Search Box

MUSICAL HUNGAMA

Idam Jagath (2018)చిత్రం: ఇదం జగత్ (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రవిప్రకాష్ చోడిమాల, యామిని గంటసాల
నటినటులు: సుమంత్, అంజు కురియాన్
దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం
నిర్మాత: శ్రీధర్ గంగపట్నం, జొన్నలగడ్డ పద్మావతి
విడుదల తేది: 28.12.2018

దూరాలే కొంచం కొంచం 
దూరాలే అవుతున్నట్టు
దారాలే అల్లేస్తున్నా స్నేహాలేవో
గారాలే కొంచం కొంచం 
నీ మీదే వాలేటట్టు
గాలేదో మల్లిస్తున్నా ఇష్టాలేవో
కనులే ఇలా కసిరేంతల
కలవాలనే కలలే ఇవా
అలవోకగ అలవాటులో
అనుకోనిదే అవుతోందిలా

మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందా

కొంగొత్తగా మెదిలే ఓ వెలుగే
నీ వల్లనే కలిగే
నువ్వుండంగా దిగులే ఉండదులే
నవ్వుల్లోనే మునిగే
ఇంతలా తెలిసావనే
గమనించనైనా లేదులే

గడియారమే పరుగాపదే
గడచెనులే ఘడియే ఇలా
నిను చూడగా సరిపోదుగా
ఈ మరి మరి కోరే ప్రణయమా
కలవాలనే కదిలే ఇలా
కలిసిందిలే కల నేరుగా
కనుకే ఇలా కథ మారగా
కలిపిందిలే కాలం కదా

మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందాNo comments

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0