చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2000
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
1 comment
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లె రా రామ్మనది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని
పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసి పాప నవ్వుల్ని చూడనీ
తోడు నీడ నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి ఋణముందో అదగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదలని
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
ఇదుగో నువ్వే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వారమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్న
వరస కానీ బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదనీ
నేకు సొంతం అంటే నేనేనని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లె రా రామ్మనది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని
Post a Comment