Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ali Baba 40 Dongalu (1970)



చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత
మాటలు: డి.వి.నరసరాజు
దర్శకత్వం: బి.విఠలా చార్య
సినిమాటోగ్రఫీ: హెచ్. యస్.వేణు
ఎడిటర్: కందస్వామి
నిర్మాత: యన్. రామబ్రహ్మం
బ్యానర్: శ్రీ గౌతమ్ పిక్చర్స్
విడుదల తేది: 04.04.1970

పల్లవి:
చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే
ఒంటిగా నేనుండజాలరా నా వన్నెకడా
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ

చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే
ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ

చరణం 1
చల్లగాలి సోకితే ఒళ్ళు..ఝల్లు మంటాది
నీళ్ళు జల్లుకుంటేనే..నిప్పులా వుంటాది
చల్లగాలి సోకితే ఒళ్ళు..ఝల్లు మంటాది
నీళ్ళు జల్లుకుంటేనే..నిప్పులా వుంటాది

నివురాక నిదుర రాదురా.. నా సిన్నవాడ
నివు లేక బతుకులేదురా.. నా సిన్నవాడ
నివు లేక బతుకులేదురా.. నా సిన్నవాడ

చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే
ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా

వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ

చరణం: 2
 నీడలా నీవెంట తోడుగా ఉండల
నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండల
ఆ...  ఆ...  ఆ...  ఆ...  ఆ..  ఆ..  ఆ..  ఆ...  ఆ
నీడలా నీవెంట తోడుగా ఉండల
నీ కౌగిట ఉయ్యాల నేను ఊగుతుండల

నా కలలు నిజాము చేయరా
నా కోడేకాడ నా అందం విందు చేతురా
నా కోడేకాడ నా అందం విందు చేతురా

చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయే
ఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడా
వయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ
వయసెవ్వారి పాలు జేతురా ...


*****   ******   ******


చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
లా...ల..లల.లా.లలాలాలా
ఆకతాయి .. ఒట్టి ఆకతాయి ..
హ.. హా .. హా

రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్

చరణం: 1
నీ కోసమే రేయి ఆగింది
నిను చూసి తనువేమో రేగింది
మదిలోని సెగలోన మరిగింతునోయి
మదిలోని సెగలోన మరిగింతునోయి
దిక్కుల తీరే చుక్కల లోకం చూపించేనోయీ..ఈ..

రావోయి రావోయి రాలుగాయి..

చరణం: 2
కొండల్లో తిరిగేటి సింహాము
వేసింది కుందేటి వేషము
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
మంచి తరుణం ఇది.. మించి పోవునని మాటు వేసినోయీ..ఈ..

రావోయి రావోయి రాలుగాయి..

చరణం: 3
కొల్లగొట్టి కోటలెన్నో కట్టారు
కత్తుల బోనులో కాలు పెట్టారు
పులినోట తల దూర్చి పోలేరులే
పులినోట తల దూర్చి పోలేరులే
ఎత్తులు జిత్తులు ఎన్నైనా గమ్మత్తుగ చిత్తవులే..ఏ..

రావోయి రావోయి రాలుగాయి

మక్కువయేలేని మగువ పక్కలోన బల్లెము
కంగారైతే కలిసొచ్చే కాలమే కాదురోయ్
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
ఇంటిలోన సర్కారేమో భలే ఇరుకున పడ్డారూ..ఊ..

రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్
రావోయి.. రావోయి.. రావోయి..


*****   ******   ******


చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నీలో..ఓ.. నేనై.. నేనై.. నేనై..
నాలో..ఓ.. నీవై.. నీవై.. నీవై

నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

చరణం: 1
పడమట సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగి చూసి
కారు చీకటి దారిలోనే
కాంతి విరబూసె

ఆహహా.. హహా.. హహా.. ఓహోహో..హొహో..హొహో..

పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లిని వీడి
కన్నె మనసే తీగ లాగా కాంతుని పెనవేసె..
ప్రియ కాంతుని పెనవేసె

నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

చరణం: 2
నీలాకాశం నీడలోన
నిండు మమతల మేడలోన
గాలిలాగా పూలలాగా తేలి పోదాము

ఆహహా..హహా.. హహా.. ఓహోహో..హొహో..హొహో..

వలపులోన మలుపులు లేక
బ్రతుకులోన మెలికలు లేక
వాగులున్నా వంకలున్నా.. సాగి పోదాము
చెలరేగి పోదాము..

నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

ఆ..హహహహాహ... ఓహొహొహొహోహొ..

No comments

Most Recent

Default