చిత్రం: అమ్మోరు (1995) సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి) నటీనటులు: సౌంధర్య, రమ్య కృష్ణ , సురేష్, దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: శ్యాంప్రసాద్ రెడ్డి విడుదల తేది: 23.11.1995
Songs List:
అమ్మా..అమ్మోరు తల్లో పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: రసరాజు గానం: యస్.పి.బాలు అమ్మా..అమ్మోరు తల్లో మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో ఆదిశక్తివి నువ్వేనంట అపరశక్తివి నువ్వేనంట దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట వేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు వేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంట నిన్ను నమ్మినవాళ్ళ నొములు పంటకు నారు నీరు నువ్వేనంట పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలవమ్మా జిత్తులమారి నక్కల మధ్య దిక్కేదో తోచని దీనులవమ్మా బ్రతుకు మాకు సుడిగుండం ప్రతిరోజు ఆకలిగండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా
చల్లని మా తల్లి అమ్మోరు పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: మల్లెమాల టీం గానం: చిత్ర చల్లని మా తల్లి అమ్మోరు
దండాలు దండాలు పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: మల్లెమాల టీం గానం: మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు దండాలు దండాలు
ఏమని పిలవను నేను పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: మల్లెమాల టీం గానం: చిత్ర, నాగూర్ బాబు ఏమని పిలవను నేను
కాపాడు దేవత పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: మల్లెమాల టీం గానం: వందేమాతరం శ్రీనివాస్ కాపాడు దేవత
ఎదురు తిరిగి నిలువలేక పాట సాహిత్యం
చిత్రం: అమ్మోరు సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: మల్లెమాల టీం గానం: చిత్ర ఎదురు తిరిగి నిలువలేక వేరే దిక్కేవ్వరులేక పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే ప్రళయకాల మేఘంలా పెనుతుఫాను కెరటంలా రా రా కదలిరా కదలిరా కడుపుచిచ్చు చల్లారకముందే నిప్పులచెరలో నిలేపేవమ్మా క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా రా రా కదలిరా కదలిరా ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు ఏటేటా ఈ జాతరలెందుకు ఇంక నీకు ఈ గుడిఎందుకు ఆ గోపురమెందుకు ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే దుర్గవై..చండివై..దురితవినాశంకరివై అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై చూపులెడి బాకులుగా పాపత్ముల గుండే చీల్చి పెల్లుబికిన రక్తంలో తల్లీ నువ్వు జలకమాడి సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా రా రా కదలిరా కదలిరా
No comments
Post a Comment