Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shiva Shankar (2004)





చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య, నతాన్య సింగ్ 
దర్శకత్వం: కాపుగంటి రాజేంద్ర
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 18.08.2004



Songs List:



జాబిలమ్మ ఊగుతున్నది.. పాట సాహిత్యం

 
చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు, శ్రేయా ఘోషల్

శ్లోకం:
ప్రేమార్థ హృదయాయ ప్రేమ వృత దీక్షాయ
ప్రేమామృత రుపాయ ప్రేమేశ్వర పుత్రాయ
ప్రేమే అతి రమ్యం మమగమ్యం మమసర్వం ప్రియుడా...

పల్లవి:
జాబిలమ్మ ఊగుతున్నది.. 
వెండి మేఘాల ఉయ్యాలలో
సిగ్గు మొగ్గ విచ్చుకున్నది.. 
కసి కౌగిళ్ళ సంకెళ్ళలో

గుండెల్లో... ఆశలన్నీ 
గుండెల్లో ఆశలన్నీ.. 
తీరేది ఏ వేళలో..

ధినక్ దిన్ రామచిలకతో
చమక్ చమ్ కలిసినప్పుడే
కుచకునక్ తేనె పెదవిని
కసక్ తాం కొరికినప్పుడే

చరణం 1
చూసి చురకమల్లే సోకే మెరుపుమల్లె
తాకిందే మందారమా...
నిన్నే తలచుకుంటూ ఎన్నో కలలుగంటూ
వేచాను నా ప్రాణమా...
ఏదో గుబులు పడి ఎంతో మదనపడి
నీ చెంత చేరానమ్మా...
ఈడే ఉలికిపడి వేడే ఉబికుబికి 
వచ్చాను ఓ నేస్తమా...
హత్తుకో చెలియా చెలియా అన్నదే పరువం
ఎదుటనే ప్రియుడా ప్రియుడా ఉందిగా స్వర్గం
అందమే విందుగా అందుకొనరా

చరణం: 2
నీలో మగసిరుంది నాలో బిడియముంది
ఆ రెండు కలిసేదెలా...
నాలో మదనుడుకి నీలో సొగసులను
అందిస్తే చాలే పిల్లా...
రైకే బిగుసుకుంది నడుమే ఒరుసుకుంది
ఏమౌనో నవమోహన...
పూజే మొదలుపెట్టి స్వర్గం ఎదుటపెట్టి
చెయ్యాలే ఆరాధనా...
పూటకో పుష్పం పత్రం నీకు చదివిస్తే
ప్రేమగా నీలో సగమై నిన్ను అలరిస్తే
కాలమే కౌగిలై కరిగిపోదా...




కృష్ణా నువ్వు రాకు పాట సాహిత్యం

 
చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హరిహరణ్, శ్రేయా ఘోషల్

పల్లవి:
కృష్ణా నువ్వు రాకు ఈ వేళ
రాధా జాలైనా లేదేలా
రాతిరి ఇంకా కానేలేదు..
పిల్లలు నిదుర పోనేలేదు

డాడీ..
ఆ డాడీయా..
ఇక్కడేం జరగలేదు నాన్న 
నువ్వు పడుకో నువ్వు పడుకో
పాసుకు డాడీ
పా.. పాసు.. ఆ... అలాగే.. అలాగే.. తీసుకెళ్తాను
నాన్న నీతో పాటు మీ అన్నని కూడా లేపు 
ఇద్దర్ని తీసుకెళ్తాను
ఈ రోజు పస్తే..
నవ్వకు నవ్వకు.. కాల్తంది.. కాల్తంది
ఏంటి నాన్నా

పడతి సొగసు చూడగానే 
మనసు చెదిరి పోయెలే
ఇంటి పనులు చేసి చేసి
తనువు అలసి సోయరా
మగని వడిలో చేరగానే
అలుపు తీరి పోవులే
తమరి మాట తమరు గాని
ఎవరు మాట వినరులే
తాళలేక అడుగుతుంటే 
ఆడవారికి అలుసులే

చరణం 1
సరి సరి..
హే హే హే.. సరి సరి అని అన్నావే సరి సరి
ఊం.. దుంత దుంత.. దుందుం 
దగ దగ దుంత దుంత దుమ్
నీ పని సరి.. నీ పని సరి..
సరి సిరి.. సరి మా మరి..మరి ఏంటిది?
ఏంటి.. ఏంటి.. ఏంటిది?
మంచి శకునం.. పని తప్పకుండా జరుగుతుంది...

చరణం: 2
తలుపు గడియ వేయగానే తెలిసీ తమరి తాపమే
పైట కొంగు జారగానే పెరిగిపోదా మోహమే
పాపం పోనీ అన్నానంటే రాతిరంతా జాతరే
మనసుపడి నీ దరికి వస్తే ఎన్ని ఎన్ని సాకులే
అలుక చూపి గెలుచుకొనటం మీకు అలవాటే కదా




నేనేమి చేతునో పాట సాహిత్యం

 
చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మాలతి, ఆనంద్

పల్లవి
టనాన టంక్ ఛలో  టనాన టంక్ ఛలో
టనాన టంక్ ఛలోన
నేనేమి చేతునో టంక్ ఛలోన
నేనెందుకు పోతునో టంక్ ఛలోన
బుర బుర బుర నా భూమి.. టంక్ ఛలోన
బుస బుస బుస పొంగుతుంది టంక్ ఛలోన

తెల్ల జొన్నలు చల్లాలన్నా నల్లరేగడిపండాల
కళ్ళు చెదిరిపోవాలన్నా కల్లం మొత్తం నిండాల
హే.. దన్నోచ్చినోళ్ళుంటే టంక్ ఛలోన
కౌలు కిచ్చేస్తా నా బీడు టంక్ ఛలోన

చరణం 1
నల్ల రేగు ముళ్ళకంప ముదిరిపోయి ఉన్నదబ్బా
ఒళ్ళు వంచి శుబ్బరంగా చదును చేసుకోవాలబ్బా
మలుపుల తొవ్వలో గిలి గిలి పెరిగితే 
టంటంటం.. టంక్ ఛలో
కనులకు నిండుగా కనబడుతుందిరో 
టంటంటం.. టంక్ ఛలో
మోతుబారి రైతు కావాలి నాకు
చేతకాక పోతే చప్పండి మీరూ
ఏ.. టనా టనా టనా టనా టంక్ ఛలోనా

తెల్ల జొన్నలు చల్లాలన్నా నల్లరేగడి పండాల
కళ్ళు చెదిరి పోవాలన్నా కల్లం మొత్తం నిండాల

చరణం: 2
చీర మడత నలగకుండా పంచలోనే వుండేదాన్ని
సాగు చేసే వాని కొరకు గడప దాటి వచ్చానబ్బా
హే.. హే.. 
ముడుపులు కట్టినా మలుపులు కొలిచినా
టంటంటం.. టంక్ ఛలో
బెజవాడెల్లినా వైజాగొచ్చినా
టంటంటం.. టంక్ ఛలో
జారిపోతే మళ్ళీ రానయ్యో నేను
జావగారిపోతే నేనొప్పుకోని

తెల్ల జొన్నలు చల్లేస్తా నీ నల్ల రేగడి పండిస్తా
కళ్ళు చెదిరిపోయేలా నీ కల్లం మొత్తం నింపేస్తా
చక చక చక నీ భూమి టంక్ ఛలోనా
గజ గజ గజ దున్నేస్తా టంక్ ఛలోనా
హోయ్ ఒక్కసారి సాగు చేస్తే టంక్ ఛలోనా
ఇక ఒదిలెయ్యవు నా దోస్తీ టంక్ ఛలోనా



ఏందిరయ్యో ఎందోరయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: భువన చంద్ర
గానం: టిప్పు, స్వర్ణలత

పల్లవి:
ఏందిరయ్యో ఎందోరయ్యో జివ్వుమంది ఈడు
నిదురేమో రాక తెల్లవార్లూ ఆడుతుంది చూడూ
రా రమ్మంటే రావాయే నే వస్తానన్నా వినవాయే
కోకా రైకా బరువాయే అది చెప్పాలన్నా సిగ్గాయే
చలి చీమ కుట్టేసింది కౌగిలి ఆటకు వేళాయే

చరణం: 1
చిలిపి వంపుల్లో చలిగాలి దూరింది
హాయ్ నడుమే నాగినిలా తుళ్ళి తుళ్ళి ఊగింది
వలపే గుండెల్లో వరదల్లే పొంగింది
హోయ్ సిలుకు దుప్పటిలో సెగలేవో రేపింది
ప్రియుడా రమ్మని పిలిచే నీ చెలి
జతగా తీరని పరువపు ఆకలి
వేశా పూల మంచమే ఇక తీరాలంటే తాపమే
అవునే పిల్లో... అవునే పిల్లో 
అవునే బుల్లో... చేరుకోవే జోడు
కసివయసులోనే ఉండాలంటా ఆడకి మగతోడు

చరణం: 2
మిసిమి బుగ్గల్లో నిగనిగలే చూడాలి
హోయ్ కసితో వణుకుతున్న సొగసుల పస తేలాలే
ఉబితే అందంతో ఉల్లాసంగా ఆడుకో
హోయ్ బిగిసే కౌగిలిలో తహతహలే తీర్చుకో
చెలియా కాసుకో.. హోయ్.. పొగరే చూసుకో
తలుపే తీసుకో హోయ్ వలపే దోచుకో
చెయ్యాలంటా జాతరే శివమెత్తాలంట రాతిరే




నీటిమీది కాగితాల పాట సాహిత్యం

 
చిత్రం: శివ్ శంకర్ (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: గురుచరన్
గానం: హరిహరణ్

పల్లవి:
నీటిమీది కాగితాల కావ్యాలెన్నో
ఎద సొదలెన్నెన్నో
రాసినోడు ఎవరు ఏ మూగదేవుడో
అమ్మ రొమ్మునుండి విడదీసినాడురో
వీధిపాలు అయిన మనుజునీ కథరా

నీటిమీది కాగితాల కావ్వాలెనో
ఎద సొదలెన్నెన్నో

చరణం: 1
నీడ లేదులే ఏ గూడు లేదులే
అతుకుల బతుకులో మెతుకు కరువులే
కారు చీకటే నను బాటసారిలా 
వెలుగుకే వెలితిగా తరిమివేసెలే
ఏ దారి కానరాక ఏకాకిగా ఉండగా
కొండంత కరుణ చూపి కాపాడిన వేళలో
మంచని, చెడు అని నాకు తెలియదు

నీటిమీది కాగితాల కావ్వాలెనో
ఎద సొదలెన్నెన్నో

చరణం: 2
సొంతమన్నది మనకేది చెప్పరా
వుందని లేదని ఎంత మాయరా
గాలిపటమును ఒక పూల తీగతో 
కలిపిన ఫలితమే కన్న తల్లిరా
కన్నంత కడుపు తీపి చూపించిన తండ్రిని
ఏనాడు కానరాని దేవుడితో పోల్చను
చేసిన మేలును మరువలేనురా

నీటిమీది కాగితాల కావ్వాలెనో
ఎద సొదలెన్నెన్నో

No comments

Most Recent

Default