Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Priyaragalu (1997)


చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
నటీనటులు: జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి
దర్శకత్వం: కోదండరామిరెడ్డి
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 21.19.1997Songs List:చిన్న చిరుచిరు నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: చిత్ర

చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా 
నా ప్రేమ పోతపోసి కన్నానురా 
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా 
నీలో ఉన్నా నీతో ఉన్నా 

అటు చూడు అందాల రామచిలకని 
చూస్తోంది నిన్నేదో అడుగుదామని 
నీ పలుకు తనకి నేర్పవ అని 
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లని 
పడుతోంది లేస్తోంది ఎందుకోమరి 
నీలాగ పరుగు చూపుదామని 
కరిగిపోని నా తీపి కలలని 
తిరిగిరాని నా చిన్నతనముని 
నీ రూపంలో చూస్తూ ఉన్నా

తూనిగా నీలాగ ఎగరలేదుర 
అ తువ్వాయి నీలాగ గెంతలేదుర 
ఈ పరుగు ఇంకా ఎంతసేపుర 
ఈ అట ఈ పూట ఇంక చాలుర 
నా గారాల మారాజ కాస్త అగర 
నీ వెంట నేను సాగలేనురా 
ఎంతవెతికిన దొరకనంతగా 
ఎంత పిలిచినా పలకనంతగా 
వేల్లిపోకమ్మా... రారా కన్నా చినుకుతడి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్, చిత్ర

చినుకుతడికూనలమ్మ కూనలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాలు, చిత్ర

కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా
తేనెబొమ్మ తేనెబొమ్మా తీపి పెదవి అందనీమ్మా
ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే

చెక్కిలి అద్దమా తడి ముద్దుకు సిద్ధమా
ఏమ్మా.. ఏమో.. రామ్మా.. వామ్మో
తుంటరి నేస్తమా అంత అల్లరి ఆత్రమా
ఆశా.. ఏమో.. చూశా .. వామ్మో
నడుమెక్కి ఆడేటి జడనిక్కు చూస్తుంటే
నిలువెల్ల చలిపుట్టే చిలకమ్మా
ఈడు చెలరేగిపొతుంది చూడమ్మా
వద్దొద్దు అంటున్న ఉత్తుత్తి సిగ్గుల్ని వాటంగా దాటేసి రారాదా
వచ్చి దర్జాగ దోచేసి పోరాదా
అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే

వద్దకు చేరనా వేడి ముద్దులు కోరనా
రానా.. పోనా...
వద్దని ఆపినా వదలొద్దని ఆగినా
తగువే.. ఓహొ.. తగునా..ఆహా
మనసైన నీతోనే మనువైన నీతోనే
నా మాట నమ్మవే ఓ మైనా
నిన్ను విడిచుండలేనింక ఏమైనా
పులకింత పూవాన చిలికించు నీతోని
ముడివేసుకుంటాను నీ పైనా
నీకు ఇస్తాను అడిగింది ఏదైనా
అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే
కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా

ప్రియ వసంత గీతమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యం. యం. కీరవాణి, చిత్ర

ప్రియ వసంత గీతమారాయబారం పంపిందెవరే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో 
రురురుర్ రూరూరురు ....

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో 
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో 
కోకిలమ్మను కుయమంటూ మల్లె వీణను మీట మంటూ 
కల్యాణి రాగల వర్ణాలలో 

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో 
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో 
కోకిలమ్మను కుయమంటూ మల్లె వీణను మీట మంటూ 
కల్యాణి రాగల వర్ణాలలో 

చరణం: 1
కోయిలలో కోయిలలో కోకో కోయిల కోయోల కోయిలాలో 
నీ పాట.. తేట తేట తెనుగు పాట 
చల్లలమ్మ చద్దిముట అన్నమయ్య కీర్తనల 
ఆఆనన్ద కేలిలా ..... 

నీ పాట.. గడుసు పిల్ల జారు పైట 
గండుమల్లె పులా తోట పల్లెటూరి బృందావనాల 
సారంగా లీలలా 
చిరు మబ్బుల దుప్పటిలో ముసుగెట్టిన జాబిలిలా 
నులివెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా 
కోడికుసే వేల దాక వుంది పోతే మేలు అంటూ 
గారాల బేరాలు కానిమ్మంటూ 

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో 
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో 

చరణం: 2
కోయిలలో కోయిలలో కోకో కోయిల కోయోల కోయిలాలో 
ఉయ్యాల... ఊపిచుదు సందెవేళ పిల్లగాలి శోభానాల 
కొండనుంచి కోన వాడికి జారేటి వాగులా 
జంపాల... జమురాతిరైన వేల జాజిపూల జవ్వనాల 
జంటకోరి జానపాడే జావళి పాటల 
గోప్పెమ్మలు కళలు కనే గోవిందుని అందముల 
రేపల్లెకు ఉపిరిగా రవలించిన వేణువు చందముల 
హాయి రాగం తియ్యమంటూ మాయ చేసి వెళ్ళమంటూ 
రాగాల తానాలు కానిమ్మంటూ .... 
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో 
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో 
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో 
చిన్న చిరుచిరు నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాల

చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా 


No comments

Most Recent

Default