కల్లోల గౌతమీ... వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి ...పొంగివారిన చాలు
తుంగభద్రా తల్లి ... పొంగివారిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా....
కూడు గుడ్డకు కొదవలేదోయి
చరణం: 3
ముక్కోటి బలగమోయ్... ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన ... వూరు పేరుంటాది
ఇరుగు పొరుగులోన ... వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా...
సవతి బిడ్డల పోరు మనకేలా...
పెనుగాలి వీచింది ఆ ఆ ఆ ఆ... అణగారి పోయింది ఆ ఆ ఆ ఆ
పెనుగాలి వీచింది ... అణగారి పోయింది
నట్టనడి సంద్రాన ... నావ నిలుచుండాది
నట్టనడి సంద్రాన ... నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా...
నావ దరిజేర్చరా ... మొనగాడా...
చేయెత్తి జైకొట్టు తెలుగోడా...
గతమెంతో ఘనకీర్తి గలవోడా...
గతమెంతో ఘనకీర్తి గలవోడా....
No comments
Post a Comment