Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bandipotu (1988)





చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
నటినటులు: సుమన్, గౌతమి, శివ కృష్ణ, కల్పన ,పూర్ణిమ 
దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్ 
నిర్మాత: టి.ఆర్.తులసి 
విడుదల తేది: 1988



Songs List:



రారా రాయంటి నా చంటివాడా పాట సాహిత్యం

 
చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి 

పల్లవి
రారా రాయంటి నా చంటివాడా
రానే వచ్చాను నీ సోకుమాడా
లైటు తీసెయ్యి - లైఫ్ చూసెయ్యి
లబ్ధు మే సెయ్యి నరుడా వరుడా మరుడా త్వరగా

చరణం 1
చూపుల్తో పరువాల కృతులు పెంచుకో
ఊపులో ఉయ్యాల నడుము యిచ్చుకో
మిడిసిపడ్డ నా పడుచు పొంగుని పట్టేదెవరంట
గడుసు పిండము పడుచు గండము నేనే నీ కంట
దమ్ముంటే రారా - సొమ్మంతా నీదేరా
సయ్యాటే ఆడ - లెగరా మగడ తగదీ రగడ

చరణం 2
ఎన్నెన్నో తాళాలు ఓ వరస చూసుకో
నో నో నో అంటూనే నా దరువు చూసుకో
ఒంపు సొంపుల అప్పగింపులు చేస్తా రమ్మంట
చీకటింటిలో విత్తగింపులు చూస్తా లెమ్మంట
వడ్డిస్తా రారా - వయసంతా నీదేరా
వాటేసీ పోరా ఎగుడో దిగుడో లగువో బిగువో




అమ్మయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి 

పల్లవి:
అమ్మయ్యో ఆడొచ్చి ఈడొచ్చి గిల్లమాక పిల్లగాడా
అబ్బబ్బో చెంగిచ్చి చెయ్యిచ్చి వెళ్ళిపోకు పిల్లదానా
నీ చురుకు దుడుకు చూస్తుంటే
నీ వగలు సెగలు మేస్తుంటే
సిగ్గూ బుగ్గా అన్నీ చిక్కే మోత మోత మోతగా

చరణం: 1
చిలక పలికింది చిగురు తొడిగింది చెట్టుకొమ్మ వంచేయనా ఓ..
గువ్వ కులికింది గుండె పలికింది వెచ్చనైన ముద్దాడనా

చూసుకో ఓపిక యిప్పుడే గోపిక
చేసుకో తీరిక పుచ్చుకో కానుక
విందులు చేస్తే ముందుకు వస్తా ముద్దే యిచ్చేస్తా
అంతటితోటి ఆగకపోతే అన్ని యిచ్చేస్తా
అయితే గియితే నీ సొత్తే దోచేస్తా

చరణం: 2
పిట్ట పలికింది తేనె వలికింది  జోరు వలపు లందించనా
ఆకు వణికింది సోకు చిలికింది బంతిపూల పక్కేయనా

ఊపిరే ఆపినా చూపులే ఆగునా
ఆగవే అమ్మడూ రేగితే ఆగదు
ఒత్తిడి వీరా హత్తుకు పోరా ఒళ్ళే యిచ్చేస్తా
తాకిడి పిల్లా తట్టెడు పూలు తల్లో పెట్టేస్తా
ఓకే నీకే నా సోకు లిచ్చేస్తా




నిలేసుకో వలేసుకో పాట సాహిత్యం

 
చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి 

పల్లవి:
నిలేసుకో వలేసుకో ముడేసుకో పడేసుకో
ఎడా పెడా వరించుకో ఎగాదిగా జయించుకో
ఏసుకో వడ్డాణమూ ఏలుకో వయ్యారమూ
చూసుకో శృంగారమూ తీసుకో తాంబూలము
ఎదే ఒళ్ళుదాటి కన్ను గీటే కౌగిళ్ళలో
అదే పిచ్చిపట్టి రెచ్చగొట్టే సందళ్ళలో

నిలేసుకో వలేసుకో ముడేసుకో పడేసుకో
ఎడా పెడ వరించుకో ఎగాదిగ జయించుకో
అందుకో శృంగారమూ అందమే మందారము
అందులో నాకోసము వుందిలే మకరందము
చలే ఒంటబట్టి గంటకొట్టే నీ కళ్ళలో
సరే రెచ్చగొట్టి రేగిపోవే సందిళ్ళలో

చరణం 1
పిట్ట పలికిందమ్మో నా ఒక్ళో పండు దాచొద్దమ్మో
కొమ్మ వొణికిందయ్యో ఈనాడే కాయలడగొద్దయ్యో
కొత్త చిలికి కోరిక కొంటె వలపు తీరక
తలుపు తట్టుకున్న పిలుపులన్ని వినిపించుకో
పెదవంచుల్లో తాపాలు జోకొట్టుకో
పొగ మంచుల్లో కౌగిళ్ళే ఆకట్టుకో
జతపడి అలజడి తపనలెన్నో రేగగా
ఆటు చలీ యిటు చెలీ యిక సరాగమాడగా

చరణం: 2
ఒళ్ళు చేసిందయ్యో ఒయ్యారం
తుళ్ళి పడుతుందయ్యో
కమ్ము కొచ్చిందంటే దుమారం దుమ్ముదులిపేనమ్మో
ఎన్ని పడుచు పొంగులో పడగలెత్తుతున్నవి
తడిసి మోపెడైన తళుకులన్ని తగిలించుకో
మొగమాటాలు సగమైతే చాలించుకో
బులపాటాలు తొలిసారి చెల్లించుకో
మన ఎదే విదిపొద అది మరీ మరీ సొద
త్వరవడి కలబడి యిక సరే సరీపద




పైనేమో నిబ్బరం కిందేమో సుబ్బరం పాట సాహిత్యం

 
చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి 

పల్లవి:
పైనేమో నిబ్బరం కిందేమో సుబ్బరం
అందుతునఅందమంతరం
అందుతున్న అందమంత అబ్బరం
సందెపొద్దు ముద్దులాట సంబరం
లేతసోకే పూతరేకు మేతనీకు మోతగా
కౌగిట్లో యిద్దరం కావాలి ఒక్కరం
చుక్క ఎన్నెలొచ్చినాక సుందరం
మాపటేళ మల్లెపూల మందిరం
ఈడు జోడు తోడు పెట్టి మోగడంతా జుర్రుకో

చరణం 1
చల్లగాలి కాటు సహించకు-పిల్లగాడి పేరు స్మరించుకో
పిల్లగాలి వేడి క్షమించకు-పిల్లదాన్ని కోరి వరించుకో
ప్రేమ లేఖలెన్నో సిరా ఒక్కటే
భామ చూపులెన్నో షరా ఒక్కటే
కౌగిలింతకున్న ఖరీదొక్కటే
దగ్గరైన జంట ధరా ఒక్కటే
జామ పండులా చేత చిక్కవా
జేమ్స్ బాండులా చెంప నొక్కవా (గేమ్స్ నేర్పవా)
Hellow. Challow, Pillow జోరు జోరుగా

చరణం 2
ఉప్పులేని కూడు భుజించకు. ఊపులేని దాన్ని వరించకు
ముద్దుతోనే పొద్దు పోనీయకు. ముద్దబంతులింక, దాచెయ్యకు
సరాగాలకొస్తే సరే అంటది

మరి కన్నె ఈడు మహా పిచ్చి !
బంతులాటకొస్తే బలేగుంటది
అంతులేని ప్రేమ అనే వెర్రిది
సోకు చూసుకో !బేక్ డాన్స్ లో
బ్రేకు వెయ్యకు  రొమాన్స్ లో
అటో... వేడివేడిగా




జర్రు జటక్కూ పోలీసు మామా పాట సాహిత్యం

 
చిత్రం: బందిపోటు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి 

పల్లవి:
జర్రు జటక్కూ పోలీసు మామా
లవ్ లటక్కూ లాఠీల భీమా
కత్తెర కష్టం చూస్తావా
కౌగిళ్ల పట్టు చూస్తావా
వస్తావా చూస్తావా ఆటకు పందెం ఆమ్మాడి యమ్మా

జర్రు జటక్కూ చక్కని చుక్క
లవ్ లటక్కూ చెమ్మల చెక్క
వేసిన ఎత్తులు చూశాలే! టక్కరి జిత్తులు కాశాలే!
చూస్తావా కాస్తావా దెబ్బకు దెబ్బా అబ్బ నీయబ్బ

చరణం 1
ఈడొచ్చి కూకున్నది అది కోడల్లె కూస్తున్నది
సోకెక్కువౌతున్నది అది నీ సొత్తు రమ్మన్నది
జంతరు మంతరు గంతులువేస్తే తంతర తందానా
చీటికి మాటికి జేబులు కొడితే చీకటి ఢిల్లానా
సరదాగా సంకెళ్లు వెయ్యి
ఎదలోనే ఖైదీని చెయ్యి
లూఠీ చేస్తే తంతాలే లాఠీ చార్జీ చేస్తాలే
నీ వెంటే నేనుంటా తిమ్మిరి లేడీ టక్కరి కేటీ

చరణం 2
పరుసుల్ని కొట్టెయ్యకే మంచి మనసుంటే దోచెయ్యవే
పరువాలు పెంచెయ్యకే వున్న పరువయినా దక్కించవే
ఉక్కిరి బిక్కిరి కౌగిలిపడితే కిక్కురు మంటావా
చిక్కని చెక్కిలి చేతికి యిస్తే చుక్కను పెడతావా
పడుచందం పందిరి వెయ్యి
గడుసందం కానుక లియ్యి
ఎన్నడూ లేని సిగ్గమ్మా పుట్టుకు వచ్చే తగ్గమ్మా
నీ జంటే నేనుంటా ముద్దుకు ముద్దూ రేపటి పొద్దు

No comments

Most Recent

Default