Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Saakshyam (2018)




చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నటీనటులు: సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: అభిషేక్ నామ
విడుదల తేది: 27.07.2018



Songs List:



Design Your Destiny పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షవర్ధన్ రామేశ్వర్, హరిచరణ్,  జితిన్ రాజ్

Design Your Destiny



ఇష్క్ కర్లె పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరణ్, యదు కృష్ణన్, జనని 

ఇష్క్ కర్లె



సౌందర్యలహరీ పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జితిన్ రాజ్, ఆర్తి

లహరీ లహరీ లహరీ లహరీ
ఓ క్యూటు క్యూటు క్యూటుగా
మాటలాడుతుంటె నువ్వలా
కోటి సింఫనీలనే విన్న ఫీలు
నాకు వస్తదే మరీ
ఓ స్వీటు స్వీటు స్వీటూగా
స్మైలు చిందుతోంటె నువ్వలా
హార్టు లోపలెక్కడో ఉన్న హాయి
పైకి తంతదే మరి

కసిరే కళ్ళతో నువ్వు పోట్లాడితే
సరదాగ తోచినాదె ఆ మెమొరీ
ఓణీ అంచుతో నువ్వలా తాకితే
ఒకలాంటి కైపు రేపుతుంది మరీ

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి.

I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
Vandhanam baby
I can't move my eyes on you
my cutie baby
i really falling for you crazy
you my honey

గుండెలో ఏదో గాయమైందే
కారణం నువ్వే అంటూ ఉందే
నువ్వు పంచుతున్నా తీపి ముందు
ఎంత గాయమైన చిన్నదే

ఆఆఆ వదలమంటూనే వదులుకోలేని
గొడవలా ఉందోయ్ నాకు నీతో
విసుగుకుంటూనే విడిచి పోలేని
మాయదారి కర్మమేమిటో

విసుగో కోపమో ఏదైనా సరే
నువ్వు చూపుతోంటే సైతుగుంది మరి
చాలా మందిలో నీలా ఎవ్వరే
నువ్వు లైఫులోన పేద్ద డిస్కవరీ  

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి

పమ గమ రీ దప మగ మ రీ గమ ప
నిసరి గమప మదద నిసరీరి 
పమ రిగరిస నిరి స నిస దపమ దని 
సస పప రిరి నిసరి గమ పమ ఆఆఆఆ
 
I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
Vandhanam baby

వందనం రఘు నందనా...




దంగ్ దంగ్ దంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: పద్మలత, మానసి, అనంతు 

దంగ్ దంగ్ దంగ్



శివం శివం పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.జే.ఏసుదాస్, యస్.పి.బాలు, హరిహరన్, కైలాష్ కెహెర్, బోంబే జయశ్రీ

పంచభూత హిత గాత్రమిదే-పంచభూత కృత క్షేత్రమిదే
పంచభూత హిత గాత్రమిదే-పంచభూత కృత క్షేత్రమిదే 
సాక్ష్యం జరిగే ప్రతి చర్యకి 
సాక్ష్యం చేసే ప్రతి ఖర్మకి 
సత్యం అసత్యాలకి విదితం రహస్యాలకి
అన్నిటి కన్నిటి  కన్నిటికున్నది సాక్ష్యం 

శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచ భూతేశ్వరం 
అనాథేశ్వరం ఆదీశ్వరం స్వర్వకాలేశ్వరం  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
పంచభూతాల సాక్షిగా 
పంచభూతేషు సాక్షిగా 
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

శబ్ద గుణకం ఆకాశం, విశ్వ జనకం ఆకాశం 
సకల కధనాన్ని సాక్షిగ వీక్షించే 
అనంత నయనం ఆకాశం 
అనంత నయనం ఆకాశం
యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా 
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
సాక్ష్యం.. విశాల గగనం
నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

భవమానాసుతం భక్తజననుతం   
శ్రీరామ ధూతం మారుతిం 
నమతు రాక్షసాంతకం
వాయుపుత్రం వాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం దీప్రదాయం ఆంజనేయం  
వాయువుతోనే ఆయువు ఆరంభం 
వాయువుతోనే ఆయువు అంతం 
నడుమన గడిచేదే నరుని జీవితం 
అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం 
చిరు చిరు చిరు చిరు చిరుగాలై
నీకూపిరి పోసిన చేతితో 
సుడి సుడి సుడి సుడిగాలై
ఆ ఊపిరి తీస్తది కాచుకో 
గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో
వాయుపుత్రం వాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం దీప్రదాయం ఆంజనేయం 
ఝంఝా మారుత గమనం-పాదద్వయ చలనం 
వింధ్యా మేరు ప్రకంపనం-విధ్వంసాన్విత రచనం
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం  
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

ఓం అగ్నిర్వా అపామాయతనం 
ఆపోవా అగ్నేరాయతనం 
అగ్ని నీడే పురోహితం-యజ్జ్ఞస్య దేవ మృత్విజం 
యోధారం రత్న ధాతామం
అగ్ని దేవం నమామ్యహం 
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం..నమామ్యహం 
అమ్మ ఒడిలోని వెచ్చదనం అగ్ని ప్రేమకది చిహ్నం 
అయ్య కళ్ళలో కాంతి కణం అగ్ని కరుణకది చిహ్నం 
ప్రేమ కరుణని దూరం చేసిన ధూర్తునిపై 
ధూర్జటి ఫాల నేత్రజ్వాల విరుచుకు పడదా తక్షణం 
చిటపట చిటపట చలిమంటై
చిరచిర చిరచిర చితిమంటై
భగభగ భగభగ భగభగమని నిను
భస్మం చేయును కాచుకో
మంటలో కలిసిపో మంటలో కలిసిపో 
కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుమ్ 
కైలాసేష కేశయం విభుమ్ 
రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం 
వీరాగ్రహ ధృగ్వీక్షణం విధ్యుత్గ్రహ విస్ఫోటనం 
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!    
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

తత్ర గంగవతి పృథివి-నిత్య సహనవతి పృథివి
స్వచ్ఛ ప్రేమవతి పృథివి-స్థైర్య శక్తిమతి పృథివి
వందేహం... పృథ్వి మాతరం
బుడి బుడి అడుగుతో మొదలై ఎన్నడుగులేసినా  
భూమిలో ఆరడుగులేరా శాశ్వతం 
మణులను గనులను వలచి ఎంతెంత తవ్వినా 
మన్నులో కలిపేందుకే నువ్వంకితం
దేనికోసం ఆరాటం మరి దేనికోసమీ అరాచకం   
నిన్ను మోసే నేలతోనే ఆడకెప్పుడూ పరాచకం 
జననిగ తనయుని లాలించే ఆ వెచ్చటి మెత్తటి చేతితో 
గడగడ గడగడ లాడించే భూకంపం తెస్తది కాసుకో
మట్టిలో కలిసిపో మట్టిలో కలిసిపో 
వందేహం పృథ్వి మాతరం 
వంఛిత పీడిత యుద్ధ క్షేత్రం 
దుర్జన భంజన మారణాస్త్రం
మౌనం సమర శంఖం 
కర్తవ్యం ఖననం  
సాక్ష్యం.. విశాల గగనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

గంగేచ యమునేచైవౌ గోదావరీ సరస్వతిమ్
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు 
జలేస్మిన్ సన్నిధింకురు
దాహం తీర్చే నీరే ప్రాణం తీసే ఏరై 
ముంచుకు వస్తే ఎవ్వరాపగలరు
చినుకంతే అయినా మనసున్నోడి కన్నీరు 
సృష్థిస్తోందదిగో సుడిగుండాల మున్నేరు
జలజల జలజల జలన్ జలన్ జల
జలజల జలన్ జలన్ జల జలవిలయం 
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ 
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ పెనుప్రళయం 
చుట్టుముట్టి నిను తుదముట్టిస్తది కాచుకో 
గంగలో కలిసిపో 
తధీంతధీంత తకిట ధీంతనం 
తరంగ లాస్య జలధి నర్తనం
తోంతధీంధీంత తోంతతజ్జణం
అంబుధి కంట సింహ ఘర్జనం
తధీంతోం తకిట తోంతనం
అవశ్యం ధనుజ మర్దనం 
సాక్ష్యం.. విశాల గగనం
తధ్యం శత్రు మరణం తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం

నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పినా 
అయిదో దిక్కొకటున్నది.. పైనా..!
అది చూస్తున్నది నువ్వేమి చేసినా..!!  
పంచభూతాల సాక్షిగా 
పంచభూతేషు సాక్షిగా 
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం-శివం శివం భవ హరం హరం




చెలియా చూడే పాట సాహిత్యం

 
చిత్రం: సాక్ష్యం (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హర్షవర్ధన్ రామేశ్వర్, మధుప్రియ 

చెలియా చూడే 

No comments

Most Recent

Default