Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanchu Kagada (1984)





చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యన్. రామలింగేశ్వరరావు
విడుదల తేది: 28.09.1984



Songs List:



చీకట్లో శ్రీ రామ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, శైలజ

పల్లవి:   
చీకట్లో శ్రీ రామ వాకిట్లో జయరామ
వయసొచ్చెరా మేనమామా
చీకట్లో సిగ్గంత వాకిట్లో ఒగ్గేసి
వచ్చావులే ఓసిభామా
ఎన్నెట్లో కూకుంటే ఏడెక్కి నా ఒళ్ళు
కుట్టిందిరా ఎర్రసీమ
ఏడకుట్టింది ఓ కుర్రభామా
పాడుసీమ కుట్టనేల ప్రేమ పుట్టనేల
తిప్పలొచ్చే తీపిమామా

చరణం: 1
ఈడు వచ్చి ఒళ్ళు బలిసే ఒంటికున్న కళ్ళు మెరిసే
చిలకెంత కిస్తావే భామా పండెంత కిస్తావే భామా
బేరమాడే చూపు తెలిసే బెంగపడ్డా కళ్ళు తెలిసే
ముద్దిచ్చుకుంటావ మామా మూటిచ్చుకుంటావమామా
ఈ కళ్ళ ఆరాలు నీ కాళ్ళ బేరాలు
నాకాడ వద్దోసి భామా తట్ట తాకట్టు పెట్టెయ్యి భామా
నిన్ను కంట చూసిన్నాడే బుట్టలో పడ్డాను
నా జంట నువ్వేర మామా

చరణం: 2
రేతిరంతా రెప్పగొడవా మూతపడనీ కంటి గొడవ
ఏమిస్తే వస్తావు మామా మన సెంతకిస్తావు మామా
పిందెనాడే పిట్టముసిరె పండుగానే పైటలెగిరె
నా కెందుకే నువ్వు భామా నీ కేసు నాకొద్దు భామా
నీ కొత్త పాఠాలు నీ పక్కవాటాలు చూశానులే సుక్కమామా 
సందు చేశానులే సందమామా
నేను దారి తప్పాలేదు వేధించకే వెర్రి భామా




సింగారి సిగ్గే అందం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
సింగారి సిగ్గే అందం రంగేళి బుగ్గే అందం
ఆ రెంటికి వయసు ఎన్నేళ్ళమ్మా మనజంటకీ వలపు ఎన్నాళ్ళమ్మా
ఊరించకే ఉవ్విళ్ళమ్మా కవ్వించకే కౌగిళ్ళమ్మా
సిగ్గున్న బుగ్గే అందం ఆ బుగ్గ ముద్దే అందం
నా ఒంటికి వయసు కొన్నేళ్లైనా నీ జంటలో వలపు నూరెళ్ళయ్యా 
దరిచేరుకో మావుళ్ళయ్యా దరువాతరో మద్దెళ్ళయ్యా

చరణం: 1
గెలలేసే పరువాలలో భామా
నిలవేసే అందాలలో నీలో చక్కనిదీ  దక్కనిదీ ఓటున్నది
మక్కువకీ మల్లె పొద చాటున్నది
వళ్ళంతా వలవంతలూ మావా
వయసమ్మ గిలిగింతలు నీలో అడగనిదీ ఇవ్వనిదీ ఓటున్నది
ఇవ్వనిదీ ఇచ్చుకొనే చోటున్నది
పొగరెక్కి సిరి సైటా ఎగిరిందిలే
సొగసంతా నా కంటా ఇగిరిందిలే రెచ్చకొట్టనేల చిచ్చూ పెట్ట నేల
నన్నడిగితే ఏమి చెబుతానయ్యా
ఉడికెత్తీ నా వయసు ఇంతేనయ్యా
కులు కెందుకే కుచ్చిళ్ళమ్మా చలి పెంచకే సందిళ్ళమ్మా  

చరణం:  2
పసి ఈడూ కసిగున్నది మావా
పగబట్ట మంటున్నది రావా రేపటికీ మాపటికి ముద్దున్నదీ
చీకటికీ వెన్నెలకీ సిగ్గన్నదీ
పువ్వంటీ ఒడి వున్నది భామా పులకింతవడిగున్నది రావా
గుమ్మెత్తిపోయేటి సొగసున్నదీ గుమ్మాలూ దాటించమంటున్నదీ
పరువాల పరువింక నిలపాలిలే నెలవంక ఇలవంక దింపాలిలే
కక్షపుట్ట నేల కన్ను కొట్టనేల
నన్నడిగితే ఎట్టా చెబుతానమ్మా నిన్నడిగి చెప్పేదీ చేస్తానమ్మా
సన్నజాజులా సంకెళ్ళయ్యా నీ కళ్ళలో నా ఇళ్ళయ్యా!




వైశాఖ మాసాన పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మ
అషాఢ మాసాన వానొచ్చెనమ్మ
చినుకు పడ్డా వేళా చికటొచ్చే వేళ
చినవాడి మీదే మనసాయెనమ్మ
కాదు కాదు వానజల్లు కన్నె ఈడు తేనె ముల్లు
వైశాఖమాసాన వయసొచ్చెనమ్మా
వయసన్నదే గాలి వానంటిదమ్మా
వాననొచ్చే వేళ వరదపొంగే వేళ
వాటేసుకోకుంటే బతుకెందుకమ్మా
ఆగిపోదు వానజల్లూ కౌగిలింతే నీకు ఇల్లూ
గుండె చాటు గూటిలో గుట్టులాంటి చోటులో
తొలిసారిగా నీకు తోడవ్వనా
చలిగాలిలో నీకు వేడవ్వనా
నల్లమబ్బు నీడలో పిల్ల దాని పైటలో
చిరుగాలిగా దూరి సిగ్గంటనా
చినుకల్లే నీ లేత బుగ్గంటనా
చీమలాగ కుట్టిందీ తేమ ఇప్పుడూ
చిచ్చు పెట్టి చంపిందీ వాన ఇప్పుడూ 
వానవల్ల తెలిసింది వయసు చప్పుడూ
కన్నె సోకూ వానవిల్లూ
కన్ను సోకీ పూలజల్లూ
మబ్బుచాటు ఎండలా మండుతున్న గుండెలో
నీ అందమే కాపు పెట్టెయ్యనా
నీ కాపురం నేను చేసెయ్యనా
కౌగిలింత ఖైదులో ఘాటు ప్రేమ శిక్షలో
తాపాల తాళాలు వేసెయ్యనా
నిను జన్మఖైదీని చేసెయ్యనా
ఒంపులెన్నో చూశాను ఒక్క సారిగా
చూడగానే పుట్టింది వేడి కోరికా
ఒంటి కంటుకున్నాది పైటజారక
వాన వచ్చి వయసు గిల్లి
పొంగి పోయే పాలవెల్లి





ఒక మజిలీ ఏసుకో మావా పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, కె.చక్రవర్తి

పల్లవి:
ఒక మజిలీ ఏసుకో మావా
ఈ బిజిలీ నీదిరా మావా
చుక్కుందీ చీకుందీ చింతచిగురు చేపుందీ
పట్టుబట్టి దిట్టంగా లాగించుమావా లాగించవా
హహహహ...

చరణం: 1
ఉడుకునీళ్ళతో తలకు పొయ్యనా
తళుకు విందుకీ తలుపు తియ్యనా
గుడిసెలోకి వస్తే కన్నె పడుచూ నీదే
పడుచు వళ్ళోకొస్తే సొగసులన్నీ నీవే
అడవిమల్లి తొడిమల్తో పక్కవెయ్యనా
అత్తరేసి దుప్పితోలు దుప్ప టెయ్యనా
గూడుందీ గువ్వుందీ లేతకణుజు కూరుందీ
లాగించుమావా లాగించవా

చరణం: 2
పడుచుదిండునే పరిచి పెట్టనా
వయసుపండునే వలిచి పెట్టనా
దరికి చేరేవేళ దరువులెన్నో వేస్తా
అలిసివున్న నీకు ఆరువులెన్నో ఇస్తా
చందమామ నరగదీసి గంధ మెయ్యనా
సందకాడ కాకపుడితె సలవ చెయ్యనా
బల్లెల్తో బాకుల్తో పక్కల్లో పనిలేదు సెక్కెయ్యి
మావా సిప్పాయిమావా




తుమ్మెద మంత్రం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

వల్లవి: 
తుమ్మెద మంత్రం చదువుతుంటే
కోయిల మేళం వాయిస్తుంటే
చిలకమ్మ పెళ్ళికూతురాయెనే 
గోరింక పెళ్ళికొడుకాయెనే
చిలకమ్మ పెళ్ళికూతురాయెనే 
గోరింక పెళ్ళికొడుకాయెనే

చరణం: 1
మందార తేనెల్లోన తానాలు చేయించి
మరుమల్లె గంధాలు ధూపాలు వేయించి
వేగుచుక్క బుగ్గన పెట్టి 
పొద్దుపొడుపు బొట్టుగ పెట్టి
కన్నులపిగ్గూ కాళ్ళకుచుట్టి 
కలికీ చిలకా కదిలొస్తుంటే
ఆణిముత్యాలే ఆలూమగలయ్యీ
ఆణిముత్యాలే ఆలూమగలయ్యీ
జాజిపూల మంటపాన జంటకలిసి పోయే వేళా 


చరణం: 2
సురపొన్న నీడల్లోన విరిశయ్య వేయించి
పొదరింటి గడపల్లోనా పగడాలుచల్లించి
వెన్నెలంతా చీరకట్టి తారలన్నీ సిగలో పెట్టి
అందమైన పొంకాలన్నీ గంధమల్లే ఇగిరేవేళ
రాసలీలల్లో రాణివాసాలే
రాసలీలల్లో రాణీవాసాలే
మూడుముళ్ళ మండపాన ఏడుజన్మ లడిగే వేళ 



కదం తొక్కి కదులుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: అదృష్టదీపక్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల & బృందం

పల్లవి: 
కదం తొక్కి కదులుతోంది కంచుకాగడా
కదనానికి సాగుతోంది క్రాంతి బావుటా
యుగయుగాల చీకటిపై పగబట్టిన కాగడా
తరతరాల దోపిడిపై తిరుగుబాటు బావుటా

చరణం: 1
ఆకలి కడుపుల చీకటి బ్రతుకుల
అరణ్యరోదన ఎన్నాళ్ళు... ఇంకెన్నాళ్ళు
సాటి మనిషి పై నిరంకుసంగా
అన్యాయానికి బలై పోయిన అన్నదమ్ములూ
వేస్తున్నానే పొలికేక
రంకెలు పెడుతూ రణరంగానికి
కలిసిరండిరా కడదాకా

చరణం: 2
ప్రచండ వేగ ప్రభంజనంలా
ప్రభాతానికై పయనిద్దాం
పిడుగుపాటుగా ప్రతిధ్వనిస్తూ
పీడకులను తుదముట్టిద్దాం
విలయరుద్రులై వీరభద్రులై
విచ్చుకత్తులను ఝుళిపిద్దాం
రక్కసిమూకల గుండెలు చీల్చి
రక్తవసంతం చిందిద్దాం
రక్తవసంతం చిందిదాం..



Kanchu Kagada (Bit Songs)

 
చిత్రం: కంచుకాగడా (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 


No comments

Most Recent

Default