Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Palletoori Pilla (1950)
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
నటీనటులు: నాగేశ్వరరావు, యన్.టి.ఆర్, అంజలీ దేవి
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: బి.ఎ. సుబ్బారావు
విడుదల తేది: 27.04.1950

(ANR, NTR  కలిసి నటించిన మొదటి సినిమా. ANR గారికి ఇది 12 వ సినిమా, NTR గారికి ఇది మూడవ సినిమా. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాల్లో నటించారు)Songs List:వీరులకంటే వేరు దైవములు లేరుగదా! పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: పి.ఆదినారాయణ
గానం: జిక్కి

రాగిణి:

ధీర కంపనా!
మహ వీర కంకణా !

వీరులకంటే వేరు దైవములు లేరుగదా!
లేరుగదా! కనరారు గదా !
ఘనులౌ వీరులు కంపనతో
సరి రారు గదా ! నిల లేరు గదా ! యిల లేరుగ దా !..

కంపన ధీరుని పేరు చెప్పితే
గడగడలాడును జగమూ
చేతికి చిక్కని శత్రుల కంతా
సింహ స్వప్న మే నిజమూ ! ఇది వినుమూ...

గిరగిర తిరుగుచు మెరపులు కక్కుచు
తరిమి తరిమి తన శత్రులనందర
కరుక్కరుక్కని నరుకుచు పోయే
కంపన కృత్తికి కనులున్నాయన వచ్చుగదా !
ప్రజ మెచ్చుగదా !......
ధీర కంపనా జై జై.....
ముగ్గు పాట పాట సాహిత్యం

 
ముగ్గు పాట 

శశి 

రత్నాల తీవెల తోడా
వజ్రాల కోవల తోడా 
ముత్యాల పెళ్లి పీటా ముగ్గువేయవే ! 
వేగ ముగ్గు వేయవే !
మురిపాల పెళ్లి పీటా ముగ్గు వేయవే ! ... 

సింగారా లొలి కేలాగా
శీతారాములు కూర్చొనగా 
రంగైన పెళ్లిపీట రమణి వేయవే
వేగ రమణి వేయవే
రత్నాల పెళ్లి పీట రమణి వేయవే!చిట పట చినుకులు పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం, జిక్కి

లప్పాం-టప్పాం

చిట పట చినుకులు దుప్పటి తడిసెను 
తలుపుతియ్యవే భామా...... త॥

అర్ధ రేత్రి కాడ నిద్దర పొద్దులో
ఎవరని తీతునోయీ సామి...... ఎ॥

గోవర్ధనగిరి గోవులు మేపడి
గోపమ్మ కొడుకును నేనే భామ. 
గోపల కిష్ణున్ని నేనే.

హా, నాధా! నా కేటి తెచ్చినావ్ !

ధగ ధగ మెరిసెడి దంతపు గాజులు 
నీ కని నే తెస్తినే భామ.
నిను జూడనే వస్తి నే;

మందర గిరిదర సుందర విగృడ
మదన జనక రావోయీ కుష్ణ మదన ॥

వన్నెలాడి నీ సన్నని చీరపై
వసంత మరకల వేమే భామ ...... వసంత॥
పో పొండి హేయ్ రాకండి పాట సాహిత్యం

 
శాంత - వసంత్- శశి & కోరస్

శాంత:
చిలకలార! ఎలకలార ! మిడతలారా!
పో పొండి హేయ్ రాకండి,
దూర దూరముగ పొండి,
ఓ, చేతగాని పలుగాకులారా,
చెంతకు రాకండి; మీరంతం గాకండి ...... పోపొండి॥

ఒంటికి మంటికి ఒకటే ధారగ
చెమటలు కార్చేమూ, మేము, శ్రమముల కోర్చేమూ, 
యింటిలిపాదిన కంటికి రెప్పై
కాచుకు పెంచాం మాపంట...... పోపొండి!!

వసంత్:
ఎండనకుండా వాననకుండా
కండలు కరిగే కష్టంచేసి
పండించే మిది మా పంట
దండుగ తిండికి రాకండి...... పోపొండి!!

అంతా:
మట్టిని మట్టయి, చెట్టుల చెట్టయి
పుట్టా మిక్కడ పెరిగాము (మేము) 
గట్టిగ నాగలి పట్టి చేలతో...
పెట్టే మమ్మకు హారాలూ
కట్టే మమ్మకు జోహర్లు...... పోపొండి!!

శాంత:
వారి ధర్మమున వీరి ధర్మమున
ఊరక తిని తిని తెగ బలిసి
బోరలు విరుచుకు బారు బారులై
తేరగ పైబడి తింటారా...... పోపొండి ॥

శశి:
ఆయాసంలో, వుల్లాసంలో
అమ్మకు మేమే మాకీ యమ్మే
అమ్మా యంటే ఆనందంతో
'ఆ' యని పలుకును మా భూమి
మా భూమి, మా భూమి.

మా భూమి, మా భూమి.
ఓం, ధూం ధాం కర్లే పాట సాహిత్యం

 
లప్పాం-టప్పాం

ఓం, ధూం ధాం కర్లే
గటా మహటమే, చందబిగంగా 
సర్పరాజ, సజ్జన్కు మాల 
గలేమె గంటా, బలేభంగ్ సఖి
భం భం భం భం బాహు ఛడావె
తహల్జమారే, ఏక జ్ఞానకర్ 
కేచరి వూచరి, కేల్కిబర్ మా 
కన్ కన్ కన్కన్ కజే సన్ముకీ 
మం మం మం మం మంత్ర తంత్రకే 
గజలక్ష్మీ ఓ గంటాలక్ష్మీ
కాంచన లంకా తీన్ తీన్ కే 
ఆవుర్ సునోరే, రంగమాలమే
రహత్ బనాకే, డీలె మాడపే 
బడే మాడపే, తడీయవాలి, బడేయవాలి 
వాగో లీగో జపలత్తారో 
ధామ్ ధూమ్ , మేఘ గర్జనీ
కచిబిచి గంటా, కనుమన సూరే
ఆగడ్డమ్ లగడ్డమ్
ధామ్ ధూమ్ కరొ, దడర్ దడాకే, నౌబల్కా నా 
రామా మారే, రాక్షసి మగ్గయి, రావణ మగ్గయి
లంకలొ జనము డొంకలు పట్టిరి
డొంకలొ జనము లంకలు పట్టిరి. 
లంక లూటుకరొ లంగరు బైటో 
ఏమి జన్మము ఏమి జీవనము 
ఏమి మీ ప్రారబ్ద కర్మము 
సామి మమ్మిటు చేసి మరచెను
సాధకము సాధకము అని మము
సావగొట్టి సెవులు మూస్తే
యీ జన్మమిక దుర్లభమురా
సాజన్మ సాకారా సద్గురునీ కనరో......
పల్లె సీమలె అందమోయీ! పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జిక్కి

శాంత:

పల్లె సీమలె అందమోయీ!
ఆనంద మోయీ! ఓయి !
పల్లె జీవిత మెంతో హాయీ !... ప ల్లె ||

నుదుట కుంకుమ రేఖ.
చుట్టు చెంగవి కోక,
నీటి కడవతో రాక పోక.
పల్లె పడుచుల కందమోయీ ! ఓయి !
పల్లె జీవిత మెంతో హాయీ !

పచ్చని పసిడి చేల పైరుల అందమే
రైతు కానందము, ఆనందము
చిరు మువ్వల సడి చేసెడి గోవుల అందమే
గోపాలుర కానందము,
నీలాటి రేవునుండి నీరుగొని తెచ్చుటే
పడుచుల కానందము, ఆనందము

మాదేవి సేవలతో
గోదేవి పూజలతో
కల్లా కపటము లేని
చల్లాని జీవితము..

# పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల

వసంత్:

శాంత వంటి పిల్ల లేదోయి, లేదోయి,
జగమంత వెదకిన లేదోయి, లేదోయి,
మనసు మెత్తని వెన్న
గుణము లన్నిటి మిన్న
గర్వ మన్న సున్న
కలికి రూపము గన్న ...... శాంత॥

ముక్కు సూటగు మాట
న్యాయ మందు బలాట
చెక్కు చెదరని ఆట పాట
నిజము, ముద్దుల మూట...... శాంత॥ఏతం పాట పాట సాహిత్యం

 
ఏతం పాట 
జయంత్, శాంత, & లప్పాం

బారవేయ్, జోరుగా, జోరుగా
నీతోనే ఏతాము శృతి కలిపి పాడాలి, పాట పాడాలి
పాటతో కష్టాలు గోట మీటాలి మాటు మణగాలి
ఓ......
జోరుగా నడవాలి బారవేయాలి 
నీరుబ్బి పొలమంత నిండి పోవాలి 
ఏతాము మహిమం టే యింతింత కాదే, 
పాతాళ గంగ నే చేతి కిస్తాదే.......

రాముడేతామెక్కి రాగాలు పాడ
సీతమ్మ గడమరచి సిగ్గుతో చూడ
దేవతలె కనుగీటి తై తక్కలాడ.
పొలము పక్కున నవ్వె పెరులతోడ ...... నీతోనే ఏతాము ॥

లోతు గుండెలలోని
ప్రేమ, రాగాలన్నీ
ప్రేమ భావాలన్నీ 
ప్రీతితో పైకుబికి పాట పాడాలి....నీతోనే ఏతాము ॥
విజయోత్సవ నృత్యం పాట సాహిత్యం

 
విజయోత్సవ నృత్యం 

నా జబ్బ సత్తువ చూచేవా
నా దెబ్బ లాటగాని వుబ్బేవా 
ఓ కులికే దానా, పలికే దానా
రావే నా దానా, ఆహా, రావే నెరజాణ!

జబ్బ సత్తువ దిబ్బరొట్టి దిగ మింగ డానికేనా ! 
నన్నుబ్బ వేయ నీ యబ్బతరమ, నీకు లొంగేదాన్ని నేనా ! నేనా! 
ఓ కూసేవాడా, మేసే వాడా, పోరా మొనగాడా కోతలు కోయకు మొగ గాడా

ఊదరా ! ఊదరా !
విజయ శంఖ మూదరా !
పల్లె చెరచువారు దేశ ద్రోహులంచు చాటరా !
పల్లెటూరు దేశానికి పట్టు గొమ్మరా ! 
పల్లెముందు పట్నమన్న దిష్టి బొమ్మరా !

ఒకరి జోలికే పోమే, మా జోలికి రానేలా ! 
పూవువంటి పల్లెటూరు పులిని సేయనెలా ! 
భరత మాత బాగోగులు పల్లె వల్ల నే వినుమ ! 
పల్లెపండ దేశమాత పక్కున నవ్వును కనుమ !
కోకి లెరుగు మా పాట
చిలుక లెరుగు మా మాట
మాయా మర్మము లేని మనసులు మంచి నీళ్ళ తేట ...
ఉగ్గు & జోలపాట పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: జిక్కి

ఉగ్గు & జోలపాట 
శశి & శాంత

చిన్నారి పాపాయి ! చిట్టి పాపాయి !
చిన్ని నవ్వుల ముద్దుగున్న, రావోయి 
ఉగ్గులమ్మ ఉగ్గులు చాయ చాయ బుగ్గలు 
సంపంగి మొగ్గలు నీలాల నిగ్గులు. 
ఓ... లాలమ్మ లాలా !
ఓ లో లాలా ! లాలా !

పాల సంద్రము పైన బాల చంద్రుడి లాగ 
పవళించు నా తండ్రి పాట పాడెదను..
కలువ రేకుల వంటి కను లింత మూయరా !
కమ్మని కలలెన్నొ కనిపించు చాలా..
జో... జో... జో... జో
ఒద్దుర బాబోయి పెళ్లి వొద్దుర పాట సాహిత్యం

 
చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)
సంగీతం: పి.ఆదినారాయణ
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం

లప్పాం-టప్పాం & శాంత 

ఒద్దుర బాబోయి పెళ్లి వొద్దుర నాయనోయ్ 
పెళ్లా మొద్దుర తండ్రోయ్ ! 
ఎద్దు మంచ మెక్కినట్లు గుద్దులాడు కోవాలి
హద్దు పద్దులేక మెదడు మొద్దు బారి పోతాది. 

సొగసు లెన్నొ జరిగిపోయె సగం ప్రేమ సాగిపోయె
ఒద్దంటే యిప్పుడెలాగోయ్...... ఓయ్ గురువా ! 
కాదంటే యిప్పుడెలాగోయ్

మెత్త మెత్త గొస్తాది నెత్తి మీది కెక్కుతాది
అటు కదలిన, యిటు కదలిన
'ఆ ' అన్నా 'ఊ' అన్నా,
హాతైరి నీ యబ్బాయని
తుత్తు రేగ మొత్తుతాది... ఒద్దుర

ఓ... చేతగాని గురువా ఓ కోతి మూతి శిష్యా 
ఒద్దంటా డొకడు, కావాలంటా డొకడు,
వద్దన్నా రమ్మన్నా వచ్చే ఆడదేది రోయ్, 
నువ్వేనోయ్.
అంత చచ్చు ముండ లేదురోయ్ 
సొగసు చూచి వస్తాదా ! 
నీ తెగువ చూసి వస్తాదా ! 
సిగ్గులేని మొఖాలార
చెంప వేసుకొండిరోయ్ 
చెప్పకుండ పొండిరోయ్ !
గ్రుడ్డి వాడు పాట సాహిత్యం

 
గ్రుడ్డి వాడు

కళ్ళులేని కబోదిని
కడుపు మంటతో మొర్రో అంటే
కనబడ లేదా రామా
వినబడనే లేదా ఓ రామా ... 
కని కర మింకా రాదా రామా 
కని పెట్టున్నా రామా 
కళ్ళులేని యీ కబోదిలాగా
ఎన్నాళ్లుందును ఓ రామా !...
బలవంత మైన సరపము పాట సాహిత్యం

 
లప్పాం

బలవంత మైన సరపము 
సలి సీమల సేత సిక్కే 
గదరా, పదరా
నీ జాతరా పడతాము పదరా
గదరా, పదరా, తధి గిణత....


No comments

Most Recent

Default