Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Toli Choopulone (2003)


చిత్రం: తొలిచూపులోనే  (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: రాజేష్, హరిణి
నటీనటులు: కళ్యాణ్ రామ్, ఆకాంక్ష
దర్శకత్వం: వై.కాశీవిశ్వనాధ్
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 09.10.2003

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
ఏమ్మాయో చేసావో మరి
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
ఏమ్మాయో చేసావో మరి
వెన్నెల చూస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావు
ఏం మత్తు జల్లావో మరి

నిను చూస్తే ఆగదు మనసు
క్షణమైనా యుగమని తెలుసు
నిను చూస్తే ఆగదు మనసు
క్షణమైనా యుగమని తెలుసు
నువు పక్కన ఉంటే పగలు రేయి ఒకటే నాకు

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
ఏమ్మాయో చేసావో మరి

ఉరికే గోదావరి నదిలా
మనసే ఉప్పొంగుతు ఉంది
పరువం ప్రాయం నావేనని
ఎగిరే ఆ గువ్వని చూస్తే
మనసే రివ్వంటూ ఉంది
నీతో కలిసి ఉండాలని
చేరలేక వేరే దారిలేక
ఆగలేక ఆశను దాచలేక
ఉవ్వెత్తున కెరటంలా
నిన్ను చేరుకోవాలని
ఉహల్లో నీతో కలిసి
ఊసులాడు కోవాలని
మనసేమో నీకోసం వెతుకుతూవున్నది
వేయి కళ్లతో నీకై తానే ఎదురుచూస్తున్నది

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
ఏమ్మాయో చేసావో మరి

వచ్చే మరు జన్మ కూడా
నువ్వే నా ప్రియుడై పుడితే
నన్నే నువ్వు చేరాలని
గుడిలో ఆ దేవత కూడా మనసారా దీవించింది
నువ్వు నేను ఒకటవ్వాలని
చెప్పలేక మనసే విప్పలేక
సిగ్గుతోటి బుగ్గలు కందిపోగా
ఆ స్పందన నాలో ఏదో ఆనందం కలిగిస్తుంటే
ఆరాధన నా కన్నులలో
హారతిగా వెలుగుతువుంటే
నీకోసం నా హృదయం కలవరిస్తున్నది
కోటి కళ్ళతో ఎన్నో తియ్యని కలలు కంటున్నది

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
ఏమ్మాయో చేసానో మరి
వెన్నెల చూస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావు
ఏం మత్తు జల్లానో మరి

నిను చూస్తే ఆగదు మనసు
క్షణమైనా యుగమని తెలుసు
నిను చూస్తే ఆగదు మనసు
క్షణమైనా యుగమని తెలుసు
నువు పక్కన ఉంటే పగలు రేయి ఒకటే నాకు





No comments

Most Recent

Default