Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kaali (1980)




చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి (All)
నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, సీమా, ఫటా ఫట్ జయలక్ష్మి, శుభ
దర్శకత్వం: ఐ.వి.శశి
నిర్మాత: హేమ నాగ్
విడుదల తేది: 03.07.1980

( గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ చిత్రంలో పాటలు రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి )





Songs List:



గుడిలోన దీపాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు

పల్లవి: 
గుడిలోని దీపాలు
ఆనందరూపాలు
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు

చరణం: 1
కనులే మురిసే కమనీయ శిల్పాలు
ఎదలో విరిసే చిరునవ్వులు
అనురాగ బంధాలు నానా ఆశయ సౌధాలు
ఈ పిల్లలే నా జీవితం, నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికే ప్రతిబింబాలు

చరణం: 2
దైవం పలికే అపురూప రాగాలు
కాలం పూచే సిరిమల్లెలు
మీ ఆటపాటలలో
తీరేను వేదనలు
ఈ పిల్లలే నా జీవితం, నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికి ప్రతిబింబాలు

వంశం నిలిపే వారసులు
మన భావి నాయకులు మన జాతి సారథులు
ఈ పిల్లలే నా జీవితం నే కోరుకున్న కాయితం
పిల్లలు దైవానికి ప్రతిబింబాలు

గుడిలోని దీపాలు
ఆనందరూపాలు




అనగనగా పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: పి. సుశీల

పల్లవి:
అనగనగా పిలగాడు
అందరిలో మొనగాడు
అమ్మాయి మనసొకటే
అయ్యయ్యో కనలేడు

చరణం: 1
మాటలతో గారడిచెయ్యి
ఆపై నన్ను వలలో వెయ్యి
నా వయసే గులాబిపువ్వు
విసిరేస్తా ఎందుకు నువ్వు
నీ ఎదుట చెలివుంది
చొరవుంటే నీదవుతుంది

చరణం: 2
గోదారీ పొంగుతుంది
కుర్రాడికి దాహంకాదా
నా పరువం కవ్విస్తుంది.
గుండెల్లో మోహంలేదా
రమ్మంటే రావేమీ
నీ మూతికి మీసం వుందా..?
చూచేవుంటే మాటేవింటే
నీ సొమ్ము పోతుందా ?

అనగనగా పిలగాడు
అన్నిటిలో మొనగాడు
అమ్మాయి మనసొకటే
అయ్యయ్యో కనలేడు




న్యాయమైన దారిలోన పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు

న్యాయమైన దారిలోన
సాగిపోదాం పదరా నాన్న
మంచి చేయాలి పదిమంది మెచ్చాలి
మంచి చేయాలి పదిమంది మెచ్చాలి.
పుణ్యంచే స్తే ఎప్పటికై నా
ఫలితం వుందిరా
పాపంచేస్తే నీడగ నిన్నే వెంటాడేనురా

చరణం: 1
కాలం అనుకూలమైననాడు మంచి జరుగును
విధి ఎదురైన ఎవరైన పాడవునురా లే బాగావుండాలి
ఏ శుక్రుడో, ఏ రాహుచో, శనిదేవుడో
ధర్మం కావగా హరిదాల్చే అవతారం
న్యాయం కాచుట మాకిక వ్యాపారం
చేద్దాం జాతికి వుపకారం
ఏనాటికి, ముమ్మాటికి, మన ధాటికి
రావణులు, కీచకులు గడగడలాడ

చరణం: 2
ఎన్నో జన్మల అనుబంధం మా స్నేహం
ఇలలో ఎన్నడు విడిపోని సంబంధం
వరమేకాదు మా స్నేహం
కష్టాలలో, నష్టాలలో, సౌఖ్యాలలో
ఇద్దరమూ ఒక్కటిగా సర్దుకుపోవాలి




భద్రకాళి చందన శీలి పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్. జానకి 

పల్లవి: 
భద్రకాళీ ఛండనశీలి - భీకర భయదకరాశీ
నీ మానసవీ నెలవాడు
ఉగ్ర తాండవమాడు

చరణం: 1
లోకములు గాచుటకై అవతరించి..
రాక్షసుల నెందరినో పరిహరించారంట
ఏదీ తల్లీ ఆ తేజం, నువ్వెక్కండవు వుత్తేజం
లోకములు గాచుటకై అవతరించావంట
రాక్షసుల నెందరినో సంహరించావంట
నమ్ముకున్నవారం - మేమంతా నీవారం
నీదయ రానివ్వు నీ శక్తి మాకివ్వు
తల్లి కాళీ కాళీ ....

నీ మవునమ్ వీడు
ఉగ్ర తాండవమాడు
వంచన రాజ్యం చేస్తుంటే
మంచికి గోరీ కడతుంటే 
దేశాన్ని దోచుకునే ద్రోహులే వున్నారు
దీనులను ఘోరంగా హింసపెడుతున్నారు.
ఊరుకుంటేకాదు చూసుంటే సరిపోదు 
వూరుకుంటే కాదు చూసుంటే సరిపోదు

నీచుల్ని పట్టాలి - చీల్చి చండాడాలి.
పీడించు వాడెవడూ ప్రాణంతో మసలేడా
పేదాడు ఎగబడితే వీరభద్రుడు కాకపోడు
నింగిని నేలకు తెప్పిస్తాడు
కక్షను అంతే చూసారు
గాయపడ్డ సర్పం
చూపించు దాని దర్పం
నా భక్తి నా శక్తి నా నీతి నా కత్తి
నీ మవునమే వీడు
వుగ్ర తాండవమాడు




బేబీ షేక్ ఇట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: కాళీ (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

బేబీ షేక్ ఇట్ బేబీ 

No comments

Most Recent

Default